📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ ఈ రోజు బంగారం ధరలు 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్.. ఒకే టికెట్‌తో మూడు సేవలు హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం! హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో 220 ఉద్యోగాలు రైతులకు శుభవార్త చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా పద్ధతి అంతరిక్ష ప్రయాణాలకు సునీతా రిటైర్మెంట్ బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ ఈ రోజు బంగారం ధరలు 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్.. ఒకే టికెట్‌తో మూడు సేవలు హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం! హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో 220 ఉద్యోగాలు రైతులకు శుభవార్త చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా పద్ధతి అంతరిక్ష ప్రయాణాలకు సునీతా రిటైర్మెంట్ బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం

India-EU: భారత్, ఈయూల మధ్య కీలక ఒప్పందం

Author Icon By Vanipushpa
Updated: January 21, 2026 • 11:07 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చాలా రోజులుగా జరుగుతున్న భారత్, ఈయూ మధ్య వాణిజ్య చర్చలు ఒక కొలిక్కి రానున్నాయని తెలుస్తోంది. తొందరలోనే రెండు దేశాలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేస్తారని ఈయూ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ చెబుతున్నారు. భారత్, ఐరోపా సమాఖ్య మధ్య వాణిజ్య ఒప్పందం ఒక కీలక దశకు చేరుకుందని, ఇది ప్రపంచ వాణిజ్యాన్ని మార్చే చారిత్రాత్మక ఒప్పందం కావచ్చని ఆమె తెలిపారు. దావోస్(Davos) లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఉర్సులా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందం జరిగితే రెండు బిలియన్ల ప్రజలకు మార్కెట్ అందుబాటులోకి వస్తుందని…ఇది ప్రపంచ జీడీపీలో నాలుగో వంతని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ట్రంప్ సుంకాలు కొనసాగుతున్న వేళ భారత్, ఈయూ ల మధ్య ఈ వాణిజ్య ఒప్పందానికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.

Read Also: CM Revanth: దావోస్ పర్యటనలో ప్రముఖులు

India-EU: భారత్, ఈయూల మధ్య కీలక ఒప్పందం..

రెండు ఆర్థిక వ్యవస్థలకు వాణిజ్య పురోగతిగా ..

ఇంకా చేయాల్సిన పని ఉంది. కానీ మనం ఒక చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం అంచున ఉన్నాము. ఇది రెండు ఆర్థిక వ్యవస్థలకు వాణిజ్య పురోగతిగా మారుతుందని ఉర్సులా చెప్పారు. EU తన వాణిజ్య భాగస్వామ్యాలను వైవిధ్యపరచడానికి, రిస్క్‌ను తగ్గించడానికి చేస్తున్న ప్రయత్నంపై దృష్టి సారించిందన్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకదానిని ప్రపంచ వాణిజ్యానికి కేంద్ర స్తంభంగా మిగిలి ఉన్న ఒక కూటమితో అనుసంధానించడం ద్వారా వాణిజ్యం మరింత వేగంగా విస్తరిస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఈయూ…చైనాపై ఎక్కువగా ఆధారపడుతోంది. భారత్ తో ఒప్పదం కుదిరితే..ఇది తగ్గుతుంది. ఈ ఒప్పందం సుంకాలపై న్యాయమైన వాణిజ్యం, ఒంటరితనంపై భాగస్వామ్యం, దోపిడీపై సుస్థిరత..ఐరోపా వ్యూహంలో భాగమని ఉర్సులా తెలిపారు. తమ ఆర్థిక వ్యవస్థను సురక్షితంగా ఉంచుకోవడానికి, సరఫరా గొలుసులను వైవిధ్యపరచడానికి ఈయూ కట్టుబడి ఉందని, ఇందుకోసం ప్రపంచంలోని ప్రధాన వృద్ధి కేంద్రాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటున్నామని చెప్పుకొచ్చారు.

డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఔషధాలు, కీలక ముడి పదార్థాలపై ఒప్పందం

ఈ దావోస్ సదస్సు తర్వాత తాను భారత్ కు వెళతానని ఉ్సులా తెలిపారు. అక్కడే తమ ఒప్పందంపై తుది అడుగులు పడతాయి చెప్పారు. స్వచ్ఛమైన సాంకేతికతలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఔషధాలు, కీలక ముడి పదార్థాల వంటి వాటిపై ఈ ఒప్పందం జరగనుంది. ప్రస్తుతం ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్..ఈ శతాబ్దపు ఆర్థిక శక్తి కేంద్రాలలో ఒకటిగా ఉందని ఆమె ప్రశంసించారు. యూరప్ ఇలాంటి వాటితోనే ఒప్పందాలను కుదుర్చుకోవాలని చూస్తోందని చెప్పారు. ఐరోపా కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో లూయిస్ శాంటోస్ డా కోస్టా, ప్రెసిడెంట్ వాన్ డెర్ లేయెన్ ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు జనవరి 25 నుంచి 27 వరకు భారత్ పర్యటించనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Bilateral Agreements India EU agreement India EU trade deal India European Union relations International Diplomacy strategic partnership between India and EU Telugu News online Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.