📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Iran: కువైట్, ఖతర్, అబుధాబి, బహ్రెయిన్ పైనా ఇరాన్‌ మిస్సైళ్లు

Author Icon By Vanipushpa
Updated: February 28, 2026 • 4:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇరాన్‌పై దాడుల అనంతరం కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ వరకే ఇది పరిమితం కాలేదు. గల్ఫ్ దేశాలకూ పాకింది. భారతీయులు.. ప్రత్యేకించి తెలుగువాళ్లు ఎక్కువగా నివసించే కువైట్, ఖతర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ వంటి దేశాలపైనా దాడులు సాగాయి. బహ్రెయిన్ లో ఏకంగా అమెరికా నావల్ బేస్ సైతం ఇరాన్ సంధించిన శక్తిమంతమైన మిస్సైళ్ల ధాటికి భస్మీపటలం అయింది. ఇరాన్, ఇజ్రాయెల్, బహ్రెయిన్, యూఏఈ, ఖతార్‌లపై ఏకకాలంలో బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది ఇరాన్. అమెరికా, ఇజ్రాయెల్‌ల సంయుక్త దాడికి ప్రతీకారంగా ఈ చర్యకు దిగింది. ఈ దాడులు.. మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలను మరింత పెంచాయి. అమెరికా, ఇజ్రాయెల్‌ జాయింట్ గా ఇరాన్‌(Iran)లోని కీలక స్థావరాలపై దాడులు చేయగా.. దీనికి ప్రతిదాడికి దిగింది ఇరాన్. బహ్రెయిన్‌లోని యూఎస్ నేవీ బేస్ ను ధ్వంసం చేసిపడేసింది.

Read Also: Iran: ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాలు ఏమిటి?


Iran fires missiles over Kuwait, Qatar, Abu Dhabi, Bahrain

ఖతార్ పైనా క్షిపణుల వర్షం..

ఖతార్ పైనా క్షిపణుల వర్షం కురిసింది ఇరాన్ వైపు నుండి. కొన్ని గంటల తర్వాత ఓ క్షిపణిని ఖతర్ ఇంటర్ సెప్ట్ చేసింది. అబుదాబిలోని యూఎస్ ఎయిర్ బేస్‌లు, ఖతార్‌లోని దోహా లక్ష్యం అయ్యాయో లేదో వెంటనే స్పష్టంగా తేలలేదు. అబుదాబిలోని అల్ ధఫ్రా ఎయిర్ బేస్‌ను యూఏఈ ఎయిర్ ఫోర్స్, యూఎస్ ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా ఉపయోగిస్తున్నాయి. దోహాలోని 24 హెక్టార్ల అల్ ఉదీద్ ఎయిర్ బేస్ యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తోంది. ఈ కారణంతో ఇరాన్.. ఆయా దేశాలపై క్షిపణుల దాడులకు పూనుకుంది. అమెరికా బేస్ సెంటర్లే వాటి లక్ష్యం అయినప్పటికీ.. పలు చోట్ల సాధారణ, పౌర, ప్రైవేటు ఆస్తులను నష్టం వాటిల్లినట్లు సమాచారం అందింది. తమ దేశంపై జరిగిన దాడులను బహ్రెయిన్ నిర్ధారించింది. తమ దేశంలోని యూఎస్ నేవీ 5వ బేస్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడి జరిగిందని తెలిపింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Al Dhafra Base UAE Al Salem Air Base Kuwait Al Udeid Air Base Qatar Iran Missile Attacks IRGC Retaliation 2026 Middle East Missile Strikes Telugu News Paper Telugu News Today US Fifth Fleet Bahrain

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.