📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు

US: ఇరాన్ లో ఆందోళనకారులకు ట్రంప్ మద్దతు..నేలకు రాలుతున్న అనేకులు

Author Icon By Vanipushpa
Updated: January 14, 2026 • 11:15 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇరాన్ లో ఆందోళన కారులకు అమెరికా అధ్యక్షుడు మొదట నుంచీ మద్దతుగా ఉన్నారు. అవసరమైతే అక్కడి ప్రభుత్వం మీద సైనిక చర్య కూడా తీసుకుంటామని తెలిపారు. తాజాగా దీనికి సంబంధించి ఆయన మరో పోస్ట్ పెట్టారు. నిరసనలు కొనసాగించాలని, ప్రభుత్వ సంస్థలను స్వాధీనం చేసుకోవాలని ఇరాన్‌ (Iran) నిరసనకారులకు పిలుపునిచ్చారు. పోరాటానికి సాయం చేస్తామని అన్నారు. హంతకులు, దాడులు చేసేవారి పేర్లను నమోదు చేసుకోండి. వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. నిరసనకారుల హత్యలు ఆపే వరకు ఇరాన్ అధికారులతో అన్ని సమావేశాలను రద్దు చేసుకున్నా. నిరసనకారులకు సాయం అందిస్తా అటూ తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Read Also: Iran : ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

US: ఇరాన్ లో ఆందోళనకారులకు ట్రంప్ మద్దతు..నేలకు రాలుతున్న అనేకులు

ఆందోళనల్లో 12 వేల మందికిపైగా మృతి?

ఇరాన్ లో ఆందోళనల్లో ప్రజలు చనిపోతున్నారు కానీ ఇప్పటి వరకు 700 లేదా 800 మంది మాత్రమే చనిపోయారని అక్కడి ప్రభుత్వం లెక్కలు చెబుతోంది. మహా అయితే రెండు వేలు ఉండొచ్చని అధికారులు చెప్పారు. కానీ అవన్నీ తప్పుడు లెక్కలు అంటోంది స్థానిక వెబ్ సైట్. దీనికి సంబంధించి ఇరాన్ ఇంటర్నేషనల్ అనే వెబ్ సైట్ సంచలన కథనాన్ని పోస్ట్ చేసింది. ఆందోళనల్లో 12 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు ఈ వెబ్ సైట్ చెబుతోంది. దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల్లో ప్రజలతో పాటూ భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. భద్రతా సంస్థలు, అధ్యక్ష కార్యాలయం, ప్రత్యక్ష సాక్షులు, వైద్యాధికారులు.. తదితర వర్గాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ అంచనా వేసినట్లు తెలిపింది. జనవరి 8, 9 తేదీల్లోనే ఈ మరణాలు చోటుచేసుకున్నాయని, ఓ ప్రణాళిక ప్రకారమే ఈ హింసాత్మక ఘటనలు జరిగాయని తెలిపింది. ఇరాన్ లో ఇంతకు ముందు ఎప్పుడూ ఈ తరహా ఆందోళనలు జరగలేదని ఆ వెబ్ సైట్ చెబుతోంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

anti-government demonstrations Donald Trump Iran arrests Iran government crackdown Iran protests Iran Unrest Middle East News political protests Telugu News online Telugu News Today US Iran relations

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.