అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) మరోసారి తన ‘టారిఫ్’ అస్త్రాన్ని ప్రయోగించారు. ఇరాన్ పై ఒత్తిడి పెంచే క్రమంలో భాగంగా ఆ దేశంతో వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్న ఏ దేశమైనా అమెరికాకు చేసే ఎగుమతులపై 25% అదనపు సుంకాన్ని చెల్లించాల్సి ఉంటుందని ప్రకటించారు. “ట్రూత్ సోషల్” వేదికగా ఆయన చేసిన ఈ ప్రకటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశంలో కలకలం రేపుతోంది. ఇరాన్ లో గత కొద్ది రోజులుగా జరుగుతున్న తీవ్ర ప్రభుత్వ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో ట్రంప్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇండియాపై పడనున్న పన్ను భారం ఎంత? భారతదేశానికి అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. అయితే ఇప్పటికే భారతీయ ఉత్పత్తులపై అమెరికా 50% వరకు పన్నులు విధిస్తోంది. ఇందులో 25% రెసిప్రోకల్ టారిఫ్స్ కాగా మరో 25% రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు విధిస్తున్న రుసుము.
Read Also: Sankranti: పండుగ వేళ భారీగా పెరిగిన నూనెల ధరలు..
పన్ను భారం ఏకంగా 75% కి చేరే ప్రమాదం
ఇప్పుడు తాజా టారిఫ్స్ (US Tariffs) ప్రకటనతో ఇరాన్ తో వ్యాపారం చేస్తున్నందుకు మరో 25% తోడైతే భారత ఎగుమతులపై పన్ను భారం ఏకంగా 75% కి చేరే ప్రమాదం ఉంది. ఇది మన దేశ ఎగుమతిదారులకు పెను సవాలుగా మారనుంది. భారత్ – ఇరాన్ వాణిజ్య సంబంధాలు ఇరాన్ కు అత్యధికంగా ఎగుమతులు చేసే మొదటి ఐదు దేశాల్లో భారత్ ఒకటి. ముఖ్యంగా బాస్మతీ బియ్యం, టీ, చక్కెర, మందులు, ఎలక్ట్రికల్ మిషనరీ వంటివి భారత్ నుంచి ఇరాన్ కు వెళ్తుంటాయి. మరోవైపు మనం ఇరాన్ నుండి డ్రై ఫ్రూట్స్, కెమికల్స్, గ్లాస్‌వేర్ దిగుమతి చేసుకుంటాము. 2025 అక్టోబర్ గణాంకాల ప్రకారం.. ఇరాన్‌కు భారత ఎగుమతులు 56.1 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ కొత్త పన్నుల వల్ల ఈ వాణిజ్యం మరింత క్షీణించే అవకాశం ఉంది.
ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలనే వ్యూహం
ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా దేశాలకు చేరుకోవడానికి పాకిస్తాన్ మీదుగా వెళ్లకుండా ఇది ఒక గేట్‌వేలా పనిచేస్తుంది. అమెరికా ఇప్పటికే ఈ పోర్ట్ కార్యకలాపాలకు ఇచ్చిన శాంక్షన్ మినహాయింపును (Waiver) ఈ ఏడాది ఏప్రిల్ వరకు పొడిగించింది. అయితే తాజా టారిఫ్స్ (US Tariffs) నిబంధనలు కఠినంగా అమలు చేస్తే ఈ ప్రాజెక్టులో పాల్గొంటున్న భారతీయ సంస్థలు అమెరికా ఆంక్షల బారిన పడే అవకాశం ఉంది. మొత్తంగా ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలనే వ్యూహం ఉంది. అయితే ఇది భారత్ వంటి మిత్ర దేశాల ఆర్థిక ప్రయోజనాలపై దెబ్బకొట్టేలా కనిపిస్తోంది. ఇప్పటికే అమెరికాతో ట్రేడ్ డీల్ కోసం భారత్ చర్చలు జరుపుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: