📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Khammam Hydra: మంత్రులు కారు రియల్ఎస్టేట్ బ్రోకర్లు: కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు

Author Icon By Vanipushpa
Updated: February 27, 2026 • 1:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఖమ్మం(Khammam)లో గత మూడురోజులుగా పేదల ఇళ్లను హైడ్రా కూలుస్తున్న విషయం తెలిసిందే. వారికి ఏమాత్రం ముందస్తు హెచ్చరికలు జారీ చేయకుండానే హైడ్రా పేదలపై తన పంజాను విసరింది. ఎప్పటి నుంచో నివాసం ఉంటున్న ఆ పేదోళ్లపై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం దయచూపడం లేదని బీఆర్ ఎస్ నాయకుడు కేటీఆర్ విమర్శించారు. ఉన్నపళంగా హైడ్రా అధికారులు పేదల ఇళ్లను జేసీబీల సాయంతో కూల్చివేస్తున్నారు. పేదల ఇంటిని కూల్చి వేయడంతో వారికి నిలువనీడ లేకుండా పోయింది. తమ ఇళ్లను కూల్చివేయవద్దని బస్తీ ప్రజలు అధికారులను వేడుకుంటున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. వారు అధికారులను ప్రాధేయపడుతున్న దృశ్యాలు హృదయాలను కదిలిస్తున్నది. మరికొందరు ఈ కూల్చివేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

Read Also: Holi travel rush 2026 : హోలీ రష్ షాక్, రైలు టికెట్ లేదు, బస్సు ఛార్జీలు ఆకాశం!

Ministers are not real estate brokers: KTR’s harsh comments

ఎవరిని కదిలించినా కన్నీటీ గాథలే..

తాము ఎప్పటి నుంచో ఇక్కడ నివసిస్తున్నామని, ఈ స్థలం అక్రమమైనదని, తమ కట్టడాలు అక్రమంగా నిర్మించారని చెబుతూ తమకు నిలువ నీడలేకుండా చేశారని, పిల్లలు మహిళలు అనే కనికరం కూడా చూపకుండా అధికారులు కర్కశంగా పేదల ఇళ్లను కూల్చివేస్తుండడంతో ఇళ్లను కోల్పోయిన పేదలు శాపనార్థాలు పెడుతున్నారు. తమ కడుపు రగిలిపోతున్నదని, ఇప్పుడు తాము ఎక్కడ బతకాలని, నీ చెట్టు నీడలో ఉండాలని వాపోతున్నారు. దీనిపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం పేదల ఇళ్లను కూలుస్తూ కాంగ్రెస్ నాయకులు తమ ఆస్తులను పెంచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర మంత్రులు ప్రజలను గాలికి వదిలేసి, తమ ఆస్తులను నీ పెంచుకుంటున్నారని, మంత్రి పొంగులేటి తన పదవ కంపెనీ పెట్టి కమీషన్లను వెనకేసుకుంటున్నాడని, సీఎం రేవంత్ రెడ్డి తన రెండవ ప్యాలెస్ కట్టుకుంటున్నాడని, డిప్యూటీ సీఎం మూడవ ఇల్లు కట్టుకుంటున్నారని కేటీఆర్ వీరిపై తీవ్ర ఆరోపణలు చేశారు.

Hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

BRS party K T Rama Rao ktr Real Estate Allegations Revanth Reddy government Telangana Ministers Telangana politics Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.