భూ మిమీద వృక్షాలు, జంతువులు, మానవాళి మను గడకు, వాటి పెరుగుదలకు గాలి తరువాత ముఖ్యమై నది నీరు. కానీ నీటి లభ్యత కంటే దాని నాణ్యత మరింత కీలకం. భారతదేశంలో ప్రస్తుతం ఎదురవుతున్న నీటి సంక్షో భం కేవలం నీటికొరత సమస్య మాత్రమే కాదు, అది ప్రజా ఆరోగ్యానికి, ఆర్థిక-వ్యవస్థకు, భవిష్యత్తు తరాలకు సంబం ధించిన పెను ముప్పుగా మారింది. తాజా ప్రభుత్వ నివేది కలు, శాస్త్రీయ అధ్యయనాలు, పార్లమెంటు వేదికగా వెల్లడైన గణాంకాలు చూస్తే దేశం తాగుతున్న నీటి నాణ్యతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. దేశజనాభాలో అధిక శాతం ప్రజలు భూగర్భ జలాలపై ఆధారపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చేతి పంపులు, బావులు, చెరువులు ప్రధాన వనరులు కాగా, పట్టణాల్లో కూడా బోరువెల్సైపై ఆధారపడే కుటుంబాలు గణనీయంగా ఉన్నాయి. అయితే తాజా భూ గర్భ జలాల నాణ్యత అంచనాల ప్రకారం సేకరించిన నమూ నాల్లో గణనీయమైన శాతం నీటిలో నిర్దేశిత ప్రమాణాలను మించిన కాలుష్యాలున్నట్లు గుర్తించారు. నైట్రేట్, ఫ్లోరైడ్, ఆర్సెనిక్, ఇనుము, సీసం, కాడ్మియం, క్రోమియం, యురే నియం వంటి లోహాలు అనేక రాష్ట్రాల్లో ప్రమాదకర స్థాయి లో ఉన్నట్లు వెల్లడైంది.
Read Also : China: AI లో నంబర్ వన్‌గా డ్రాగన్.. రివర్స్ AI ట్రేడ్ చేస్తున్న భారత్
నిశ్శబ్ద ఆరోగ్య సంక్షోభం
కొన్ని రాష్ట్రాల్లో లీటరుకు అనుమ తించిన పరిమితిని మించి ఆర్సెనిక్ ఉండటం వల్ల దీర్ఘకాలంలో చర్మ వ్యాధులు, క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. ఇనుము అధికమైతే నాడీ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. సీసం పిల్లల మెదడు అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కాడ్మియం, యురేనియం వంటి లోహాలు మూత్రపిండాల వ్యాధులకు, కణితుల ప్రమాదానికి కారణమవుతాయి. పార్లమెంటు వేదికగా వెల్లడైన గణాంకాల ప్రకారం వందలసంఖ్యలో జిల్లాలు ఫ్లోరైడ్, ఆర్సెనిక్, ఇనుము, లవణీయత, నైట్రేట్ సమస్యలతో బాధపడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో యురేనియం కూడా గణనీయంగా గుర్తిం చబడింది. దేశవ్యాప్తంగా లక్షలాది ప్రజలు ప్రతిరోజూ కనీసం రెండు లీటర్ల నీరు తాగుతారు. ఆ నీటిలో స్వల్ప పరిమాణంలోనైనా విషపూరిత లోహాలు ఉండటం వలన సంవత్స రాల పాటు శరీరంలో అవి చేరి అనారోగ్యాలకు దారితీస్తున్నాయి. ఇది ఒక నిశ్శబ్ద ఆరోగ్య సంక్షోభం. ప్రజలు తాగుతున్న నీరు శుద్ధమని నమ్ముతున్నప్పటికీ, వాస్తవానికి అది వారి ఆరోగ్యాన్ని మెల్లగా దెబ్బతీస్తోంది. నీటి సంక్షోభం (Water crisis) కేవలం నాణ్యత సమస్య మాత్రమే కాదు, పరిమాణ సమస్య కూడా. దేశానికి లభించే త్రాగునీటి వనరులు ప్రపంచ స్థాయిలో పరిమితంగా ఉన్నప్పటికీ, జనాభా భారంతో డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది.
కలుషిత నీటివల్ల కలిగే వ్యాధుల
గతంలో విడుదలైన సమగ్ర నీటి నిర్వహణ సూచిక నివేదిక ప్రకారం రాబోయే సంవత్సరాల్లో నీటి డిమాండ్ ప్రస్తుత సరఫరా కంటే రెండింతలు కావచ్చని అంచనా. కొన్ని అంచ నాల ప్రకారం 2030 నాటికి దేశ జనాభాలో గణనీయమైన శాతం ప్రజలు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది. వ్యవసాయ రంగం మాత్రమే దేశ నీటి వినియోగంలో సుమారు ఎనభై శాతం వాటాను కలిగి ఉండటం వల్ల భూగర్భ జలాలపై ఒత్తిడి మరింత పెరుగు తోంది. ప్రభుత్వం ఈ సమస్యను ఎదుర్కొనేందుకు పలు పథకాలను ప్రారంభించింది. 2019లో ప్రారంభమైన జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి గ్రామీణ ఇంటికి పైప్ లైన్ ద్వారా తాగునీరు అందించాలనే లక్ష్యం పెట్టుకున్నారు. గణ నీయమైన పురోగతి సాధించినప్పటికీ అన్ని కుటుంబాలకు సురక్షిత నీరు చేరేదశ ఇంకా పూర్తికాలేదు. పట్టణప్రాంతాల కోసం అమృత్ 2.౦ పథకం అమల్లో ఉంది. అయినప్పటికీ నీరు రాష్ట్ర అంశమని కేంద్రం స్పష్టం చేస్తూ బాధ్యతను రాష్ట్రాలపై ఉంచుతోంది. వాస్తవానికి ఈ సంక్షోభం(Water crisis) కేంద్రం, రాష్ట్రాలు, స్థానిక సంస్థలు, సమాజం కలిసి పరిష్కరించా ల్సిన జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశం. నీటి కాలుష్యం ఆరోగ్య రంగంపై కూడా భారంగామారుతోంది. కలుషిత నీటివల్ల కలిగే వ్యాధుల చికిత్సకు ప్రజలు భారీగా ఖర్చు చేస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలకొరత వల్ల పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోంది. పరిశుభ్రమైన నీరు అందక ప్రతి ఏడాది లక్షలసంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని పలు నివేదికలు హెచ్చరించాయి. భూగర్భ జలాలు అడుగంటిపోతుండటంతో పాటు వాటి నాణ్యత కూడా క్షీణించడం ద్వంద్వ సంక్షోభాన్ని సృష్టిస్తోంది. ఇప్ప టికైనా శాస్త్రీయ ఆధారిత నీటి నిర్వహణ విధానాలు అమ లు చేయాలి. వర్షపు నీటి సంరక్షణ, చెరువుల పునరుద్ధరణ, పారిశ్రామిక కాలుష్య నియంత్రణ, వ్యవసాయంలో నీటి సమర్థవినియోగం, గ్రామీణ స్థాయిలో నీటి పరీక్షా సదు పాయాల ఏర్పాటు వంటి చర్యలు అత్యవసరం. ప్రజల్లో అవగాహన పెంచి నీటి వృథాను తగ్గించడం కూడా సమా నంగా ముఖ్యం. కేవలం పథకాలు ప్రకటిస్తే సరిపోదు. అమ లుదశలో పారదర్శకత, నిరంతర పర్యవేక్షణ అవసరం. మొత్తంగా చూస్తే దేశం నీటి విషయంలో ఒక కీలకమలుపు వద్ద నిలిచింది. పరిశుభ్రమైన తాగునీరు అందించడం ప్రభు త్వాల ప్రాథమికబాధ్యత. కానీ అదిసాధించాలంటే రాజకీయ సంకల్పం, శాస్త్రీయ దృష్టికోణం, సమగ్ర ప్రణాళిక, ప్రజల భాగస్వామ్యం అన్నీ కలగాలి. లేకపోతే నీటికొరత, కాలుష్యం కలిసి దేశాన్ని ఆరోగ్య సంక్షోభ దిశగానెట్టే ప్రమాదం ఉంది. నీరు జీవమైతే, దాని రక్షణే భవిష్యత్తు రక్షణ.
-ఈ శ్రీనివాసరావు
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: