kalvakuntla kavitha : ‘పద్మవ్యూహం’లోకి కవిత అడుగులు!

Read Time:  1 min
kalvakuntla kavitha
kalvakuntla kavitha
FONT SIZE
GET APP

రాజకీయాలు ఎప్పుడూ పూల పాన్పు కావు, అది నిరంతరం సాగే ఒక చదరంగం. ఒకప్పుడు అధికార దర్పంతో, ప్రజాభిమానంతో వెలుగొందిన నాయకులు సైతంఅనూ హ్యమైన కష్టకాలంలో పడటం, ఆటు పోట్లను ఎదుర్కోవడం ప్రజాస్వామ్య చరిత్రలో కోకొల్లలు. సరిగ్గా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత ( kalvakuntla kavitha )ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా అచ్చం ఇలాంటిదే. ఇది కవిత రాజ కీయ జీవితంలోనే అత్యంత గడ్డుకాలం అని నిర్మొహమాటం గా చెప్పవచ్చు. అయితే, ఒక నాయకురాలి రాజకీయ ప్రస్థా నాన్ని కేవలం ఒక పరాజయం లేదా ఒక సంక్షోభం ఆధా రంగా మాత్రమే బేరీజు వేయడం అసంపూర్ణ విశ్లేషణే అవు తుంది. ఆమె ప్రస్తుత పరిస్థితిని, భవిష్యత్ వ్యూహాలను అర్థం చేసుకోవాలంటే ఆమె రాజకీయ ఉదంతాన్ని, క్షేత్ర స్థాయిలో ఆమెకున్న అనుభవాన్ని కూడా నిశితంగా పరిశీ లించాల్సి ఉంటుంది. కవిత ( kalvakuntla kavitha )కేవలం ఒక ముఖ్యమంత్రి కుమార్తెగా రాజకీయాల్లోకిపారాచూట్ ద్వారా దిగిన నాయ కురాలు కాదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో, సాంస్కృతిక అస్తిత్వాన్ని ఒక రాజకీయ ఆయుధంగా మలచడంలో ఆమె చూపిన చొరవను ఎవరూ కాదనలేరు. ‘తెలంగాణ జాగృతి’ అనే సంస్థను స్థాపించి, తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేయడమే కాకుండా, మహిళలను, యువతను ఉద్యమంవైపు నడిపిం చడంలో ఆమె కీలక
పాత్ర పోషించారు. ఆ క్షేత్రస్థాయి నెట్వర్క్ సంస్థాగత నిర్మాణమే ఆమెను నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలిగా, ఆ తర్వాత శాసనమండలి సభ్యు రాలిగా చట్టసభల్లోకి అడుగుపెట్టేలా చేసింది. అధికారంలో ఉన్న పదేళ్ల పాటు ఆమె పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అత్యంత క్రియాశీలకమైన, బలమైన నాయకురాలిగా చెరగని ముద్ర వేశారు. కానీ, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. గెలుపు ఒక మాయ అయితే, ఓటమి ఒక గుణపాఠం. ఒకప్పుడు ఆమె
కనుసన్నల్లో నడిచిన అధికార యంత్రాంగం, ఆమె చుట్టూ ఉన్న రాజకీయ వాతావరణం నేడు పూర్తిగా మారిపోయాయి. తెలంగాణకే పరిమితం కాకుండా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని బీఆర్ఎస్ నాయ కత్వం వేసిన అడుగులు అనూహ్యంగా బెడిసికొట్టాయి. ఆ జాతీయ వ్యూహాల వైఫల్య ప్రభావం నేరుగా కవిత రాజకీయ భవిష్యత్తుపై తీవ్రంగా పడింది.

Read Also : Karimnagar New Collector: కరీంనగర్ కొత్త కలెక్టర్‌గా చిత్రా మిశ్రా

 kalvakuntla kavitha
kalvakuntla kavitha

ముఖ్యంగా ఢిల్లీమద్యం కుంభకోణం ఆరోపణలు, కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ విచారణలు, ఎవరూ ఊహించని విధంగా తీహార్ జైలు జీవితం గడపాల్సిరావడం ఆమె ఇమేజ్ను, ప్రతిష్టను మూల మట్టంగా కుదిపేశాయి. ప్రజాజీవితంలో ఉన్న ఒక నాయకు రాలికి ఆర్థికపరమైన ఆరోపణలు రావడం అనేది అతి పెద్ద అవరోధం. తన నాయకత్వ లక్షణా లను మరింతగా నిరూపించుకోవాల్సిన తరుణంలో, ఇలాంటి న్యాయపరమైన చిక్కుల్లో కూరుకుపోవడం ఆమె కెరీర్కు ఊహించని బ్రేక్వేసింది. దీనికి తోడు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడంఆమె సంక్షోభాన్ని రెట్టింపు చేసింది. అధికారంలో ఉన్నప్పుడు వెన్నంటి నడిచిన వారు, పదవులు అనుభవించిన వారు సంక్షోభ సమయంలో దూరం జరగడం లేదా మౌనం వహిం చడం రాజకీయాల్లో సహజమే. ఆ కఠినవాస్తవాన్ని ఇప్పుడు ఆమె స్వయంగా అనుభవిస్తున్నారు. ప్రస్తుత తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని పరిశీలిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం తన సంక్షేమ పథకాలతో ప్రజల్లో బలం పెంచుకునే ప్రయత్నం చేస్తుం డగా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇక్కడ ప్రధాన ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు వ్యూహాలు రచి స్తోంది. ఈ రెండు జాతీయ పార్టీలమధ్య, బీఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకునేందుకు ఆపసోపాలు పడుతోంది. ఇలాంటి సంక్లిష్టమైన తరుణంలో, కవిత తన వ్యక్తిగత రాజకీయ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కత్తిమీద సాము లాంటిదే. ఆమెముందున్న దారి పూలపాన్పు కాదు, పక్కా పద్మవ్యూహం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె ప్రాధాన్యత అంతా క్రియాశీలక రాజకీయాల కంటే ముందు, తన చుట్టూ బిగుసుకున్న న్యాయపరమైన ఉచ్చునుంచి సురక్షితంగా బయట పడటంపైనే ఉండకతప్పదు. కోర్టుకేసుల నుంచి క్లీన్చెట్ సాధించకుండా, మళ్లీ పాత ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్లి పూర్వవైభవం సాధించడం అనేది ఆచరణాత్మకంగా అసాధ్యం. తెలంగాణ ఉద్యమ సమయంలో సాధించిన సానుభూతి ఇప్పుడు ఆమెకు శాశ్వతరక్షణ కవచంగా నిలిచే అవకాశం లేదు. ఎందుకంటే, నేటి ఓటర్లుగతాన్ని పక్కనపెట్టి, ప్రస్తుత వాస్తవాల ఆధారంగా, జవాబుదారీతనం ఆధారంగా నాయ కులను అంచనా వేస్తున్నారు. అయితే, ఇంతటి సంక్షోభం ఆమె రాజకీయ జీవితానికి ముగింపు అని భావిస్తే అది విశ్లేషకుల పొరపాటే అవుతుంది.

నిజానికి, ఒక నాయకుడి అసలైన సామర్థ్యం అధికారంలో ఉన్నప్పుడు కాదు, అధికారానికి దూరమైనప్పుడు, ఇలాంటి కష్టకాలంలోనే బయటపడు తుంది. కవిత ముందు ఇప్పుడు ఒక స్పష్టమైన లక్ష్యంఉంది. గత వైభవం మీద ఆధారపడకుండా, వాస్తవాలను అంగీక రించి, కొత్త రాజకీయ వ్యూహాలతో ఆమె అడుగులు వేయా ల్సి ఉంటుంది. న్యాయపరమైన సవాళ్లను ధైర్యంగా ఎదు ర్కొంటూనే, చెదిరిపోయిన పార్టీ కేడర్ను తిరిగి కూడగట్టు కుని, ప్రతిపక్షంలో ఒక బలమైన గొంతుకగా తనను తాను పునరావిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. ఆమె తనలో ని పాత ఉద్యమకారిణిని మళ్లీ మేల్కొల్పి, వ్యూహాత్మకంగా అడుగులు వేస్తే, భవిష్యత్తులో మరింత పరిణతి చెందిన, రాటుదేలిన నాయకురాలిగా మారే అవకాశం మెండుగా ఉంది. రాజకీయాల్లో ఎవరూ శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు, అలాగే శాశ్వత పరాజయాలు కూడా ఉండవు. ఇది ఆమెకు కేవలం అగ్నిపరీక్ష మాత్రమే కాదు, భవిష్యత్ రాజకీయప్రస్థానానికి సరికొత్త పునాది వేసుకునే ఒక గొప్ప అవకాశం. ఈపద్మవ్యూహాన్ని ఆమె ఎలా ఛేదిస్తారు, ఎలాంటి పోరాట పటిమను ప్రదర్శిస్తారు అనే దానిపైనే తెలంగాణ రాజకీయాల్లో ఆమె భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
– పురుషోత్తం నారగౌని

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.