Iran Nuclear: అణు కేంద్రాల భద్రతపై ఇరాన్ ఫోకస్

Read Time:  1 min
అణు కేంద్రాల భద్రతపై ఇరాన్ ఫోకస్
అణు కేంద్రాల భద్రతపై ఇరాన్ ఫోకస్
FONT SIZE
GET APP

దేశం చుట్టూ అమెరికా సైనిక మోహరింపులను పెంచుతుండటంతో భూగర్భంలోని తమ అణు కేంద్రాల భద్రతను బలోపేతం చేసుకోవడంపై ఇరాన్(Iran) ఫోకస్ పెట్టింది. శక్తివంతమైన బాంబు దాడులనూ తట్టుకొని నిలువగలిగేలా వాటిలో యుద్ధ ప్రాతిపదికన నిర్మాణ పనులను నిర్వహిస్తోంది. ఈ అంశాలను నిరూపించే తాజా శాటిలైట్ ఫొటోలతో అమెరికాకు చెందిన అణ్వస్త్ర కార్యక్రమాల అధ్యయన సంస్థ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఓ నివేదికను విడుదల చేసింది. భూగర్భంలో అణు కేంద్రాలు ఉన్న కీలకమైన ప్రదేశాలు పైకి ఏమాత్రం కనిపించకుండా ఇరాన్ ప్రస్తుతం నిర్మాణ పనులను చేయిస్తోందని ఈ నివేదిక పేర్కొంది. ఓ వైపు అమెరికాతో చర్చలు జరుపుతూనే, మరోవైపు అణుకేంద్రాల ఆనవాళ్లను దాచేందుకు ఇరాన్ యత్నిస్తుండటం ఆందోళనకర అంశమని ఇన్‌స్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ తెలిపింది. పర్చిన్ మిలిటరీ కాంప్లెక్స్ పరిధిలో ఉన్న తాలేఘాన్-2 అణు కేంద్రం పైకి కనిపించకుండా, దాన్ని మట్టితో పూడ్చేసే పనిలో గత రెండు, మూడు వారాలుగా ఇరాన్ బిజీగా ఉందని చెప్పింది.

Read Also: China: బాణసంచా దుకాణాల్లో వరుస పేలుళ్లు.. 12 మంది మృతి

 Iran Nuclear: Iran focuses on the security of nuclear plants
Iran Nuclear: Iran focuses on the security of nuclear plants

శాటిలైట్ల కంటికి ఈ అణుకేంద్రం చిక్కకుండా జాగ్రత్త

ఇరాన్‌లోని పర్చిన్ మిలిటరీ కాంప్లెక్స్ పరిధిలోనే తాలేఘాన్ 2 అణు కేంద్రం ఉంది. ఇది ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు ఆగ్నేయ దిశలో 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఫిబ్రవరి 13న అమెరికా తీసిన శాటిలైట్ ఫొటోల ప్రకారం తాలేఘాన్ 2 అణు కేంద్రం ప్రధాన నిర్మాణం చుట్టూ, పైన బలమైన కాంక్రీట్ కవచాన్ని నిర్మించారు. ఈ కాంక్రీట్ కవచంపైన పలుచోట్ల మట్టిని పేర్చారు. తద్వారా అమెరికా యుద్ధ విమానాలు, శాటిలైట్ల కంటికి ఈ అణుకేంద్రం చిక్కకుండా జాగ్రత్త చర్యలను ఇరాన్ చేపట్టిందని ఇన్‌స్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ పేర్కొంది. త్వరలో తాలేఘాన్ 2 అణు కేంద్రం నిర్దిష్ట ఆనవాళ్లు కనిపించడం కూడా కష్టతరంగా మారొచ్చని తెలిపింది.

త్వరలోనే ఆ మట్టిరాశులతో తాలేఘాన్

అమెరికా యుద్ధ విమానాల దాడుల బారి నుంచి అణుకేంద్రాలను కాపాడుకునేందుకే ఇరాన్ ఈ పనులన్నీ చేస్తోందని ఐఎస్ఐఎస్ ప్రెసిడెంట్ డేవిడ్ ఆల్ బ్రైట్ విశ్లేషించారు. తాలేఘాన్ 2 అణు కేంద్రం చుట్టూ, పైన నిర్మించిన కాంక్రీట్ కవచం కాస్త గట్టిపడగానే, దాన్ని మట్టిరాశులతో కప్పేసే పనిని ఇరాన్ చేస్తుందని ఆయన అన్నారు. ఈ అణుకేంద్రంలోని అన్ని ముఖ్య ప్రాంతాల కాంక్రీట్ కవచంపైన మట్టిరాశులను పేర్చే అవకాశం ఉందని చెప్పారు. ఇందుకోసం పర్చిన్ ప్రాంతం సమీపంలోని పర్వతాల నుంచి పెద్దఎత్తున మట్టిరాశులను సేకరించే పనినీ ఇరాన్ మొదలుపెట్టిందని డేవిడ్ ఆల్ బ్రైట్ పేర్కొన్నారు. త్వరలోనే ఆ మట్టిరాశులతో తాలేఘాన్ 2 అణుకేంద్రాన్ని పూర్తిగా కవర్ చేసే ఛాన్స్ ఉందన్నారు. కేవలం ఎంట్రెన్స్, ఎగ్జిట్ గేట్‌ల ఏరియాలను మాత్రమే వదిలే అవకాశం ఉందని తెలిపారు. తాలేఘాన్ 2 అణు కేంద్రం చుట్టూ కాంక్రీట్ కవచాన్ని నిర్మించేందుకు పర్చిన్ మిలిటరీ కాంప్లెక్స్‌లోనే ప్రత్యేక కాంక్రీట్ బ్యాచ్ ప్లాంటును ఇరాన్ సర్కారు ఏర్పాటు చేసిందన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.