📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

America: కూతురిని చంపి ‘పూల్’ డ్రామా ఆడిన లేడీ డాక్టర్: పోస్ట్‌మార్టంలో బట్టబయలైన అసలు రంగు!

Author Icon By Vanipushpa
Updated: February 27, 2026 • 12:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఒక పక్క పిల్లలకు ప్రాణం పోయాల్సిన వైద్యురాలు, మరోపక్క కన్నతల్లి.. ఈ రెండు పవిత్రమైన బంధాలను మంటగలుపుతూ డాక్టర్ నేహా గుప్తా తన 4 ఏళ్ల కుమార్తె ఆరియా తలతిని హత్య చేసిన తీరు విస్మయానికి గురిచేస్తోంది.

Read Also: Stock Markets: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

The lady doctor who killed her daughter and played a ‘pool’ drama: The true colors were revealed in the postmortem!

ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం

2025 జూన్‌లో ఫ్లోరిడా(Florida)లోని ఒక రెంటల్ హౌస్‌లో ఈ ఘటన జరిగింది. అర్థరాత్రి వేళ 911 అత్యవసర సర్వీసులకు ఫోన్ చేసిన నేహా, తన కూతురు ప్రమాదవశాత్తూ స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయిందని, తనకు ఈత రాకపోవడం వల్ల కాపాడలేకపోయానని ఏడుస్తూ నమ్మబలికారు. పోలీసులు వచ్చేసరికి చిన్నారి మృతదేహం పూల్ అడుగున ఉందని, సుమారు 20 నిమిషాలు నీటిలోనే ఉందని ఆమె వాంగ్మూలం ఇచ్చారు.

పోస్ట్‌మార్టంలో బయటపడిన పచ్చి నిజం

వైద్యురాలిగా నేరాన్ని కప్పిపుచ్చవచ్చని నేహా భావించినప్పటికీ, ఫోరెన్సిక్ నివేదిక ఆమె అసలు రంగును బయటపెట్టింది. నీరు లేని ఊపిరితిత్తులు: సాధారణంగా నీటిలో పడి చనిపోయిన వారి ఊపిరితిత్తులు, కడుపులో నీరు ఉంటుంది. కానీ ఆరియా శరీరంలో ఒక్క చుక్క నీరు కూడా లేదు. ఎవరో ముక్కు, నోరు బలంగా నొక్కి ఉంచడం వల్లే చిన్నారి ప్రాణాలు పోయాయని, ఆమెను చంపిన తర్వాతే పూల్‌లో వేసారని డాక్టర్లు నిర్ధారించారు. నేహా గుప్తా తన భర్తతో తీవ్రమైన విడాకుల గొడవల్లో ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కస్టడీ పోరు: చిన్నారి తండ్రి తన కూతురు పూర్తి బాధ్యత (Custody) కోసం కోర్టులో పోరాడుతున్నారు. తండ్రికి తెలియకుండానే: తన కూతురిని నేహా ఫ్లోరిడాకు తీసుకువెళ్లిన విషయమే తనకు తెలియదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భార్య మానసిక స్థితి సరిగా లేదని కూడా ఆయన పోలీసులకు తెలిపారు. ప్రస్తుతం నేహా గుప్తా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ కేసు తదుపరి విచారణ మే నెలలో కోర్టు ముందుకు రానుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Child Custody Case Child Murder Florida Divorce Dispute Florida News Indian Origin Doctor Neha Gupta Case Pediatrician Crime Post-mortem Report

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.