ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ(Ayatollah Ali Khamenei)ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ జరిపిన దాడి వెనుక ఏళ్ల తరబడి సాగిన పక్కా నిఘా వ్యవస్థ ఉందని ‘ఫైనాన్షియల్ టైమ్స్’ వెల్లడించింది. కేవలం ఒక్క రోజులో జరిగిన ఆపరేషన్ కాదని, దీని వెనుక సుదీర్ఘ కాలపు హ్యాకింగ్ మరియు నిఘా ఉన్నట్లు స్పష్టమవుతోంది.
Read Also: Iran Israel War: వైరల్ అవుతున్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మనుమరాలి ఫోటో?
ఏళ్ల తరబడి సాగిన ‘డిజిటల్’ వేట
ఖమేనీ కదలికలను కనిపెట్టేందుకు ఇజ్రాయెల్ గూఢచారి సంస్థలు టెహ్రాన్ నగరంలోని ట్రాఫిక్ కెమెరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. కేవలం కెమెరాలే కాకుండా, మొబైల్ ఫోన్ నెట్‌వర్క్‌లను కూడా హ్యాక్ చేయడం ద్వారా నగరం వెలుపల మరియు లోపల జరిగే ప్రతి కదలికను ఇజ్రాయెల్ నిరంతరం గమనిస్తూ వచ్చింది. టెహ్రాన్ వీధుల్లోని ఫుటేజీ నేరుగా ఇజ్రాయెల్‌లోని సర్వర్లకు చేరేలా హ్యాకర్లు సాంకేతిక మాయాజాలం ప్రదర్శించారు. ఖమేనీ ఏ సమయానికి ఎక్కడికి వెళ్తున్నారు?, ఆయన కాన్వాయ్‌లో ఎన్ని వాహనాలు ఉన్నాయి? ఏ మార్గాల్లో ఆయన ప్రయాణిస్తారు?, వంటి కీలక అంశాలను ఇజ్రాయెల్ విశ్లేషించింది. ఫిబ్రవరి 28వ తేదీ ఉదయం, ఖమేనీ తన అధికారిక నివాసంలోనే ఉన్నారని ఈ ట్రాఫిక్ కెమెరాల డేటా ద్వారా ఇజ్రాయెల్ నిర్ధారించుకుంది. సమాచారం అందిన వెంటనే 200 యుద్ధ విమానాలు ఇజ్రాయెల్ మరియు అమెరికాకు చెందిన విమానాలు టెహ్రాన్ గగనతలంలోకి ప్రవేశించాయి.
30 బంకర్ బస్టర్ బాంబులు: ఖమేనీ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని అత్యంత శక్తివంతమైన బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించాయి. ఈ విధమైన భారీ దాడితో ఇరాన్ రక్షణ వ్యవస్థను చేధించడంలో ఇజ్రాయెల్ సఫలమైందని ఫైనాన్షియల్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: