📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Trump: ఇరాన్‌లో 800 మందికి ఉరిశిక్ష రద్దు

Author Icon By Vanipushpa
Updated: January 17, 2026 • 12:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇరాన్‌ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో అరెస్టైన 800 మందికి విధించాల్సిన ఉరిశిక్షలను ఇరాన్ ప్రభుత్వం రద్దు చేసిందని ట్రంప్ వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని తాను ఎంతో గౌరవిస్తున్నట్లు పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. శుక్రవారం (స్థానిక కాలమానం ప్రకారం) వైట్ హౌస్ సౌత్ లాన్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్, “ఇరాన్‌లో నిన్న 800 మందికి పైగా ఉరి వేయాల్సి ఉంది. కానీ ఆ శిక్షలను రద్దు చేశారు. ఈ నిర్ణయాన్ని నేను ఎంతో గౌరవిస్తున్నాను” అని చెప్పారు. ఆ తర్వాత ట్రూత్ సోషల్​లో పోస్ట్ పెట్టారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలు ఇరాన్‌ (Iran) లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొన్న సమయంలో రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Read Also: Virat Kohli property investment : కోహ్లీ–అనుష్క మరో భారీ డీల్! అలీబాగ్‌లో రూ.37 కోట్ల భూమి?

Trump: ఇరాన్‌లో 800 మందికి ఉరిశిక్ష రద్దు

నిరసనలపై అంతర్జాతీయ ఆందోళన

ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఆందోళనకారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు భారీగా అరెస్టులు జరగడం, ఉరిశిక్షలపై వార్తలు రావడం ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో గతంలో ట్రంప్ ఇరాన్‌పై సైనిక జోక్యం కూడా ఉండొచ్చని హెచ్చరించారు. అయితే బుధవారం నాడు స్పందించిన ఆయన ఆందోళనకారుల హత్యలు ఆగాయని, ఇక పరిస్థితిని గమనిస్తామని తెలిపారు. సైనిక చర్యపై ఇప్పటికైతే చూసి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ అంశంపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ పరిణామాలను అమెరికా అధ్యక్షుడు, ఆయన బృందం నిశితంగా గమనిస్తున్నారని తెలిపారు. “ఆందోళనకారుల హత్యలు కొనసాగితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ఇరాన్ ప్రభుత్వానికి ఇప్పటికే హెచ్చరికలు ఇచ్చాం. ఉరిశిక్షలు నిలిపివేయడం ఒక కీలక పరిణామం.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

capital punishment Iran international human rights Iran abolishes executions Iran death penalty news Iran human rights update Iran judiciary reforms Latest News in Telugu Telugu News online

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.