हिन्दी | Epaper

Livestock wealth: పశు సంపద పెంచితేనే.. స్వచ్ఛమైన పాలు

Sudha
Livestock wealth: పశు సంపద పెంచితేనే.. స్వచ్ఛమైన పాలు

ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వార్త కల్తీ పాలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మదిలో మెదులుతున్న సందేహం పిల్లలు త్రాగే పాల మొదలు ఇంట్లో వంటకు వాడే పదార్థాల వరకు కల్తీనే అని చెప్పవచ్చు. పెద్ద పెద్ద హోటల్స్ కూడా ప్రామాణికాలు పాటించడం లేదని ఫుడ్ కమీషన్ వారే తెలిపారు. మనం తీసుకునే ఆహార పదార్థాల నుండి ఆరోగ్యానికై వేసుకునే మందుల వరకు కల్తీ దీంట్లో ఇప్పుడు ప్రధానమైన అంశం కల్తీ పాలు. వివిధ రసాయనా లతో నాసిరకం పదార్థాలతో పాలు తయారు చేస్తున్నారని ఆరోపణ, దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో కల్తీ పాలు తాగి ఆస్పత్రి పాలు అయిన చిన్నారులు, పెద్దల పరిస్థితి చూస్తూనే ఉన్నాం. అనారోగ్యులు శక్తి కోసం పాలు తీసు కుంటారు. ఆ పాలలో కూడా నాణ్యత లేదు అంటే వారి ఆరోగ్య పరిస్థితి ఏంటో మనమే అర్థం చేసుకోవాలి. పెరిగిన ప్రపంచీకరణలో అంతరించిపోతున్న పశు సంపద (Livestock wealth) పెరుగు తున్న జనాభాకు సరిపోను మంచి పాలు అందడం లేదు. వీటిలో స్వచ్ఛమైన పాలు ఏవో కల్తీ ఏవో తెలియకా కల్తీ పాలు త్రాగి అనేక రోగాల బారిన పడుతున్నారు. స్వచ్ఛమై న గేదే పాలు చూద్దామన్న కనిపించడం లేదు. దాదాపు రెండు దశాబ్దాల క్రింతం గ్రామీణ ప్రాంతాల్లో పశు సంపద వ్యవసాయంతో తులతూగుతూ రైతులకు ఆర్థిక ఆదాయంతో వెన్నుదన్నుగానిలిచింది. క్రమంగా పెరిగి ప్రపంచీకరణలో వ్యవసాయ భూమి తగ్గడంతో పాటు వ్యవసాయం చేసే వారు కూడా తగ్గుతున్నారు. రైతులకు జీవనాధారమైన వ్యవసాయం భూమిని నమ్ముకొని సాగు చేసిన అధిక దిగుబడి రాక తప్పని పరిస్థితులలో అనేక రసాయన ఎరువులు వాడుతున్నారు, ఇలా వాడకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సేంద్రియ ఎరువులు రైతులకు అందుబాటులోకి తీసుకు వచ్చి వాటిపై అవగాహన కల్పించాలి.

Read Also : IDFC Bank Scam: ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ కుంభకోణం

Livestock wealth
Livestock wealth

రసాయనాలతో పండించిన పంటలో నాణ్యతతో పాటు రుచిని కూడా కోల్పోతుంది. ప్రస్తుత సమాజంలో కొంత మందికి వ్యవ సాయ భూమి ఉన్న వ్యవసాయం చేయడానికి నామోషిగా భావిస్తూ ఉద్యోగాలకై పట్టణ ప్రాంతాలకు పరుగులు తీస్తు న్నారు కానీ భవిష్యత్తు కాలంలో వ్యవసాయానికి ప్రాధా న్యత పెరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా సేంద్రియ వ్యవ సాయానికి డిమాండ్ పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ సేంద్రియ ఎరువుల ద్వారా పండించిన కూరగాయలు, పంటకు అధిక ప్రాధా న్యత ఇస్తున్నారు ప్రజలు. భవిష్యత్తు కాలంలో కూడా రసాయనాలు లేకుండా పండించిన పంటకు మంచి ఆధా రణ ఉంటుంది. సేంద్రియ వ్యవసాయం పెరుగుతే పశు సంపద కూడా పెరుగుతుంది. ఎందుకంటే వ్యవసాయానికి పశు సంపదకు (Livestock wealth)అవినాభావ సంబంధం ఉంటుంది. పశుసంపదను ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు రైతులకు రాయితీలు ఇస్తున్న సద్వినియోగం చేసుకోవడము లేదు. భవిష్యత్తుతరం యువ రైతులదే కాబట్టి వారు సంపూర్ణ అక్షరాస్యులు. వారికి పరిజ్ఞానంతో అభివృద్ధి గడించాలని కోరుకుంటూ, రైతులు నష్టపోకుండా సేంద్రియ వ్యవసా యం, పశు సంపదను పెంచుతూపోతే లాభాల బాటలో ముందుకుపోయే అవకాశం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్లాస్టిక్ను రసాయనాలను అదుపు చేయాలని చెప్పుతునే సేంద్రియ వ్యవసాయానికి పెద్దపీఠ వేస్తుంది, అదే విధంగా వ్యవసాయం చేయడానికి ముందుకు వస్తున్న యువతకు ప్రభుత్వాలు వెన్నుదన్నుగా నిలబడితే భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన పాలు ఆహార పదార్థాలు అందించవచ్చు. పాడిరైతులకు అనేక రాయితీలు, సంక్షేమం ప్రభుత్వం అందిస్తున్న వాటిపై అవగాహన లేక ఉపయోగించుకోవడం లేదు.

Livestock wealth
Livestock wealth

రైతులకు రాయితీ సంక్షేమం చేరువ చేసే బాధ్యత సంబంధించిన వ్యవసాయ అధికారులపైనే ఉంది. ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలలో రైతు సదస్సులు నిర్వహించాలి. పశు సంపద పెంపుదలకు లక్ష్యంతో పని చేయాలి ప్రభుత్వాలు. కల్తీని నియంత్రిస్తేనే నిజమైన పాడి రైతులకు న్యాయం కూడా జరుగుతుంది. ప్రజా ఆరోగ్యం కుదట పడుతుంది. వ్యవసాయం లాభదాయకమైనప్పుడు వ్యవసాయ ఉత్పత్తులను చేయడానికి యువతరం ముందుకు వస్తుంది. కల్తీపాలతోపాటు కల్తీ ఆహార పదార్థాలను తయా రు చేసే వారిపై కఠినమైన చర్యలు తీసుకునే విధంగా కొత్త చట్టాలు తీసుకువచ్చినప్పుడే ప్రజలకు నాణ్యమైన పోషకాహా రం అందించగలం. ప్రపంచంలో 33 శాతం పశు సంపద భారత దేశంలో ఉన్న ప్రజలందరికి సహజమైన పాలు దొర కటం లేదు. యాంత్రిక పెరుగుదల వల్ల సాంప్రదాయ పశు సంపద, వ్యవసాయం క్రమంగా పల్లె ప్రాంతాలలో మందగి స్తుందని చెప్పాలి. వ్యవసాయ ఆధారిత ప్రాంతాలైన ఆంధ్ర, తెలంగాణలో కూడా స్వచ్ఛమైన పాలకొరత ఉందని చెప్ప డానికి ప్రస్తుత సంఘటనలే నిదర్శనం. గేదే పాలు సాధారణ మైన ధర ఉన్న ఆవు, మేక, గొర్రె పాలకు విపరీతమైన డిమాండ్ ఉంది, అందుకే పాడి పంటల వైపు యువత రావాలి. భవిష్యత్తులో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు పశు, వ్యవసాయంతో విరివియాలని ఆశిద్దాం.
-మిద్దె సురేష్

Read hindi news : hindi.vaartha.com

Epaper :epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870