📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

law : చట్టం అందరికీ సమానమేనా?

Author Icon By Sudha
Updated: March 11, 2026 • 4:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన అం శం’ చట్టం ముందు అందరూ సమానులే’ అన్నసూత్రం. కానీ, వర్తమాన రాజకీయ ముఖచిత్రాన్ని నిశితంగా పరిశీలిస్తే, చట్టం (law) అందరికీ సమానంగా వర్తిస్తోందా? లేక అధి కార పీఠంపై ఉన్నవారికి అనుకూలంగా, ప్రతిపక్షంలో ఉన్న వారికి ప్రతిబంధకంగా మారుతోందా? అన్న సందేహం సామాన్యుడికి కలగక మానదు. ఇటీవలి కాలంలో సంచల నం సృష్టించిన లిక్కర్ కుంభకోణం వంటి కేసుల్లో సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు కేవలం ఒక కేసు ముగింపు మాత్రమే కాదు, అది మన దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థల విశ్వసనీయతపై సంధించిన ఒక పదునైన అస్త్రం. సాక్ష్యాధారాలతో లేవని, కేవలం ఊహాగానాలతోనే కేసులు అల్లారని న్యాయమూర్తి కుండబద్ధలు కొట్టినప్పుడు, ఆ నెపం మోసి, జైలు గోడల మధ్య కాలాన్ని వెళ్లదీసి, రాజ కీయంగా సర్వస్వం కోల్పోయిన నేతల జీవితాలకు జరిగిన నష్టానికి బాధ్యులెవరు? అనే ప్రశ్నఇప్పుడు గట్టిగా వినిపి స్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి పౌరుడికి జీవించే హక్కువ్యక్తిగత స్వేచ్ఛ ఉన్నాయి. చట్టం నిర్దేశించిన పద్ధతిలో తప్ప, ఏ వ్యక్తి స్వేచ్ఛను హరించకూడదు. అయితే, ఈ ఆర్టికల్ను అడ్డంపెట్టుకుని, దర్యాప్తు సంస్థలు ‘అరెస్ట్’ అనే ఆయుధాన్ని రాజకీయ వ్యూహంగా వాడుకుంటున్నాయనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇటువంటి ఫాల్స్ కేసులు నమోదు చేయడం ద్వారా ఓటర్ల ఆలోచనా దృక్పథాన్ని, తద్వారా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే ప్రమాదకర ధోరణి పెరుగుతోంది. ఒక బలమైన నాయకుడిని ఎన్నికల ప్రచారానికి దూరం చేయడం కోసం లేదా ప్రజాక్షేత్రంలో వారిని అవి నీతిపరులుగా ముద్ర వేయడం కోసం నెలల తరబడి జైల్లో ఉంచడం అంటే అది కేవలం ఒక వ్యక్తికి జరుగుతున్న అన్యాయం కాదు, అది ప్రజల తీర్పునే అపహాస్యం చేయ డం. ఉదాహరణకు, ఎన్నికలకు కేవలం ఆరు నెలలముందు ఒక కీలక నేతను అరెస్ట్ చేస్తే, విచారణ పూర్తయి అతను నిర్దోషి అని తేలేసరికి ఎన్నికలు ముగిసిపోతాయి, ప్రభుత్వం మారిపోతుంది. అంటే, ఇక్కడ ‘విచారణే ఒక శిక్షగా మారిపోతోంది. తప్పుడు కేసుల ద్వారా ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చేయడం ప్రజాస్వామ్యబద్ధంగా
ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోయడంతో సమానం. ఈ గందరగోళంలో 30 రోజులు జైల్లో ఉంటే పదవి కోల్పోవాలి అనే చట్ట ప్రతిపాదన ప్రజాస్వామ్యానికి మరో గొడ్డలిపెట్టు.

Read Also : Bahrain Telugu pilgrims: బహ్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు వారు స్వదేశానికి

law

భారత న్యాయ సూత్రం ప్రకారం నేరం నిరూపితమయ్యేవరకు ప్రతి ఒక్కరూ నిర్దోషులే. కానీ, ఈ ప్రతిపాదన ఆప్రాథమిక సూత్రాన్నే తుంగలో తొక్కుతోంది. విచారణ పూర్తి కాకుండానే, శిక్ష పడకముందే ఒక వ్యక్తిని పదవికి అనర్హుడిని చేయడం అంటే అది ప్రత్యర్థులపై రాజకీయ కక్ష సాధింపులకు రాజ మార్గం వేయడమే అవుతుంది. దర్యాప్తు సంస్థలు అధికార పార్టీ చేతిలో కీలుబొమ్మలుగా మారినప్పుడు, ఎవరినైనా నెల రోజులు బెయిల్ రాకుండా జైల్లో ఉంచడం పెద్ద కష్టమేమీ కాదు. ఇలాంటి చట్టం (law)అమలులోకి వస్తే, దేశంలో రాజకీయ సుస్థిరత దెబ్బతింటుంది. ప్రత్యర్థుల పొలిటికల్ కెరీర్ను నాశనం చేయడానికి ఇది ఒక చట్టబద్ధమైన ఆయుధంగా మారుతుంది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వపు హక్కు)కు పూర్తి విరుద్ధం. మరోవైపు, ఈ నాణేనికి మరో భయంకరమైనపార్శం కూడా ఉంది. నిరా ధారమైన కేసులు పెరిగిపోవడం వల్ల, నిజమైన నేరస్థులు కూడా దీనిని ఒక కవచంగా వాడుకుంటున్నారు. దర్యాప్తు సంస్థలు తమపై కూడా తప్పుడు కేసులే పెట్టాయని ప్రజ ల్లో నమ్మించి, విచారణాధికారులను బెదిరించడం, దర్యాప్తు ను నీరుగార్చడం వంటివి చేస్తున్నారు. వ్యవస్థల విశ్వసనీ యత తగ్గినప్పుడు, నిజమైన అవినీతిపరులు కూడా బాధిత ముద్ర వేసుకుని ప్రజల్లో సానుభూతి పొందడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది దర్యాప్తు సంస్థల సామర్థ్యాన్ని నీరుగార్చ డమే కాకుండా, నిజమైన దోషులు చట్టం నుండి. తప్పించు కోవడానికి మార్గం సుగమం చేస్తోంది. దర్యాప్తు అధికారుల మీద కేసులు ఫైల్ చేయాలని కోర్టు ఆదేశించాల్సి వస్తుందం టేనే, వ్యవస్థ ఎంతటి సంక్షోభంలో ఉందో అర్థమవుతోంది. ఇందులో మీడియా పాత్ర కూడా ఇక్కడ విమర్శల పాలవు తోంది. సంచలనం కోసం దర్యాప్తు సంస్థలు ఇచ్చే అరకొర సమాచారాన్ని పరమ సత్యంగా ప్రసారం చేయడం వల్ల ప్రజాస్వామ్య పౌరులైన ప్రజల్లో ఉదాసీనత పెరుగుతోంది.

law

ఒక వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు గంటల తరబడి చర్చలు నిర్వహించే మీడియా, అదే వ్యక్తి నిర్దోషిగా విడుదలైనప్పుడు ఒక చిన్న స్క్రోలింగ్తో సరిపెడుతోంది. దీనివల్ల నిందితులకు జరిగే క్యారెక్టర్ అస్సా సినేషన్ అంతా ఇంతా కాదు. రాజ కీయ నాయకులపై కేసులు అంటే అది వారి వ్యక్తిగత విషయమని సామాన్య పౌరులు భావిస్తుండటం ప్రమాద కరం. వ్యవస్థలు నిర్వీర్యమైతే, చట్టం తన దారిని తప్పుతుంటే అది రేపు సామాన్యుడి గడప వరకు రాదని గ్యా రెంటీ లేదు. నిర్దోషిత్వం నిరూపించుకున్న నాయకుల కన్నీళ్లు వ్యవస్థలోని లోపాలను వేలెత్తి చూపుతున్నాయి. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం దర్యాప్తు సంస్థలను వాడటం, 30 రోజుల జైలు జీవితం వంటి అసంబద్ధ చట్టాలను తీసుకురావాలనే ఆలోచన ప్రజాస్వామ్య మను గడకు శ్రేయస్కరం కాదు. చట్టం తన పని తాను చేయాలి, కానీ అది ఏ ఒక్క పార్టీకో లేదా వర్గానికో కొమ్ముకాయకూ డదు. రాజ్యాంగంలోని ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 లో మార్పులు తెచ్చేటప్పుడు న్యాయవ్యవస్థ స్వతంత్రతను, వ్యక్తుల ప్రాథమిక హక్కులను రక్షించేలా ఉండాలి. తప్పుడు కేసులు పెట్టిన అధికారులపై కఠిన చర్యలు తీసుకునేలా జవాబుదారీతనంపెంచాలి. అప్పుడే దర్యాప్తు సంస్థల్లో పారదర్శకత వస్తుంది, ప్రజలకు ప్రజాస్వామ్య వ్యవస్థల మీద నమ్మకం కలుగుతుంది. నిర్దోషులకు న్యాయం జరగాలి నిజమైన దోషులు చట్టం నుండి తప్పించుకోకూడదు. అదే అసలైన ప్రజాస్వామ్య చిహ్నం.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News Equality Before Law justice system latest news law legal rights Rule of Law Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.