📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

Tariff: ట్రంప్‌కు మోదీ ఫోన్ చేయలేదన్నపై భారత్ ఖండన

Author Icon By Vanipushpa
Updated: January 10, 2026 • 1:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు..భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేయకపోవడం వల్లే భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరలేదన్న అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ (Howard Lutnick) వ్యాఖ్యలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. లుట్నిక్ వ్యాఖ్యలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని.. రెండు దేశాల మధ్య జరిగిన చర్చల నిజ స్వరూపాన్ని అవి ప్రతిబింబించవని భారత్ స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలు వెలువడిన నేపథ్యంలో.. భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలపై మళ్లీ అంతర్జాతీయంగా చర్చ మొదలైంది. వాణిజ్య చర్చలు నిలిచిపోయిన తర్వాత, ఆగస్టులో Trump ప్రభుత్వం భారత వస్తువులపై 50 శాతం సుంకాలను విధించింది. ఈ సుంకాల్లో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు జరిమానా కూడా ఉండటం గమనార్హం.

Read Also: Venezuela US war : వెనిజువెలా వెనుక అసలు కథ ఏంటి? అమెరికాపై CPI(ML) తీవ్ర ఆరోపణలు

Tariff: ట్రంప్‌కు మోదీ ఫోన్ చేయలేదన్నపై భారత్ ఖండన

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు

అయితే ఈ సుంకాలు అమల్లోకి వచ్చినప్పటికీ, భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులు నవంబర్‌లో గత ఏడాదితో పోలిస్తే 22 శాతం కంటే ఎక్కువగా పెరగడం విశేషం. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. గత ఏడాది ఫిబ్రవరి 13 నాటికే భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభించేందుకు భారత్ పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని తెలిపారు. అప్పటి నుంచి ఇరుదేశాలు అనేక రౌండ్ల చర్చలు జరిపాయని.. అనేక సందర్భాల్లో ఒప్పందానికి చాలా దగ్గరగా కూడా వచ్చాయని ఆయన చెప్పారు. అయితే, కొన్ని కీలక అంశాలపై విభేదాలు కొనసాగడం వల్లే ఒప్పందం పూర్తికాలేదని ఆయన స్పష్టం చేశారు. అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ చేసిన వ్యాఖ్యల ప్రకారం, ఒప్పందం దాదాపు సిద్ధమై ఉండగా, మోడీ ట్రంప్‌కు ఫోన్ చేయకపోవడం వల్ల అది ముందుకు సాగలేదని ఆయన అన్నారు.

ద్వైపాక్షిక సంబంధాల్లో కొంత ఉద్రిక్తత

ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన అనేక అంశాలపై చర్చించారని గుర్తుచేసింది. కేవలం ఒక ఫోన్ కాల్ కారణంగా ఒప్పందం నిలిచిపోయిందన్న వాదన సరైనది కాదని భారత్ పేర్కొంది. భారత వ్యవసాయ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అమెరికా ఒత్తిడి చేస్తుండగా.. భారత ప్రభుత్వం దేశీయ రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ఆ ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ అంశంపై ఇప్పటికీ స్పష్టత రాకపోవడంతో ఒప్పందం ఆలస్యం అవుతోంది. ఇటీవలి కాలంలో ట్రంప్ భారతదేశంపై చేసిన వ్యాఖ్యలు ద్వైపాక్షిక సంబంధాల్లో కొంత ఉద్రిక్తతను తీసుకొచ్చాయి. ముఖ్యంగా రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో భారత్‌పై ఒత్తిడి పెంచడం, సుంకాల హెచ్చరికలు చేయడం గమనార్హం. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత భారత్ తన ఇంధన అవసరాల కోసం చౌకైన రష్యన్ చమురును కొనుగోలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

donald trump tariffs India denies phone call India US relations India US tariff issue Indian government statement Modi Trump News Telugu News online Telugu News Today Trade Tariffs

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.