ప్రపంచంలో మనిషి అవసరాలకు కావాల్సిన వనరు లన్నీ ఒకే చోట కేంద్రీకృతం అయి లేవు. అవి ప్రపం చమంతటా విస్తరించి ఉన్నాయి. అందుకే ఏ దేశం అయిన తమకు కావాల్సిన వనరులని సమృద్ధిగా కలిగి లేదు. ఒక దేశం మరొక దేశంపై ఆధారపడవలిసిందే. మనిషి మర యంత్రం కనుగొన్న నుండి చమురు వాడకం మొదలై ప్రస్తుత ప్రపంచం మొత్తం చమురుపైనే ఆధారపడుతుంది. చమురు అమ్ముకొని కొన్ని దేశాలు అభివృద్ధి చెందితే చము రు వాడుకొని కొన్ని దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఎంత చమురు ఉత్పత్తి చేసినా, ఎంత చమురు వాడుకున్న అంత అభివృద్ధి చెందినట్టు లెక్క. అందుకే చమురుపై అధికార దాహం కాస్త యుద్ధాలకు (In battle)దారి తీస్తుంది. ప్రస్తుతం ప్రపంచం అంత అనిశ్చితిలో ఉంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఒకవైపు అయితే అమెరికా ఇజ్రయిల్ రెండు కలసి ఇరాన్పై యుద్ధం చేస్తున్నాయి. యుద్ధంలో పాల్గొనే దేశాల్లో రూపాయి రూపాయితో పేర్చి నిర్మించిన ఆర్థికవ్యవస్థ కుప్ప కూలుతుంది. దేశాలలో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. యుద్ధాల వల్ల మౌలిక సదుపాయాలకు అభివృద్ధికి ఉపయోగించే ప్రజల వేల కోట్ల రూపాయాలు బూడిదవుతున్నాయి. యుద్ధాల వల్ల అభివృద్ధికి సూచికలైన నిర్మాణాలు రక్షణ వ్యవస్థలు నిర్వీర్యమవుతున్నాయి. ప్రయోగించిన బాంబులు మిస్సైల్, డ్రోన్లు దేశ ఆర్థిక నిర్మాణాలను
బూడిద చేయడంతో పాటు పర్యవరణాన్ని నాశనం చేస్తున్నాయి. భావితరా లకు ఉపయోగ పడే శిలాజ ఇంధనాలు కాస్త యుద్ధంలో వృధాగా కాలిబూడిదవుతున్నాయి.
Read Also : Crude Oil Price: 100 డాలర్ల దిగువకు చేరిన బ్యారెల్!.. రష్యా ఆయిల్‌పై అమెరికా కీలక నిర్ణయం!
ఏ దేశంలోనైనా పిల్లలే ఆ దేశ భవిష్యత్తూ కానీ యుద్ధం పరిస్థితులు రేపటి తరాల భవిష్యత్తు అంధకారంలోకి నెడుతున్నాయి. యుద్ధ నియమా వళి ప్రకారం రక్షణ విభాగాలనే లక్ష్యంగా చేసుకోవాలి కానీ అది గురితప్పి జనవాసాలు లక్ష్యాలు అవుతున్నాయి. చము రు శుద్ధి కేంద్రాలు, విమానాశ్రయాలు, జలశుద్ధి కేంద్రాలు నాశనమవుతున్నాయి. పాఠశాలల మీద కూడా బాంబులు కురిపిస్తున్నారు. అమెరికా ఇజ్రాయిల్ దాడిలో అసువులు బాసిన ఇరాన్ లోని 160 మంది పిల్లల సామూహిక ఖననం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. పేదలతో పాటు ధనికులను కూడా పేదలను చేస్తుంది. యుద్ధంలో భాగంగా ఇంధన రాకపోకలకు ముఖ ద్వారం అయిన హారముజ్ జలసంధిని ఇరాన్ మూయడంతో ఇంధనరవాణా కష్టం అవుతుంది. యుద్ధానికి ముందు ఒక చమురుబ్యారెల్ ధర 70డాలర్లు ఉంటే అది క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం 100 డాలర్లు దాటీ 200 డాలర్ల వరకు చేరుకుంటుందని విశ్లేష స్తున్నారు. ప్రస్తుతం చమురు ఉత్పత్తిలో సింహ భాగ మైన గల్ఫ్ దేశాలు యుద్ధ ప్రభావంతో ఉన్నాయి. దీనితో ప్రపంచ దేశాలకు చమురు ఎగుమతి కష్టంగా మారుతుంది. చమురు దిగుమతి చేసుకునే కొన్నిదేశాలలో నిల్వలు రోజు రోజుకు అడుగంటుతున్నాయి. ఉత్పత్తి నుండి వినియోగదా రులకు అందే సప్లై చైన్సి స్టమ్ దెబ్బతింటుంది. చమురు ధరలు పెరిగితే, వస్తు ఉత్పత్తికి కావాల్సిన ముడి సరుకు సేకరణ నుండి దానిని వస్తువుగా మార్చి వినియోగదారుల కు చేరవేసే ప్రతి అంశంలో నిర్మాణ, రవాణా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. దీనితో ప్రతివస్తువు ధరలు పెరుగుతాయి. ఇది ప్రజలపై ఆర్థిక భారమని చెప్పాలి. చమురు కాకుండా ప్రపంచానికి కావాల్సిన మూడో వంతు యూరియా వ్యవ సాయ ఉత్పత్తులు మధ్య ప్రాచుర్యంనుండి ఉత్పత్తి రవాణా అవుతున్నాయి. యుద్ధం ఇంకా కొనసాగితే దీనిపై ప్రభావం పడనుంది. మన దేశ విషయానికొస్తే వినియోగించే చమురులో 85శాతం దిగుమతి మీదనే ఆధారపడుతుంది. అలాగే యుద్ధ ప్రభావం భారత ఎగుమతులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. దేశంలో దాదాపు పట్టణాల నుండి గ్రామాల వరకువంటకు గ్యాస్ మీదనే ఆధారపడి ఉన్నాయి. యుద్ధ ప్రభవంతో గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి.
తాజాగా మన దేశంలో గ్యాస్పై పరిమితులు విధించడం నిత్యావసర చట్టాన్ని గ్యాస్పై ప్రయోగించడం మొదలైంది. దేశంలో గ్యాస్ కంపెనీలు తమ ఉత్పత్తిని పెంచాలని కృత్రి మ కొరత సృష్టించోద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వాణిజ్య సిలిండర్ల కొరత ఏర్పడే అవకాశం ఉంది. యుద్ధ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. యుద్ధం రూపంలో (In battle)సాధారణ మనుషుల బ్రతుకులు చిద్రమవుతున్నాయి. ఏదీ ఏమైనా యుద్ధం సామాన్యుని నడ్డి విరుస్తుంది అనడంలో సందేహం లేదు. ఇది యుద్ధంలో పాల్గొనే దేశాలలో కాకుం డా ప్రపంచదేశాలను అన్నింటినీ ప్రభావితం చేస్తుంది. ప్రస్తు తం అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపనుంది. యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనకున్న యుద్ధ ప్రభావం మా త్రం ప్రపంచంలోని ప్రజలందరిపై పడుతుంది. పెరుగుతున్న చమురు ధరలకు తగినంతగా విదేశీ నిల్వలు లేక దేశాలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ తరుణో క్రమంగా వృద్ధి చెందుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించేలా ఉంది. అంతర్గత సమస్యలు ప్రకృతి విపత్తులను ఎదుర్కుంటూ దేశాలు ముందుకు సాగుతున్న వేళ ఈ రాజకీయ సంక్షోభం వల్ల ఏర్పడిన యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను వెనక్కి నెడుతుందని చెప్పాలి. రాజులకాలం నాటి దండయాత్రలు, దురాక్రమణల నుండి మనిషి ఆధునిక కాలంలో పరిపక్వత చెంది విజ్ఞతతో కూడిన మేలైన జీవనాన్ని సాగిస్తాడనుకుంటేఅధికార దాహం, స్వార్థం కాస్త మూర్ఖత్వం వైపు ప్రయా ణించేలా చేస్తుంది. భూమ్మీద అమ్మ నాన్నలు ప్రాణం పోస్తే మెరుగైన జీవనం, జీవించే హక్కు కల్పించాల్సిన దేశం ఆ ప్రాణాలను యుద్ధం రూపంలో సమాధి చేస్తుంది. ప్రపం చంలో చిన్న దేశాలకు అండగా నిలుస్తూ వాటి సార్వభౌమ త్వాన్ని కాపాడే అగ్ర రాజ్యలే ప్రపంచ శాంతిని పక్కనబెట్టి యుద్ధానికి కాలుదువ్వుతున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం దాని పరిణామాల దృష్ట్యా ప్రపంచ శాంతికి హక్కుల గురించి ఐక్యరాజ్య సమితి ఏర్పడింది కానీ ఇది యుద్ధ నష్టాలను లెక్కలేయడం, నష్టపోయిన దేశాలకు సహాయం అందించడానికే పరిమితంఅవుతుంది. యుద్ధం లో ఏ దేశం గెలుస్తుందో ఏమో కానీ యుద్ధం చాటున ప్రపంచ దేశాలు ఓడిపోతున్నయి అన్నది నిజం.
-బైరబోయిన వెంకటేశ్వర్లు
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: