📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

India: పోలాండ్ మంత్రికి గట్టి కౌంటర్ ఇచ్చిన జైశంకర్

Author Icon By Vanipushpa
Updated: January 19, 2026 • 4:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అంతర్జాతీయ దౌత్య రంగంలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ (Jaishankar) తనదైన ముద్రను మరోసారి చాటుకున్నారు. పాకిస్థాన్‌లో పర్యటించి కాశ్మీర్ అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పోలాండ్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి రాడోస్లావ్ సికోర్స్కీ.. ఢిల్లీలో జైశంకర్ ఎదురుపడగానే తన స్వరాన్ని పూర్తిగా మార్చేశారు. పాకిస్థాన్ ఉగ్రవాదంపై జైశంకర్ ఆగ్రహం సోమవారం ఢిల్లీలో జరిగిన ద్వైపాక్షిక భేటీలో జైశంకర్ పోలాండ్ మంత్రికి గట్టి కౌంటర్ ఇచ్చారు. సరిహద్దు దేశం (పాకిస్థాన్) స్పాన్సర్ చేస్తున్న ఉగ్రవాదంపై పోలాండ్ కఠిన వైఖరిని అవలంబించాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదం పట్ల ఎటువంటి మెతక వైఖరి ఆమోదయోగ్యం కాదని, పోలాండ్ జీరో టాలరెన్స్ విధానాన్ని పాటించాలని జైశంకర్ స్పష్టం చేశారు. భారత్ పొరుగున ఉన్న ఉగ్రవాద నిర్మాణాలను ఏ విధంగానూ ప్రోత్సహించకూడదని గట్టింగా హెచ్చరించారు.

Read Also: Vande Bharat: స్లీపర్ రైళ్లలో టికెట్ క్యాన్సిల్ చేస్తే డబ్బు రాదు

India: పోలాండ్ మంత్రికి గట్టి కౌంటర్ ఇచ్చిన జైశంకర్

ఉమ్మడి ప్రకటన విడుదల చేసిన సికోర్స్కీ

పోలాండ్ మంత్రి మాట మార్చిన వైనం గతేడాది అక్టోబర్‌లో పాకిస్థాన్‌ను సందర్శించినప్పుడు కాశ్మీర్ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించాలని పాకిస్థాన్‌తో కలిసి ఉమ్మడి ప్రకటన విడుదల చేసిన సికోర్స్కీ.. ఇప్పుడు జైశంకర్ ముందు తలొగ్గారు. సరిహద్దు దాటి జరుగుతున్న ఉగ్రవాదాన్ని అరికట్టాల్సిన అవసరం ఉందన్న జైశంకర్ మాటలతో ఆయన ఏకీభవించారు. “సరిహద్దు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలన్న మీ అభిప్రాయంతో మేము పూర్తిగా అంగీకరిస్తున్నాం” అని సికోర్స్కీ ఢిల్లీలో ప్రకటించడం గమనార్హం. ఈ భేటీలో రష్యా చమురు దిగుమతులు, ఉక్రెయిన్ యుద్ధంపై భారత్‌ను లక్ష్యంగా చేసుకుంటున్న పశ్చిమ దేశాల విమర్శలను జైశంకర్ తిప్పికొట్టారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Diplomatic Response Global Diplomacy India Foreign Policy International Relations Poland Minister Political Statements S Jaishankar Telugu News online Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.