📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Trade deal: చిలీతో భారత్ చేస్తున్న ఈ ‘ట్రేడ్ డీల్’ వెనుక ఉన్న వ్యూహం ఏమిటి?

Author Icon By Vanipushpa
Updated: February 18, 2026 • 12:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రస్తుతం ప్రపంచమంతా ప్రధాని మోదీ , అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య జరిగిన చర్చల గురించి, కుదిరిన ఒప్పందాల గురించి మాట్లాడుకుంటోంది. కానీ, భారతదేశం తన భవిష్యత్తు అవసరాల కోసం ఎవరికీ తెలియకుండా ఒక అతిపెద్ద వ్యూహాత్మక అడుగు వేసింది. మీడియా ఫోకస్ అంతా అమెరికాపై ఉన్న తరుణంలో, భారత్ మే 2025లో చిలీ (Chile) దేశంతో ‘కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్టనర్‌షిప్ అగ్రిమెంట్’ (CEPA) కోసం కీలక చర్చలు ప్రారంభించింది. ఈ డీల్ భారత్‌కు కేవలం వ్యాపార లాభాలను మాత్రమే కాదు, ‘వ్యూహాత్మక స్వతంత్రతను’ కూడా అందించబోతోంది. చిలీ ఎందుకు అంత కీలకం? ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు (EVs), స్మార్ట్‌ఫోన్లు , బ్యాటరీల తయారీకి అత్యంత కీలకమైన ఖనిజం ‘లిథియం’ (Lithium). ప్రపంచంలోని మొత్తం లిథియం నిల్వల్లో దాదాపు 30.8 శాతం ఒక్క చిలీ వద్దే ఉన్నాయి. అంటే దాదాపు 93 లక్షల మెట్రిక్ టన్నుల లిథియం ఆ దేశం సొంతం. కేవలం నిల్వలే కాదు, అక్కడి అటాకామా సాల్ట్ ఫ్లాట్స్‌లో లభించే లిథియం సాంద్రత అర్జెంటీనా కంటే 10 రెట్లు ఎక్కువ. ఆస్ట్రేలియాలో ఒక టన్ను లిథియం ఉత్పత్తికి $6,000 ఖర్చయితే, చిలీలో అది కేవలం $3,800 మాత్రమే.

Read Also: AmritBharat Train: అమృత్ భారత్ 3.0 రైళ్లు త్వరలో ప్రారంభం

Trade deal: చిలీతో భారత్ చేస్తున్న ఈ ‘ట్రేడ్ డీల్’ వెనుక ఉన్న వ్యూహం ఏమిటి?

అసలు ప్లాన్ ఇదేనా?

చైనా గుత్తాధిపత్యానికి చెక్! ప్రస్తుతం రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ (అరుదైన ఖనిజాలు) ఉత్పత్తిలో చైనాకు 90 శాతం పైగా వాటా ఉంది. డిఫెన్స్, స్పేస్ టెక్నాలజీ, సోలార్ ప్యానెల్స్ తయారీకి ఇవి ఎంతో అవసరం. చైనాపై ఉన్న ఈ ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి చిలీతో కుదుర్చుకుంటున్న ఈ ట్రేడ్ డీల్ (Trade deal) భారత్‌కు వరంగా మారనుంది. చిలీలో కేవలం లిథియం మాత్రమే కాదు, ప్రపంచంలోనే అత్యధికంగా 24 శాతం కాపర్ (రాగి) నిల్వలు ఉన్నాయి. అలాగే కోబాల్ట్, అయోడిన్ వంటి వ్యూహాత్మక ఖనిజాలు కూడా అక్కడ పుష్కలంగా లభిస్తున్నాయి. అదానీ గ్రూప్ , మైనింగ్ వేట ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి అదానీ గ్రూప్ వంటి భారతీయ సంస్థలు ఇప్పటికే చిలీలోని మైనింగ్ అవకాశాలను పరిశీలిస్తున్నాయి. జనవరి 2025లో చిలీ ప్రభుత్వం తన మైనింగ్ వ్యర్థాల నుంచి కోబాల్ట్ , రేర్ ఎర్త్ ఎలిమెంట్లను వెలికితీసేందుకు ఒక పెద్ద ప్రాజెక్టును చేపట్టింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Bilateral Trade Agreement Free trade agreement strategy India Chile relations India Chile trade deal India Latin America ties Indo-Pacific trade policy Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.