అమెరికాలో భారీ సెక్స్, డ్రగ్స్ రాకెట్ నిర్వహిస్తున్నారన్న ఆరోపణలపై భారత సంతతికి చెందిన దంపతులతో పాటు మరో ముగ్గురిని ఫెడరల్, స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. వర్జీనియా (Virginia) రాష్ట్రంలో వీరు తమ సొంత మోటల్‌నే అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మార్చి ఈ దందా నడిపినట్లు అధికారులు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే… 52 ఏళ్ల కోశా శర్మ, 55 ఏళ్ల తరుణ్ శర్మ దంపతులు వర్జీనియాలో ‘రెడ్ కార్పెట్ ఇన్’ అనే మోటల్ నిర్వహిస్తున్నారు. వీరు తమ మోటల్‌లోని మూడో అంతస్తును పూర్తిగా డ్రగ్స్ అమ్మకాలు, వ్యభిచారం కోసం కేటాయించి, కింది అంతస్తులలో సాధారణ అతిథులకు గదులు ఇచ్చేవారు. ఈ అక్రమ కార్యకలాపాల ద్వారా వచ్చే లాభాల్లో వాటాలు తీసుకునేవారని ఫెడరల్ అధికారులు తెలిపారు. వీరితో పాటు ఈ రాకెట్‌లో భాగస్వాములైన మార్గో పియర్స్ (51), జాషువా రెడ్డిక్ (40), రషార్డ్ స్మిత్ (33) అనే మరో ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు.
Read Also: Trump Greenland issue: గ్రీన్‌ల్యాండ్ కోసం ట్రంప్ యుద్ధమా? నాటోలో చీలిక!
కోర్టు పత్రాల ప్రకారం 2025 మే నుంచి ఆగస్టు మధ్య ఎఫ్‌బీఐ, స్థానిక పోలీసులు తొమ్మిదిసార్లు అండర్‌కవర్ ఆపరేషన్లు నిర్వహించారు. ఏజెంట్లు విటులుగా, సెక్స్ వర్కర్లుగా మోటల్‌కు వెళ్లి వీరి గుట్టురట్టు చేశారు. ఈ క్రమంలో 15 సార్లు డ్రగ్స్ కొనుగోలు చేయగా, వాటిలో 11 సార్లు ఫెంటానిల్, నాలుగు సార్లు కొకైన్ లభించింది. కనీసం ఎనిమిది మంది మహిళలతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారని, వారిని శారీరకంగా హింసిస్తూ బయటకు వెళ్లకుండా నిర్బంధించారని తేలింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: