ప్రశ్నలే పురోగతికి పునాది, ప్రతి మనిషిలోనూ పుట్టుకతోనే ఒక ఆలోచనాపరుడు దాగి ఉంటాడు. ఒక చిన్నారి మొదటిసారి ఎందుకు?” అని అడిగే క్షణం నుంచే ఆలోచన ప్రారంభమవుతుంది. ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలనే తపన, చూసినదాన్ని విచారించాలనే స్వభావం, తెలియని దాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి ఇవే మానవ మేధస్సుకు పునాది. చిన్న పిల్లలను గమనిస్తే ఇది స్పష్టంగా కనిపిస్తుం ది. ఒక చీమ నడుస్తుంటే దాన్ని ఎందుకు
చూస్తుందో, ఆకాశం నీలంగా ఎందుకు ఉంటుందో, పక్షులు ఎగరగలు గుతాయో వారి ప్రశ్నలకు అంతం ఉండదు. ఈ ప్రశ్నల వెనుక ఉన్నది అల్లరికాదు, అది సృజనాత్మక మేధస్సు. కానీ సమాజం, కుటుంబం, వ్యవస్థ ఈమూడింటిలో ఎక్కడో ఒకచోట ఆ ప్రశ్నల ప్రవాహం అడ్డుకుంటూ పోతుంది. ఇంత ప్రశ్నలు అడగకు, నిశ్శబ్దంగా ఉండు, ఇది అలాగే ఉంటుంది. అనే సమాధానాలు చిన్నారి ఆలోచన తలుపులు మూసేస్తాయి. ప్రశ్నించడం ఆగిన చోట ఆలోచన ఆగిపోతుంది. ఆలోచన ఆగిన చోట సృజన (Children’s creativity)క్షీణిస్తుంది. ఇప్పుడేమో మరో సవాలు మన ముందుంది డిజిటల్ ప్రపంచం. ఇది జ్ఞానానికి ద్వారం కూడా. అదే సమయంలో మేధస్సును మాయలో ముంచే శక్తి కూడా దానిదే. అందుకే ఈ ప్రశ్న తప్పనిసరిగా అడగాలి. డిజిటల్ యుగంలోమన పిల్లల ఆలోచనా స్వాతంత్ర్యాన్ని ఎలా కాపాడాలి?. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచాన్ని మన చేతిలో పెట్టింది. సమాచారం క్షణాల్లో
అందుబాటులోకి వస్తోంది. విద్య, వినోదం, సంభాషణ అన్నీ ఒకే పరికరంలో అందుబాటు లోకి రావడం వల్ల ఈ సౌలభ్యం మానవ జీవితాన్ని సులభతరం చేసింది. అయితే అదే సాంకేతికత చిన్నారుల సహజ ఆలోచనా ప్రక్రియపై ప్రతికూల ప్రభావం చూపు తోందనే ఆందోళనలు పెరుగుతున్నాయి.
Read Also : Rajasthan: అయ్యో.. గుండెపోటుతో అనంత లోకాలకు వెళ్లిన చిన్నారి!
నేటి పిల్లలకు ఆడుకునే మైదానం కంటే మొబైల్ స్క్రీన్ ఎక్కువ ఆకర్షణీ యంగా మారుతోంది. కథల పుస్తకం కంటే వీడియో ఎక్కువ ఆసక్తికరంగా కనిపిస్తోంది. శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నది ఏమిటంటే ఐదేళ్లలోపు పిల్లలకు ప్రత్యక్ష సంభాషణ, కథలు, పాటలు, అనుభవాత్మక ఆటలు అత్యవసరం. ఇవి మెదడులోని నాడీకణాలు అనుసంధానాలను బలపరుస్తాయి. భాషా నైపుణ్యం, జ్ఞాపకశక్తి, భావ వ్యక్తీ కరణ, సామాజిక నైపుణ్యాలు, ఇవిప్రత్యక్ష మానవ సంబంధాల ద్వారానే మెరుగుపడతాయి. కానీ అధిక స్క్రీన్ టైమ్ వల్ల పిల్లల్లో కొన్ని సమస్యలు పెరుగుతున్నాయని అనేకఅంతర్జాతీయ పరిశోధనలు సూచిస్తున్నాయి. ఏకాగ్రత లోపం ఆందోళన, చిరాకు నిద్రలేమి సామాజిక వేరుపాటు తక్షణ ఫలితాలపై ఆధారపడే అలచాటు డిజిటల్ కంటెంట్ ఎక్కువగా వేగవంతంగా, రంగుల మయంగా, తక్షణ స్పంద నలతో రూపొందించబడుతుంది. దీనివల్ల పిల్లల మెదడు చిరంతరం ఉత్తేజిత స్థితిలో ఉంటుంది. నెమ్మదిగా ఆలోచిం చడం, లోతుగా చదవడం, విశ్లేషించడం వంటి నైపుణ్యాలు తగ్గే ప్రమాదం ఉంది. ప్రపంచ దేశాలు ఈ అంశాన్ని గంభీరంగా పరిగణిస్తున్నాయి. అమెరికాలో 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా ఖాతాలపై పరిమితులు ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ డిజిటల్ సేవల చట్టం ద్వారా పిల్లల రక్షణకు కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ఆస్ట్రేలియా వయోపరిమితి అమలులోకఠిన విధానాలు తీసుకొస్తోంది. దక్షిణ కొరియా ఆన్లైన్ గేమింగ్ నియంత్ర ణకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. చైనా మైనర్లకు గేమింగ్ సమయాన్ని పరిమితం చేసింది. ఈ చర్యలు ఒక స్పష్టమైన సందేశం ఇస్తున్నాయి. సాంకేతికతను నిరాకరించడం కాదు, దాన్ని నియంత్రించడం అవసరం. పిల్లల డిజిటల్ అలవాట్ల నియంత్రణ రూపకల్పనలో తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకం. పిల్లలు చెప్పిన మాటల కంటే చూసిన ప్రవర్తనను ఎక్కువగా అనుసరిస్తారు. పెద్దలు ఎప్పుడూ ఫోన్లో ముని గితే, పిల్లలు కూడా అదే మార్గాన్ని అనుసరించడం సహ జం. కాబట్టి కుటుంబం నుంచే నియంత్రణ ప్రారంభం కావాలి. ఇంట్లో స్క్రీన్ టైమ్పై స్పష్టమైన ప్రణాళిక ఉండా లి. భోజనం, నిద్ర సమయంలో పరికరాలను దూరంగా ఉంచాలి. కుటుంబ సభ్యులంతా కలిసి సంభాషణకు, పుస్తక పఠనకు, బహిరంగ ఆటలకు సమయం కేటాయించాలి.
పిల్లలతో సోషల్ మీడియా గురించి తెరవెనుక చర్చించాలి. ఆన్లైన్లో ఎదురయ్యే ఇబ్బందులను వారు స్వేచ్చగా పంచుకునే వాతావరణం కల్పించాలి. భయం కాకుండా అవగాహన కలిగించాలి. నియంత్రణ కాకుండా దిశానిర్దేశం చేయాలి. పాఠశాలలు కూడా బాధ్యత వహించాలి. డిజిటల్ సాక్షరతను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలి. ఆన్లైన్ భద్రత, సమాచార విశ్లేషణ, బాధ్యతాయుత వినియోగం వంటి అం శాలను బోధించాలి. ప్రభుత్వాల స్థాయిలో కూడా కఠిన చర్యలు అవసరం. వయస్సు, ధృవీకరణ విధానాలను కచ్చి తంగా అమలు చేయాలి. హానికర కంటెంట్పై కఠిన నియం త్రణలు ఉండాలి. డిజిటల్ వ్యసనంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. కృత్రిమ మేధస్సు (ఎఐ) విద్యలో ఒక సాధనంగా ఉపయోగపడాలి. కానీ అది స్వతంత్ర ఆలోచనకు ప్రత్యామ్నాయంగా మారకూడదు. విద్యార్థి ఆలోచిం చాలి, సాంకేతికత సహాయం చేయాలి. సాంకేతికత మని షికి సేవ చేయాలి, మనిషి సాంకేతికతకు బానిస కాకూడదు. నియంత్రిత డిజిటల్ యుగమే సృజనాత్మక భవి ష్యత్తు బాల్యం అనేది భావిసమాజానికి పునాది. ఈ దశలో సృజనాత్మకత(Children’s creativity)ను అణచితే, రేపటిఆవిష్కరణలను మనమే అడ్డుకున్నట్టే. డిజిటల్ ప్రపంచాన్ని పూర్తిగా నిరాకరించడం సాధ్యం కాదు. కానీ దానిపై నియంత్రణ సాధ్యం. కుటుంబం జాగృతమైతే, పాఠశాల దిశానిర్దేశం చేస్తే, ప్రభుత్వం దృఢ విధానాలు అమలు చేస్తే మన భవిష్యత్ తరాలు మానసి కంగా ఆరోగ్యవంతమైనవిగా, సృజనాత్మకంగా, బాధ్యతా యుత పౌరులుగా ఎదుగుతారు. ప్రశ్నించే స్వభావాన్ని కాపా డాలి. ఆలోచించే సామర్థ్యాన్ని పెంపొందించాలి. సాంకేతిక తను సాధనంగా మార్చాలి. ప్రశ్నించడం ఆ పని పిల్లలే రేపటి ఆవిష్కర్తలు. ఆలోచనలు ఆ పని రేపటి సమాజమే శక్తివంతమైంది. నియంత్రిత డిజిటల్
వినియోగమే సృజనాత్మక భారత భవిష్యత్తుకు భరోసా.
-మేకిరి దామోదర్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: