📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Iran-US war: కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు

Author Icon By Vanipushpa
Updated: February 24, 2026 • 12:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పశ్చిమాసియాలో పరిస్థితులు సెకను సెకనుకూ మారుతున్నాయి. ఇరాన్(Iran), అమెరికా(America) దేశాల మధ్య యుద్ధం ఏ క్షణమైనా మొదలయ్యేలా కనిపిస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని అంతం చేయాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆదేశాలు జారీ చేశారని అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది. దీంతో ఇరాన్ అప్రమత్తమైంది. ఎప్పుడైనా అమెరికా వైమానిక దాడులకు దిగొచ్చనే భయంతో ఖమేనీ తన నివాసాన్ని మార్చినట్లు తెలుస్తోంది. అమెరికా హెచ్చరికలకు ఇరాన్ ఏమాత్రం తలొగ్గడం లేదు. అంతిమ యుద్ధానికి సిద్ధం అంటూ ఇరాన్ ఆర్మీ చేసిన ట్వీట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. యుద్ధం అంటూ వస్తే అది చివరి వరకు ఉంటుందని ఇరాన్ సవాల్ విసురుతోంది.

Read Also: OmBirla: 60 దేశాలతో ‘పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్ గ్రూప్స్

Iran-US war: War clouds looming

ట్రంప్ హెచ్చరికలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అణు ఒప్పందం చేసుకోవాలని ఇరాన్​పై ఒత్తిడి పెంచుతూ పదేపదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం 15 రోజుల్లో ఇరాన్ అణు ఒప్పందం విషయంలో అమెరికాతో చర్చలకు రావాలని, లేకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇరాన్ ఈ ప్రాంతంలో అస్థిరతను సృష్టించడాన్ని ఇకపై ఎంతమాత్రం సహించబోమని ఆయన పునరుద్ఘాటించారు. అంతేకాదు ఇరాన్​ సమీపంలో అత్యాధునిక యుద్ధనౌకలు, యుద్ధ విమానాలను మోహరిస్తున్నారు. 2003 ఇరాక్ యుద్ధం తరువాత అతిపెద్ద సైనిక సమీకరణ ఇదే అని నిపుణులు చెబుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Border Disputes geopolitical conflict Global instability International Relations military escalation Political Crisis rising tensions Telugu News online Telugu News Today War Clouds

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.