ఇరాన్‌లో గత కొన్ని వారాలుగా సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ(Khameni)కి వ్యతిరేకంగా సాగుతున్న ప్రజా నిరసనలను అణచివేసేందుకు ప్రభుత్వం కఠిన నిర్ణయాలు(Iran to hang) తీసుకుంటోంది. ఈక్రమంలో ఆందోళనల్లో పాల్గొన్న ఎర్ఫాన్ సుల్తానీ(Erfan Soltani)(26) అనే యువకుడిని ఉరితీసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుత నిరసనల నేపథ్యంలో అమలు చేయనున్న మొదటి ఉరిశిక్ష ఇదే కావడం గమనార్హం. టెహ్రాన్ శివార్లలోని ఫర్దిస్ నివాసి అయిన ఎర్ఫాన్ సుల్తానీని జనవరి 8న భద్రతా దళాలు అరెస్టు చేశాయి. దేశవ్యాప్తంగా సాగుతున్న ఖమేనీ వ్యతిరేక ప్రదర్శన(anti-Khamenei protests)ల్లో చురుగ్గా పాల్గొన్నారనేది అతనిపై ఉన్న ప్రధాన ఆరోపణ. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే, అంటే జనవరి 11న అతని కుటుంబ సభ్యులకు అధికారులు షాకింగ్ న్యూస్ చెప్పారు. ఎర్ఫాన్‌కు మరణశిక్ష విధించినట్లు, బుధవారం (జనవరి 14) నాడు ఉరితీత ఉంటుందని సమాచారం అందించారు.
Read Also: US: పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్
మరణశిక్షపై మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం
మరణశిక్ష ఖరారైన తర్వాత, కేవలం 10 నిమిషాల పాటు మాత్రమే అతనిని కలిసేందుకు కుటుంబానికి అనుమతినిచ్చారు. ఎర్ఫాన్ సోదరి న్యాయవాది అయినప్పటికీ, కనీసం కేసు ఫైల్ చూసేందుకు కూడా అధికారుల ఆమెను అనుమతించకపోవడం గమనార్హం. ఇరాన్‌లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, కరెన్సీ పతనం, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకడంతో ప్రజలు వీధుల్లోకి వచ్చారు. 2025 డిసెంబర్ చివరిలో ప్రారంభమైన ఈ నిరసనలు, క్రమంగా ఖమేనీ నేతృత్వంలోని మతతత్వ ప్రభుత్వం గద్దె దిగాలనే డిమాండ్‌గా మారాయి. నిరసనకారులు ఖమేనీ ఫోటోలను తగలబెడుతూ, “సర్వాధికారికి మరణం” అంటూ నినదిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన ఘర్షణల్లో వందలాది మంది మరణించగా, వేల సంఖ్యలో ప్రజలు జైలు పాలయ్యారు. ఎర్ఫాన్ సుల్తానీకి విధించిన మరణశిక్షపై మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: