📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Iran: ఇండియా వచ్చేయండి..ఇరాన్‌లో భారతీయులకు కేంద్రం అలర్ట్

Author Icon By Vanipushpa
Updated: February 23, 2026 • 3:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇరాన్‌లో ఉన్న భారతీయ పౌరులకు భారత ప్రభుత్వం అత్యవసర హెచ్చరిక(america iran crisis) జారీ చేసింది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్‌లో మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న భద్రతా ముప్పుల దృష్ట్యా భారతీయులందరూ (indian-citizens) తక్షణమే ఆ దేశాన్ని విడిచిపెట్టి రావాలని సూచించింది. “ఇరాన్‌లో ప్రస్తుతం ఉన్న భారతీయ విద్యార్థులు, పర్యాటకులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు కమర్షియల్ విమానాలతో సహా అందుబాటులో ఉన్న ఏవైనా ప్రయాణ సాధనాల ద్వారా వెంటనే దేశాన్ని వీడాలి” అని రాయబార కార్యాలయం తన ప్రకటనలో స్పష్టం చేసింది. గతంలో జనవరిలో జారీ చేసిన అడ్వైజరీకి కొనసాగింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. భారతీయులకు సాయం చేసేందుకు ఇండియన్ ఎంబసీ హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది.

Read Also: Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ట్రంప్ టారిఫ్‌లకు బ్రేక్

Centre issues alert to Indians in Iran, asking them to come to India

వెంటనే ఆన్‌లైన్ పోర్టల్‌లో రిజిస్టర్

ఇరాన్‌(Iran)లో నిరసనలు లేదా భారీ ప్రదర్శనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలి.
డాక్యుమెంట్స్: పాస్‌పోర్ట్‌లు, ఐడీ కార్డులు, ఇతర ఇమ్మిగ్రేషన్ పత్రాలను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి.
రిజిస్ట్రేషన్: ఇప్పటి వరకు ఎంబసీలో తమ వివరాలు నమోదు చేసుకోని వారు వెంటనే ఆన్‌లైన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ఒకవేళ ఇంటర్నెట్ సమస్యలు ఉంటే, భారత్‌లోని వారి కుటుంబ సభ్యులు ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. నిరంతర పర్యవేక్షణ: తాజా పరిణామాల కోసం స్థానిక వార్తా సంస్థలను గమనిస్తూ, భారత ఎంబసీతో నిరంతరం సంప్రదింపుల్లో ఉండాలని కోరింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

India advisory for Iran India travel advisory Iran Indian nationals safety Indians in Iran alert Iran security situation Latest News in Telugu Ministry of External Affairs India Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.