हिन्दी | Epaper
పెరిగిన బంగారం ధరలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఆక్వారంగానికి మేలు ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల తల్లీకొడుకు దారుణహత్య చర్లపల్లి రైల్వే స్టేషన్ పొగాకుపై పన్ను పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు ఏపీలో 25 మున్సిపల్ సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ వారణాసి’ సీక్వెల్‌ పెరిగిన బంగారం ధరలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఆక్వారంగానికి మేలు ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల తల్లీకొడుకు దారుణహత్య చర్లపల్లి రైల్వే స్టేషన్ పొగాకుపై పన్ను పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు ఏపీలో 25 మున్సిపల్ సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ వారణాసి’ సీక్వెల్‌ పెరిగిన బంగారం ధరలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఆక్వారంగానికి మేలు ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల తల్లీకొడుకు దారుణహత్య చర్లపల్లి రైల్వే స్టేషన్ పొగాకుపై పన్ను పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు ఏపీలో 25 మున్సిపల్ సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ వారణాసి’ సీక్వెల్‌ పెరిగిన బంగారం ధరలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఆక్వారంగానికి మేలు ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల తల్లీకొడుకు దారుణహత్య చర్లపల్లి రైల్వే స్టేషన్ పొగాకుపై పన్ను పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు ఏపీలో 25 మున్సిపల్ సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ వారణాసి’ సీక్వెల్‌

Ajit Doval: భారత్‌ తలొగ్గదని అమెరికాకు భారత్‌ వార్నింగ్‌

Vanipushpa
Ajit Doval: భారత్‌ తలొగ్గదని అమెరికాకు భారత్‌ వార్నింగ్‌

వాణిజ్య ఒప్పందం చర్చలకు సంబంధించి సెప్టెంబర్‌లో జరిగిన ఓ కీలక సమావేశంలో అమెరికాకు భారత్‌ గట్టి వార్నింగ్‌ ఇచ్చినట్లు తాజాగా వెల్లడైంది. ట్రేడ్‌ డీల్‌ కోసం తొందరేమి లేదని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పదవీకాలం ముగిసేవరకు వేచి చూస్తామని భారత్‌ తేల్చిచెప్పినట్లు బ్లూమ్‌బర్గ్‌ కథనంలో పేర్కొంది. భారత్‌- అమెరికా వాణిజ్య ఒప్పందం కుదిరిన వేళ ఈ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వాణిజ్య చర్చల సమయంలో భారత ప్రభుత్వంపై, ప్రధాని నరేంద్ర మోదీపై ట్రంప్‌, ఆయన వాణిజ్య సలహాదారు పీటర్‌ నవారో సహా పలువురు అధికారులు నోరు పారేసుకున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబరులో జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ (Ajit Doval), అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోలు సమావేశమయ్యారు. ఆ భేటీలో భారత్​ తన వైఖరిని స్పష్టంగా తెలియజేసింది. ట్రంప్‌, ఆయన అధికారుల బెదిరింపులకు భారత్‌ తలొగ్గదని, అవసరమైతే వాణిజ్య ఒప్పందం కోసం ట్రంప్‌ పదవీ కాలం ముగిసేవరకు వేచిచూస్తామని రూబియోతో ఢోబాల్‌ చెప్పినట్లు బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది.

Read Also: Epstein email scandal : ఎప్‌స్టీన్ ఫైల్స్ షాక్, మైనర్ల వద్దకు రమ్మంటూ ఈమెయిల్!

Ajit Doval: భారత్‌ తలొగ్గదని అమెరికాకు భారత్‌ వార్నింగ్‌
Ajit Doval: భారత్‌ తలొగ్గదని అమెరికాకు భారత్‌ వార్నింగ్‌

ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు

అయితే, ఈ సమావేశం జరిగిన కొన్ని రోజులకే ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు కొంతమేర తగ్గినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ప్రధాని మోదీకి ట్రంప్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఆ సమయంలో ప్రధానిపై అమెరికా అధ్యక్షుడు ప్రశంసల వర్షం కురిపించారు. మరోవైపు, ఈ భేటీ గురించి అమెరికా విదేశాంగ ప్రతినిధి కూడా మాట్లాడారు. ప్రైవేటు చర్చల వివరాలు బయటకు వెల్లడించలేమని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, భారత్‌ ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదిలా ఉండగా, ఇటీవల భారత్‌- అమెరికాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంతో అమెరికా దిగుమతి చేసుకునే భారత వస్తువులపై సుంకాలను 18 శాతానికి తగ్గిస్తున్నట్లు అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. దీంతో దక్షిణాసియాలోని పొరుగు దేశాలు, కీలక ఎగుమతి పోటీదారుల కంటే భారత్​ పైచేయి సాధించినట్లయింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870