📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Iran war: ఇరాన్‌లో హై అలర్ట్: ఖమేనీ అంత్యక్రియలు వాయిదా… ఎందుకు?

Author Icon By Vanipushpa
Updated: March 6, 2026 • 11:43 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ.. ఇరాన్(Iran) తన అత్యున్నత నాయకుడు అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. గత శనివారం అమెరికా , ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన భారీ దాడుల్లో (Operation Epic Fury) ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. బుధవారం సాయంత్రం జరగాల్సిన వీడ్కోలు వేడుకలను అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్లు ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ప్రకటించింది.

Read Also: Iran Israel War: భారత్‌కు గుడ్ న్యూస్.. రష్యా చమురు దిగుమతికి ట్రంప్ సర్కార్ గ్రీన్ సిగ్నల్

Iran war: High alert in Iran: Khamenei’s funeral postponed… Why?

అంత్యక్రియల వాయిదాకు కారణం ఏమిటి?

ఇరాన్ అధికారుల సమాచారం ప్రకారం.. ఖమేనీకి చివరిసారిగా వీడ్కోలు పలికేందుకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు తరలివచ్చే అవకాశం ఉంది. ఇంత భారీ స్థాయిలో ప్రజలు తరలివస్తే వారిని నియంత్రించడం, భద్రతా ఏర్పాట్లు చేయడం ప్రస్తుతం ఒక పెద్ద సవాలుగా మారింది. “అనూహ్యమైన జనసందోహం వచ్చే అవకాశం ఉన్నందున, సరైన మౌలిక సదుపాయాలు , ఏర్పాట్ల కోసం ఈ వేడుకను వాయిదా వేస్తున్నాం. కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తాం” అని ఇరాన్ ఇస్లామిక్ డెవలప్‌మెంట్ కోఆర్డినేషన్ కౌన్సిల్ తెలిపింది. ఖమేనీ మరణంతో ఇరాన్ చేస్తున్న యుద్ధం (iran war) మరింత తీవ్రతరమైంది. ఇరాన్ ప్రభుత్వం ఇప్పటికే 40 రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించింది. తొలుత టెహ్రాన్‌లో నివాళులర్పించిన తర్వాత.. ఖమేనీ భౌతిక కాయాన్ని ఆయన జన్మస్థలమైన పవిత్ర నగరం మషద్‌కు తరలించి అక్కడ అంత్యక్రియలు నిర్వహించాలని ప్లాన్ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Ayatollah Khamenei Iran High Alert Iran News Today Iran Security Update Khamenei Funeral Postponed Middle East Tension Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.