Israel-Iran : ఇంకెన్నాళ్లీ రక్తపాతం భరించాలి?

Read Time:  1 min
Israel-Iran
Israel-Iran
FONT SIZE
GET APP

ఘర్షణలు రెండు దేశాల మధ్యనో, మరికొన్ని దేశాల మధ్యనో జర గటం చూసాం కానీ ఏకంగా మూడవ ప్రపంచ యుద్ధం మొదలైందా అన్న తీరులో ఇజ్రయెల్-ఇరాన్ (Israel-Iran) మధ్యలో యుఎస్ యుద్ధం, భారత్ కురుక్షేత్ర యుద్ధంలో పదహారు రోజుల్లో ఫలి తం వస్తే, ఇంకా ఈ ప్రస్తుతయుద్ధం తుదివరకు చేరుకుంటున్న సూచనలు కనపడటంలేదు. ఇరాన్ బలహీన పడ్తుందేమో (ఖమైనీ చనిపోయిన తర్వాత) అని అందరూ సందేహించారు కానీ ఏదీ ఖాతరు చేయకుండా ఇజ్రాయెల్ యుఎస్ దేశాలతో, ధాటీగా తలప డటం అందర్నీ విభ్రమానికి గురి చేస్తున్నది. ‘నిండా ముని గితే చలేమిటి’ అన్నధోరణిలో ఇరాన్యు ద్ధం చేస్తున్నది. యుఎస్ యుద్ధం మొదలు పెట్టడం మా పని అంటే ఇహ ముగించటం మా చేతిలో ఉంది అని ఇరాన్ యుద్ధనాయ కులు జవాబివ్వటం వింతగానే ఉంది. యుద్ధంలో పాల్గొనక పోయినా, భారత్కు ఆర్థికంగా, పర్యాటకపరంగా, నైతికంగా కోలుకోలేని నష్టం జరుగుతున్న మాట నిజం. ఫిబ్రవరి28న ఈ యుద్ధం మొదలైనప్పుడు పశ్చిమాసియాలో వేల మంది భారతీయులు పర్యటన నిమిత్తం వెళ్లినవారితోసహా గల్ఫ్ చికు కున్నారు. గల్ఫ్ ని మన దేశపు కార్యాలయాలు పర్యా టకులతోపాటు ఆ ప్రాంతాలలో నివసించే భారతీయుల ఎంక్వైరీలను, సహాయాల కోసం చేసే విన్నపాలు లెక్కకు మించి ఉండటంతో ఎంత సహాయసహకారాలు అందిస్తున్నా అక్కడ చిక్కుకున్న వారిని పూర్తిగా సంతృప్తి పర్చలేకపోతు న్నారు. అన్నిటికంటే దిగ్భ్రాంతి చెందే విషయం దుబాయ్ లోని వారిది. దుబాయిని స్వర్గంలా భావించే వారు చాలా మంది అనేక దేశవాసులు ఉన్నారు. ఇప్పుడు సైరన్ మోతలతో, కాల్పుల శబ్దాలతో దద్దరిల్లిపోతున్నది. మిసైల్స్ ఒకవైపు నుంచి పడుతుంటే, అవి కలిగించే పొగ, ధూళితో దుబాయి మొత్తం నిండుతున్నదా అన్న భావన అక్కడ స్థిరంగా కాపురాలు చేస్తున్న వారికి కలుగుతున్నది.

Read Also : Iran-Israel War: ఇరాన్ నుండి ఢిల్లీకి చేరిన 45 మంది విద్యార్థులు

Israel-Iran
Israel-Iran

పర్యాటకులు ఎన్నో ప్రణాళికలతో విహార యాత్రలు చేద్దామనుకుని వచ్చినవారు, అన్నీ రద్దు చేసుకొని హోటళ్లలో ‘రెస్ట్స్’గా పచార్లు చేస్తూ కాలం గడుపుతున్నారట. బయటకు అంటే దుబాయి నుంచి బయటపడడానికి ఎన్ని ప్రణాళికలు చేసినా చెల్లని పరిస్థితి. దాదాపు పదిహేను సెకండ్ల కొక విమానం ల్యాండ్ అయ్యే దుబాయి విమానాశ్రయం ప్రస్తుతం బాంబు లమోతలతో, కాలుతున్న కట్టడాలతో కకావికలుగా మారిం దని అక్కడి నుంచి వచ్చే సమాచారం చెబుతున్నది. అన్ని విమానాలు గ్రౌండ్ అయ్యాయి. గల్ఫ్లోవేలకొద్ది భారతీ యులు చిక్కు కొని దిక్కుతోచని రీతిలో నానా అవస్థలు పడుతున్నారు. యుఎఇ ప్రభుత్వం చాతనైన సహాయం నిర్విరామంగా చేస్తూనేఉంది. హోటళ్లల్లో చిక్కుకొనిపోయిన యాత్రికులను ఖాళీ చేయమని ఒత్తిడి తేమని హామీలు కూడా విశాల వైఖరితో ఇస్తూనే ఉంది. ప్రభుత్వం హోటళ్లమేనేజర్లకు పర్యాటకులను బయటకు కాలపరిమితి దాటిందని ఖాళీ చేయించవద్దు అని ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులు అబుదాబీవరకే పరిమి తమని (రాజధాని) ఇతర ఎమిరేట్స్క ఈ ఆర్డర్లు వర్తించ వని సున్నితంగా చెబుతున్నారట! ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తే ఎక్కవ ఛార్జీలు కూడా వసూలు చేస్తున్నారట. ఆందోళన కలిగించే పరిస్థితుల్లో ప్రస్తుతం దుబాయి లాంటి ప్రదేశాలలో పర్యాటకులు దిక్కుతోచక పడి ఉంటున్నారు. సౌదీ అరేబియా, కువైట్, యుఎఇ, ఖతార్, బహరైన్, ఒమన్ (ఆరు గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్ జి.సి. ఇ అంటారు) ప్రాంతా లలో దాదాపు ఒక లక్ష కోట్ల మంది పనుల నిమిత్తం ఇండి యన్ ఎక్స్ పాట్రియేట్స్ గా ఉన్నారని, భారత విదేశాంగ శాఖ చెబుతున్నది. అతిపెద్ద ‘వర్క్ఫోర్స్ ‘గా భారతీయులే ఉన్నారు. అధ్వాన్నపరిస్థితులలో కాలం వెళ్లబుచ్చుతున్న వీరిని గురించే ప్రభుత్వం ఆందోళన చెందుతున్నది. వీళ్లు గాక వ్యాపారం కోసం పర్యాటకులుగా వచ్చినవారు కూడా చిక్కుకొని ఉన్నారు. అంతకు మునుపు భారత ప్రధాని పర్యాటనను కవర్ చేయడానికి వచ్చిన జర్నలిస్టులు, ఒకటి, రెండు రోజులు సైట్ సీయింగ్కుఆగినవారు, అండర్ గ్రౌండ్ బంకర్స్లోలో ఉండాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది.

Israel-Iran
Israel-Iran

గల్ఫ్ దేశాలలోని పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇజ్రాయెల్లో ఉన్న భారతీయుల పరిస్థితి కూడా గొప్పగా ఏమీలేదు. దాదాపు 30వేల మంది భారతీయులు (బ్లూకలర్ వర్కర్స్ అంటారు) ఉన్నారని విదేశాంగ శాఖ చెబుతున్నది. ఎంత మంది ఏ విధంగా ఉన్నారో లెక్కల్లో చెప్పటం కష్టమే. ఇరాన్లో మాత్రం భారతీయుల సంఖ్య తక్కువ. ఎక్కువగా టెహరాన్, భూమ్, బందర అబ్బాస్, (దేశంలోని పెద్దపోర్ట్) లో ఉన్నారు. యు.ఎస్, ఇజ్రాయెల్ బాంబింగ్ లో భారతీయులు చనిపోవడం గాయాలబారిన పడటం జరగలేదు కానీ ఇరానీయన్ డ్రోన్, మిసైల్ దాడుల్లో మాత్రం (ఆయిల్ టాంకర్ల మీద) దాదాపు నలభైమంది గాయపడటమో, చనిపోవటమో కనపడకుండాపోవటమో జరిగిందని వార్తలు వస్తున్నాయి. యుద్ధంతో సంబంధం లేకపోయినా, భారతీయులకు ప్రాణ నష్టం ఇజ్రాయెల్, ఇరాన్ (Israel-Iran) గల్ఫ్ దేశాలలో సంభవిస్తుండటం దురదృష్టకరం. ప్రభుత్వం చేతనైన సహాయం అందిస్తున్నా సరిపోని పరి స్థితి. ట్రంప్ చేస్తున్న నిర్వాకం అమెరికన్ ప్రజలు స్వాగ తించారో లేదో తెలియదుకానీ, ప్రశాంతంగా చాలా వరకు ప్రవహిస్తున్న నీటిపై తన ప్రతిభను గుర్తింప చేయడానికి చేతిలో ఉన్న రాళ్లు విసిరాడు. ఫలితం ప్రపంచ ప్రజలు అనుభవిస్తున్నారు. అన్ని విధాలుగా విజ్ఞాన వీచిక లు ఈ అధునాతన ప్రపంచంలో వీస్తున్న వేళ, కాలం చెల్లిన ఈ యుద్ధ ప్రవృత్తి కొందరి పాలకుల్లో ఎందుకు పదే పదే వస్తుందో అంతుపట్టడం లేదు. ప్రతి సమస్యకూ పరి ష్కారం ఉంటుంది. మొదలైన ప్రతి యుద్ధం ముగియక మానదు. కానీ ఎంతకష్టం, ఎంత నష్టంతో మానవాళి మిగులుతుందో ఇప్పుడే తెలియదు.
-రావులపాటి సీతారాంరావు

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.