📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ ఈరోజు బంగారం ధరలు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ USలో మంచు తుఫాన్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ ఈరోజు బంగారం ధరలు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ USలో మంచు తుఫాన్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్

New Delhi: భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందం

Author Icon By Vanipushpa
Updated: January 27, 2026 • 11:10 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతున్న 16వ యూరోపియన్ యూనియన్-భారత్ (EU-India) శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఈ కీలక సమావేశంలో యూరోపియన్ యూనియన్ తరఫున యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ పాల్గొననున్నారు. భారత్-EU(EU) మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ శిఖరాగ్ర సమావేశం ప్రధాన లక్ష్యంగా చెప్పవచ్చు. యూరోపియన్ కౌన్సిల్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఈ సమావేశం ద్వారా వాణిజ్యం, భద్రత, రక్షణ, స్వచ్ఛమైన పరివర్తన (గ్రీన్ ట్రాన్సిషన్), ప్రజల నుండి ప్రజల సహకారం వంటి కీలక రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరించుకునే అవకాశం ఉంది. ఇటీవలి సంవత్సరాల్లో భారత్-EU సంబంధాల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తున్న నేపథ్యంలో ఈ శిఖరాగ్ర సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

Read Also: Winter Storm Hits US : USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి

భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందం

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

ఈ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానంగా చర్చకు రానున్న అంశాల్లో భారత్-EU స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) అత్యంత కీలకం కానుంది. ఈ ఒప్పందంపై చర్చలు విజయవంతంగా ముగిశాయని కేంద్ర వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఇటీవల వెల్లడించారు. చట్టపరమైన పరిశీలన (లీగల్ స్క్రబ్) పూర్తయ్యాక, ఐదు నుంచి ఆరు నెలలలో అధికారికంగా ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశముందని ఆయన తెలిపారు. ఈ ఒప్పందం సమతుల్యంగా, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడిందని, ఇది భారత్-EU మధ్య వాణిజ్యం, పెట్టుబడులకు కొత్త ఊపునిస్తుందని ఆయన పేర్కొన్నారు. EU-భారత్ సంబంధాలు గత కొన్ని సంవత్సరాలుగా సానుకూల దిశలో కొనసాగుతున్నాయి. అక్టోబర్ 2025లో యూరోపియన్ కౌన్సిల్ కొత్త వ్యూహాత్మక EU-భారత్ ఎజెండాను ఆమోదించింది. ఈ నేపథ్యంతో, ఈ శిఖరాగ్ర సమావేశంలో నాలుగు ప్రధాన రంగాలపై దృష్టి పెట్టనున్నారు. అవి శ్రేయస్సు – స్థిరత్వం, సాంకేతికత – ఆవిష్కరణ, భద్రత – రక్షణ, కనెక్టివిటీ – ప్రపంచ సమస్యలు.
EU ట్రేడ్ కమిషనర్ మార్కోస్ సెఫ్కోవిక్ ఇటీవల యూరో న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఈ FTA ఒప్పందాన్ని అన్ని ఒప్పందాలకు తల్లి గా అభివర్ణించారు.

వాణిజ్య ఒప్పందంపై అమెరికా కీలక వ్యాఖ్యలు

అధికారిక ప్రకటనల ప్రకారం.. ఈ శిఖరాగ్ర సమావేశంలో ఇండో-పసిఫిక్ ప్రాంత భద్రత, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, మధ్యప్రాచ్య పరిస్థితులు, బహుపాక్షిక వ్యవస్థల ప్రాముఖ్యత వంటి ప్రపంచ అంశాలపై కూడా చర్చ జరగనుంది. గణతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం ఉర్సులా వాన్ డెర్ లేయన్ మాట్లాడుతూ.. విజయవంతమైన భారతదేశం ప్రపంచాన్ని మరింత స్థిరంగా, సంపన్నంగా, సురక్షితంగా మారుస్తుందని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ కూడా కోస్టా, వాన్ డెర్ లేయన్‌లకు ఆతిథ్యం ఇవ్వడం భారత్‌కు గౌరవమని పేర్కొంటూ.. ఇది భారత్-EU భాగస్వామ్య బలాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. ఇదిలా ఉంటే భారత్‌, యురోపియన్‌ యూనియన్‌ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్‌ బెసెంట్‌ మాట్లాడుతూ.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై అమెరికా 25 శాతం సుంకాలు విధించినప్పటికీ, ఆ నిర్ణయం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ వ్యాఖ్యానించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

bilateral trade deal India EU economic partnership India EU FTA India EU trade agreement India Europe trade relations international trade agreement Telugu News Paper

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.