📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

North Korea: అణ్వస్త్ర శక్తిని పెంచుకుంటున్న కిమ్ ..మరో కొత్త యుద్ధ నౌక తనిఖీ

Author Icon By Vanipushpa
Updated: March 5, 2026 • 12:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇరాన్​ అణ్వాయుధాలను నిర్మిస్తుందన్న కారణంతోనే అమెరికాకు దిగిన సమయంలోనే న్యూక్లియర్​ సామర్థ్యాన్ని మరింత బలోపేతం దిశగా ఉత్తర కొరియా(North Korea) కీలక ముందుడుగు వేసింది. అణ్వస్త్ర ప్రయోగ సామర్థ్యాన్ని కలిగిన నౌకాదళం నిర్మాణం దిశగా అడుగులు వేస్తోంది. మరో రెండు రోజుల్లోగా దేశ నౌకాదళంలోకి ప్రవేశపెట్టనున్న కొత్త యుద్ధ నౌక (డెస్ట్రాయర్)‌ను ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తనిఖీ చేశారు. ప్రయోగపూర్వకంగా ఈ యుద్ధ నౌక నుంచి క్రూయిజ్ మిస్సైల్‌‌‌ను సంధించడాన్ని కిమ్ వీక్షించారు. ఈ వివరాలతో ఉత్తర కొరియా ప్రభుత్వ వార్తాసంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ గురువారం రోజు కథనాన్ని ప్రచురించింది.

Read Also: Iran Vs Israel War : భారీగా తగ్గబోతున్న ఆయిల్ ధరలు.. ట్రంప్ చెపుతుంది నిజమేనా ?

Kim is increasing nuclear power.. inspecting another new warship

ఖోయీ హయోన్ రకం మూడో డెస్ట్రాయర్‌ను కిమ్ జోంగ్ ఉన్ తనిఖీ

తమ దేశ నౌకాదళం అమ్ములపొదిలోకి చేరబోతున్న మూడో డెస్ట్రాయర్ యుద్ధ నౌక ఇదేనని వెల్లడించింది. బుధ, గురువారాల్లో నాంపో పట్టణంలోని పశ్చిమ ఓడరేవును కిమ్ జోంగ్ ఉన్ సందర్శించారని పేర్కొంది. ఈసందర్భంగా నిర్మాణ దశలో ఉన్న ఖోయీ హయోన్ రకం మూడో డెస్ట్రాయర్‌ను ఆయన తనిఖీ చేశారని తెలిపింది. ఉత్తర కొరియాకు 2025 ఏప్రిల్‌లో అందుబాటులోకి వచ్చిన రెండో డెస్ట్రాయర్‌లాగే, మూడో డెస్ట్రాయర్ కూడా 5వేల టన్నుల కెపాసిటీని కలిగి ఉందని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వివరించింది. వాస్తవానికి ఈ కొత్త డెస్ట్రాయర్‌ వార్‌షిప్‌ను తొలుత మంగళవారం రోజు కిమ్ జోంగ్ ఉన్ పరిశీలించారు. ఆ సందర్భంగా ప్రభుత్వ వార్తాసంస్థతో మాట్లాడుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వార్‌షిప్ బాగా పనిచేస్తోందని కితాబిచ్చారు. రాబోయే ఐదేళ్లలో ఏటా రెండు చొప్పున ఖోయీ హయోన్ రకం యుద్ధనౌకలను నిర్మించాలని దేశ నౌకాదళానికి పిలుపునిచ్చారు. ఉత్తర కొరియా నేవీకి అణ్వస్త్రాలను అందించాలనే తన లక్ష్యం దిశగా సానుకూల పురోగతి జరుగుతోందన్నారు. దేశ సముద్ర జలాల పరిధిలో సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకునేందుకు ఈ పురోగతి విప్లవాత్మకంగా దోహదపడుతుందని కిమ్ పేర్కొన్నారు. గత 50 ఏళ్లలో సాధించలేనిది, ఇప్పుడు ఉత్తర కొరియా సాధిస్తోందన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Kim Jong Un Kim Jong Un inspection New North Korean warship North Korea military expansion North Korea nuclear power Pyongyang defense news Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.