📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

USA: ట్రంప్ మెడపై అభిశంసన కత్తి?

Author Icon By Vanipushpa
Updated: January 7, 2026 • 4:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) కు పదవీ భయం పట్టుకుంది. ఈ ఏడాది నవంబర్ లో జరిగే మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ గెలవకపోతే తాను అభిశంసనకు గురి అవుతానని భావిస్తోన్నారు. ఇదే విషయాన్ని రిపబ్లికన్లతో నిర్వహించిన సమావేశంలోనూ స్పష్టం చేశారు. మిడ్ టర్మ్ ఎన్నికల్లో గెలవకపోతే తన అభిశంసన తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు. హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్, యూఎస్ కాంగ్రెస్ కు జరిగే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మెజారిటీ స్థానాలను దక్కించుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. వాషింగ్టన్‌లో జరిగిన హౌస్ రిపబ్లికన్ ఎంపీల రిట్రీట్ కార్యక్రమంలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. నవంబర్ లో జరగబోయే మధ్యంతర ఎన్నికల్లో తప్పక గెలవాలని, అలా జరక్కపోతే డెమోక్రాట్లు ఏదో ఒక కారణాన్ని వెదికి తనను అభిశంసిస్తారని తేల్చి చెప్పారు. యూస్ కాంగ్రెస్‌పై రిపబ్లికన్ల పట్టు బలహీనపడకూడదని, ఈ అవకాశం కోసమే డెమోక్రాట్లు ఎదురు చూస్తోన్నారని పేర్కొన్నారు. మిడ్ టర్మ్ ఎన్నికల్లో గెలవకపోతే కొన్ని అజెండాలు అర్ధాంతరంగా నిలిచిపోయే ప్రమాదం ఉందని చెప్పారు.

Read Also: Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్

USA: ట్రంప్ మెడపై అభిశంసన కత్తి?

హౌస్ లో రిపబ్లికన్లకు ఉన్న మెజారిటీ స్వల్పమే

డెమోక్రాట్లకు కాంగ్రెస్‌లో ఆధిక్యం దక్కితే, తనను అభిశంసన ప్రక్రియను ప్రారంభించే అధికారం వారికి లభిస్తుందని కుండబద్దలు కొట్టారు ట్రంప్. ఈ నవంబర్ లో యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో మొత్తం 435 సీట్లకు, సెనేట్‌లో 100లో మూడింట ఒక వంతు సీట్లకు వచ్చే నవంబర్ లో పోలింగ్ జరగనుంది. హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్, కాంగ్రెస్ పై పట్టు నిలుపుకోవడం పార్టీకి అత్యంత ముఖ్యమని ట్రంప్ స్పష్టం చేశారు. ప్రస్తుతం- హౌస్ లో రిపబ్లికన్లకు ఉన్న మెజారిటీ స్వల్పమే. అమెరికా చట్టం ప్రకారం దేశద్రోహం, లంచం, లేదా ఇతర తీవ్రమైన నేరాలు, దుష్ప్రవర్తన వంటి ఆరోపణలపై అధ్యక్షుడిని అభిశంసించే సర్వాధికారాలు హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ కు ఉంది. మూడింట రెండు వంతుల ఓట్లతో ఆయన్ను దోషిగా నిర్ధారించి, పదవి నుంచి తొలగించవచ్చు. నవంబర్‌లో ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలు, సెనేట్‌లోని 33 స్థానాలకు పోలింగ్ జరగనుంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

American Government Donald Trump Impeachment Political Crisis Telugu News Paper Telugu News Today Trump controversy US Politics White House News world politics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.