అణ్వస్త్ర కార్యక్రమంపై అమెరికాతో పరోక్ష చర్చలు జరుపుతున్న ఇరాన్ తాజాగా ఓ సంచలన ప్రకటన చేసింది. తాత్కాలికంగా హార్ముజ్ (Hormuz) జలసంధిని మూసివేశామని వెల్లడించింది. తమ దేశ సైనిక విన్యాసాల కోసం హార్ముజ్ జలసంధిని మూసివేయాల్సి వచ్చిందని తెలిపింది. తద్వారా ముడి చమురు రవాణాకు అత్యంత కీలకమైన అంతర్జాతీయ జలమార్గం హార్ముజ్‌పై తమకు పట్టు ఉందనే పరోక్ష సందేశాన్ని అమెరికాకు ఇరాన్ పంపింది. హార్ముజ్ జలసంధి వద్ద తాము చేస్తున్న సైనిక విన్యాసాల ప్రభావం అమెరికాతో జరుపుతున్న చర్చలపైనా పడుతుందని ఇరాన్ భావిస్తోంది. మొత్తం మీద హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటన చేయడం ఇదే తొలిసారి.
Read Also: Artificial Intelligence: ఏఐతో రైల్వేల్లో ఉద్యోగుల పనితీరుపై నిఘా
జెనీవా నగరం వేదికగా అమెరికాతో ఇరాన్ చర్చలు
మంగళవారం రోజు (ఫిబ్రవరి 17న) స్విట్జర్లాండ్‌లోని జెనీవా నగరం వేదికగా అమెరికాతో ఇరాన్ చర్చలు జరిపింది. సరిగ్గా అదే రోజు ఉదయం ఇరాన్ ప్రభుత్వ మీడియాలో ఓ సంచలన కథనం ప్రసారమైంది. దేశ భద్రత కోసం హార్ముజ్ జలసంధిని ఇరాన్ తాత్కాలికంగా మూసివేసింది, ఆ జలసంధి దగ్గర సైనిక విన్యాసాలను మొదలుపెట్టింది అనేది ఆ కథనం సారాంశం. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ సైతం కీలక ప్రకటనను విడుదల చేశారు. ప్రపంచంలోనే శక్తివంతమైన సైన్యం కూడా కొన్నిసార్లు దారుణంగా దెబ్బతినాల్సి వస్తుందని, ఆ దెబ్బకు మళ్లీ కాళ్లపై నిలబడటం కూడా కష్టతరంగా మారుతుందని ఆయన హెచ్చరించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: