అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫెడరల్ రిజర్వ్ తదుపరి ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్(Kevin warsh) ను ఎంపిక చేయడం గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు సృష్టించింది. వార్ష్ ఒక “హాకిష్” (వడ్డీ రేట్లను పెంచడానికి మొగ్గు చూపే వ్యక్తి) నాయకుడిగా పేరు పొందడం వల్ల, భవిష్యత్తులో అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గే అవకాశం లేదని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఈ ఒక్క వార్తతో సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం(Gold) ఒక్కసారిగా 9% పడిపోగా, వెండి ధర ఏకంగా 31% పైగా క్షీణించి దశాబ్దాల కనిష్టానికి చేరుకుంది.మార్కెట్లు ఎందుకు భయపడుతున్నాయి?
కెవిన్ వార్ష్ గతంలో (2006-2011) ఫెడ్ బోర్డులో పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి. అయితే ఆయన ఎప్పుడూ కఠినమైన ఆర్థిక విధానాలనే సమర్థించేవారు. ముఖ్యంగా ఇన్‌ఫ్లేషన్ (ద్రవ్యోల్బణం) అదుపులో ఉండాలంటే వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండాలని ఆయన నమ్ముతారు. ట్రంప్ నామినేషన్ తర్వాత మార్కెట్లు జూన్ నెలలో ఆశించిన వడ్డీ రేట్ల తగ్గింపుపై ఆశలు వదులుకున్నాయి. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే డాలర్ విలువ పెరుగుతుంది, దీనివల్ల బంగారం వంటి కమోడిటీల ధరలు తగ్గుతాయి.
Read Also: Tesla india offer : టెస్లా షాక్ ఆఫర్, EMIతో Model Y ఇప్పుడు అందుబాటులో!
డాలర్ బలోపేతం – వడ్డీ రేట్ల అంచనా
వార్ష్ రాక కేవలం బంగారంపైనే కాదు, రిస్క్ అసెట్స్ పై కూడా ప్రభావం చూపింది. బిట్‌కాయిన్ ధర గత కొద్ది నెలల్లో మొదటిసారిగా 80,000 డాలర్ల దిగువకు పడిపోయింది. ఆసియా మార్కెట్లు కూడా భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. దక్షిణ కొరియా స్టాక్ మార్కెట్ ‘కోస్పి’ 5% కంటే ఎక్కువ పడిపోవడంతో అక్కడ ట్రేడింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. ఇన్వెస్టర్లు అందరూ రిస్క్ ఉన్న చోట నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకుని బలపడుతున్న డాలర్ వైపు మళ్లుతున్నారు. కెవిన్ వార్ష్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారని, ట్రంప్ ఒత్తిడికి తలొగ్గరని మార్కెట్ వర్గాల నమ్మకం. ఈ విశ్వసనీయత వల్లే యూఎస్ డాలర్ విలువ పెరిగింది. ప్రస్తుతానికి మార్కెట్ డేటా ప్రకారం, జూన్ నెలలో వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 66% మాత్రమే ఉందని అంచనా వేస్తున్నారు. ఈ అనిశ్చితి వల్ల గ్లోబల్ ఇన్వెస్టర్లు ప్రస్తుతం వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: