America, Israel: అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ప్రతిదాడి

Read Time:  1 min
అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ప్రతిదాడి
అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ప్రతిదాడి
FONT SIZE
GET APP

యూఏఈ (UAE) దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ భారీ దాడులు చేసింది. బహ్రెయిన్‌లోని అమెరికా నావికాదళం 5వ ఫ్లీట్ ముఖ్య కార్యాలయంపై మిస్సైల్ దాడి జరగ్గా, కువైట్‌లోని అలీ అల్-సలేమ్ ఎయిర్ బేస్, యూఏఈలోని అల్ ధఫ్రా ఎయిర్ బేస్‌లపై కూడా దాడులు జరిగినట్లు నివేదికలు వచ్చాయి. మనామా, అబుధాబీ నగరాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. మరోవైపు, ఇజ్రాయెల్ వైపు కూడా తాము మిస్సైల్, డ్రోన్ దాడులు ప్రారంభించినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అధికారికంగా ప్రకటించింది.

Read Also: Adivi Sesh Tirumala Visit: శ్రీవారి సేవలో ‘డెకాయిట్’ టీమ్

Iran retaliates in retaliation for US and Israeli attacks
Iran retaliates in retaliation for US and Israeli attacks

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు అత్యంత తీవ్రస్థాయికి..

ఈ పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఒక వీడియో సందేశంలో ఆయన మాట్లాడుతూ ‘మేజర్ కంబాట్ ఆపరేషన్స్’ ప్రారంభమయ్యాయని తెలిపారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని, మిస్సైల్ పరిశ్రమను పూర్తిగా నాశనం చేస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా, ఇరాన్ ప్రజలు తమ పాలకులను గద్దె దించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు అత్యంత తీవ్రస్థాయికి చేరాయి. గల్ఫ్ దేశాలు తమ వాయు రవాణా ప్రాంతాలను మూసివేశాయి. ఇజ్రాయెల్ దేశంలో అత్యవసర స్థితి కొనసాగుతోంది.
ఇరాన్ ఇజ్రాయెల్ భూభాగంపై తమ మిస్సైల్ దాడులను నిరంతరాయంగా కొనసాగిస్తూనే ఉంది. అయితే, ఇరాన్ ప్రయోగిస్తున్న క్షిపణులను ఇజ్రాయెల్ సైన్యం ఎప్పటికప్పుడు దీటుగా అడ్డుకుంటోంది. అదే సమయంలో, ఇరాన్ రాజధాని టెహ్రాన్‌తో పాటు ఇతర ప్రధాన నగరాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు నివేదికలు వెలువడ్డాయి. టెహ్రాన్ సమీపంలో ఉన్న సుప్రీం లీడర్ కార్యాలయాల వద్ద అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించినట్లు సమాచారం. దీనిపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ దాడులకు మరింత కఠినమైన ప్రతీకారం తీర్చుకుంటామని ఘాటుగా హెచ్చరించింది. కాగా, ఈ సైనిక చర్యలను అమెరికా ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ (Operation Epic Fury) పేరుతో నిర్వహిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.