📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Iran war: అణు బాంబు తయారీ ఆపేస్తాం! కానీ ఆ ఒక్క కండిషన్!

Author Icon By Vanipushpa
Updated: March 5, 2026 • 4:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పశ్చిమ ఆసియాలో గత ఆరు రోజులుగా జరుగుతున్న భీకర పోరు(Iran war)లో ఊహించని మలుపు చోటు చేసుకుంది. ఇరాన్ తన వివాదాస్పద అణు కార్యక్రమాన్ని (Nuclear Programme) పూర్తిగా వదిలిపెట్టడానికి సిద్ధమని ప్రకటించింది. అయితే దీనికి ఒకే ఒక్క కఠినమైన షరతును విధించింది. అమెరికా తమకు ‘సంతృప్తికరమైన ప్రత్యామ్నాయ ఆఫర్’ ఇస్తేనే అణు మార్గం నుంచి తప్పుకుంటామని ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి మాజిద్ తఖ్త్-రావాంచీ స్పష్టం చేశారు. ఈ ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో హాట్ టాపిక్‌గా మారింది.

Read Also: PM Modi: యుద్ధం ఒక్కటే సమస్యలకు పరిష్కారం కాదు : ప్రధాని మోదీ

Iran war: We will stop the production of nuclear bombs! But on that one condition!

‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’లో భాగంగా ..

యుద్ధం మధ్యలో శాంతి మాటలు? ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’లో భాగంగా ఫిబ్రవరి 28 న ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. ఈ దాడితో తీవ్రంగా దెబ్బతిన్న ఇరాన్.. ఇప్పుడు దౌత్యపరమైన మార్గాల వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. నిజానికి అణు ఒప్పందంపై ఒమన్ మధ్యవర్తిత్వంతో చర్చలు జరగాల్సి ఉన్నప్పటికీ.. అవి విఫలం కావడంతోనే అమెరికా సైనిక చర్యకు దిగింది. తమ గడువు ముగియకముందే అమెరికా దాడులు ప్రారంభించిందని ఇరాన్ ఆరోపిస్తోంది. అమెరికా పెట్టిన ఆ ‘షరతు’ ఏమిటి? స్కై న్యూస్ అరేబియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తఖ్త్-రావాంచీ మాట్లాడుతూ.. “అమెరికా గనుక మాకు ‘శాటిస్‌ఫాక్టరీ ఆఫర్’ ఇస్తే.. మేము అణు కార్యక్రమాన్ని పక్కన పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం” అని తెలిపారు. అంటే ఆర్థిక ఆంక్షల తొలగింపు లేదా భద్రతా పరమైన హామీలను ఇరాన్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అమెరికా మాత్రం ఇందుకు భిన్నమైన వాదనను వినిపిస్తోంది. ఇరాన్ గనుక అణు ఆయుధాలను తయారు చేస్తే అది ప్రపంచానికే ముప్పు అని ట్రంప్ ప్రభుత్వం గట్టిగా హెచ్చరిస్తోంది. అసలేంటి శాటిస్‌ఫాక్టరీ ఆఫర్? ఇరాన్ పేర్కొన్న ‘సంతృప్తికరమైన ప్రత్యామ్నాయం’ అంటే కేవలం నగదు సాయం మాత్రమే కాదు, అది ప్రధానంగా ఆ దేశ భద్రత, ఆర్థిక మనుగడకు సంబంధించిన హామీ.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

IAEA inspections international sanctions removal Iran nuclear program Iran US nuclear deal nuclear bomb production halt Tehran nuclear policy Telugu News Paper

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.