📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత ఎపిలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ ఈరోజు బంగారం ధరలు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత ఎపిలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ ఈరోజు బంగారం ధరలు

USA: చర్చలు జరిపేందుకు ముందుకొచ్చిన ఇరాన్‌: ట్రంప్

Author Icon By Vanipushpa
Updated: January 12, 2026 • 11:51 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ(Khameni) నేతృత్వంలోని ఇరాన్‌ నాయకత్వం తనతో చర్చల జరిపేందుకు ముందుకొచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతోన్న ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలపై చర్చల కోసం ఇరాన్‌ నాయకులు తనకు ఫోన్ చేశారని తెలిపారు. అమెరికా చేతిలో దెబ్బలు తినడం వారికి విసుగు చెంది ఉంటుందని అందుకే చర్చలకు వచ్చినట్లు తెలుస్తోందన్నారు. త్వరలోనే ఇరాన్ నాయకత్వంతో భేటీ అయ్యే అవకాశం ఉందని అది కూడా ఒక సమావేశం మాత్రమే జరుగుతుందన్నారు. అయితే, ఇరాన్ తన పరిమితులు దాటినట్లుగా కనిపిస్తోందని భేటీకి ముందే తాము చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఇరాన్ నాయకులు కేవలం హింస ద్వారానే పరిపాలిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని చెప్పిన ట్రంప్‌, ఇరాన్‌పై బలమైన ప్రత్యామ్నాయాలను కోసం పరిశీలిస్తున్నామని వెల్లడించారు.

Read Also: Miguel Diaz-Canel: దేశం కోసం పోరాడతాం అంటూ ట్రంప్‌కు క్యూబా ఘాటు హెచ్చరికలు

USA: చర్చలు జరిపేందుకు ముందుకొచ్చిన ఇరాన్‌: ట్రంప్

మేం గ్రీన్‌లాండ్‌ను తీసుకోకపోతే రష్యా, చైనా తీసుకుంటాయి: ట్రంప్‌

మరోవైపు గ్రీన్‌లాండ్‌ వ్యవహారంపైనా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తాజాగా మరోసారి మాట్లాడారు. ఆ ద్వీపాన్ని అమెరికా తీసుకోకపోతే, రష్యా లేదా చైనా స్వాధీనం చేసుకుంటాయని అభిప్రాయపడ్డారు. గ్రీన్‌లాండ్‌ను ఆ దేశాల వశం చేసుకోకుండా తాను అడ్డుకుంటానని స్పష్టం చేశారు. గ్రీన్‌లాండ్‌తో ఒప్పందానికి తాను ఇష్టపూర్వకంగా ఉన్నానని, అది సులభమని ట్రంప్​ వ్యాఖ్యానించారు. ఏది ఏమైనప్పటికీ గ్రీన్‌లాండ్‌ తమది కాబోతుందని తెలిపారు. “మేం గ్రీన్‌లాండ్‌ను తీసుకోకపోతే రష్యా, చైనా తీసుకుంటాయి. అది నేను జరగనివ్వను. నేను నాటోను కాపాడిన వ్యక్తిని వారిని జీడీపీలో 5.5% చెల్లించేలా వారిని నేను ఒప్పించాను. అది 2 శాతంగా ఉన్నప్పుడు వారు చెల్లించలేదు, ఇప్పుడు వారు 5 శాతం చెల్లిస్తున్నారు. నేను నాటోను రక్షించాను అని ట్రంప్‌ అన్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper:epaper.vaartha.com

Read also:

Diplomatic talks Donald Trump Global Politics International Relations Iran Talks Middle East Politics Nuclear Deal Telugu News online Telugu News Today US Iran relations

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.