📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

America: IEEPA చట్టం అంటే ఏమిటి?..ట్రంప్ సర్కారు రూ. 26 లక్షల కోట్లు ఆదాయం

Author Icon By Vanipushpa
Updated: February 21, 2026 • 3:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రాగానే ప్రపంచ దేశాలపై సుంకాల బాదుడు మొదలు పెట్టిన సంగతి విదితమే. అమెరికా ఫస్ట్ పేరుతో ట్రంప్ సాగించిన ఆర్థిక విధానాలు అగ్రరాజ్యం యుఎస్ ముఖ చిత్రాన్నే మార్చివేశాయి. పొరుగు దేశాల నుంచి వచ్చే వస్తువులపై విధించిన సుంకాలతో గత ఏడాది అమెరికా ఖజానాకు దాదాపు 287 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 26 లక్షల కోట్లు) అదనపు ఆదాయం వచ్చిందని నివేదికలు చెబుతున్నాయి. అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA)ను ఆధారంగా చేసుకుని 2024 ఏప్రిల్‌లో భారత్ సహా పలు దేశాలపై సగటున 17 శాతం వరకు సుంకాలు విధించడంతో అమెరికాకు రాబడి విపరీతంగా పెరిగింది. 1932 తర్వాత అమెరికా చరిత్రలో ఇవే అత్యంత కఠినమైన పన్ను విధానాలని ఆర్థిక నిపుణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే IEEPA (International Emergency Economic Powers Act) ఆధారంగా ట్రంప్ తీసుకున్న సుంకాలకు అమెరికా అత్యున్నత న్యాయస్థానం బ్రేక్ వేసింది. ఈ నేపథ్యంలో అసలు IEEPA అంటే ఏమిటి అనే అంశం తెరమీదకు వచ్చింది.

Read Also: Supreme Shock to Trump : ట్రంప్ కు షాక్..వసూలుచేసిన సుంకాలను తిరిగి చెల్లించాలని సుప్రీం ఆదేశం

America: What is IEEPA Act?..Trump government Rs. 26 lakh crore revenue

EEPA ఆధారంగా వసూలు చేసిన సుంకాలు చెల్లవు

ఈ సుంకాలు చట్టబద్ధం కావని స్పష్టం చేస్తూ శుక్రవారం వెలువరించిన తీర్పు.. అమెరికా అధ్యక్ష అధికారాలపై కీలకమైన పరిమితులను మరోసారి గుర్తు చేసింది. ఈ నిర్ణయం ట్రంప్ వాణిజ్య విధానాలకు మాత్రమే కాకుండా.. భవిష్యత్తులో ఏ అధ్యక్షుడైనా అత్యవసర చట్టాలను ఎలా ఉపయోగించాలి అన్న అంశంపై ప్రశ్నలకు తెరలేపింది. ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ తీర్పు వెలువరించిన సందర్భంగా.. IEEPA (International Emergency Economic Powers Act) చట్టంలో సుంకాలు లేదా దిగుమతి పన్నుల గురించి ఎక్కడా స్పష్టమైన ప్రస్తావన లేదని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో విదేశీ ఆస్తులను స్తంభింపజేయడం.. ఆర్థిక లావాదేవీలను నియంత్రించడం వంటి అధికారాలు మాత్రమే ఈ చట్టం ఇస్తుందని, కానీ సాధారణ వాణిజ్య విధానాల కోసం లేదా ఆదాయం సమకూర్చే పన్నుల విధింపునకు దీనిని ఉపయోగించలేమని సుప్రీంకోర్టు తేల్చింది. దీంతో ట్రంప్ ప్రభుత్వం IEEPA ఆధారంగా వసూలు చేసిన సుంకాలు చెల్లవంటూ తీర్పు వెలువరించింది.

నీల్ కత్యాల్..కేసు ఎలా వాదించాడు..

ట్రంప్ సుంకాలకు చెక్ పెట్టిన భారత సంతతి లాయర్.. ఎవరీ నీల్ కత్యాల్.. కేసు ఎలా వాదించాడు.. IEEPA అంటే ఏమిటి: ఇది 1977లో అమలులోకి వచ్చిన ఒక అమెరికా సమాఖ్య చట్టం. విదేశాల నుంచి వచ్చే అసాధారణమైన ముప్పుల సమయంలో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన తరువాత అధ్యక్షుడికి కొన్ని ప్రత్యేక ఆర్థిక అధికారాలు ఇవ్వడమే దీని లక్ష్యమని చెప్పవచ్చు. 39వ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ఈ చట్టానికి సంతకం చేశారు. గతంలో అధ్యక్షులు అత్యవసర అధికారాలను అతిగా వినియోగిస్తున్నారన్న విమర్శల నేపథ్యంలో.. వాటికి స్పష్టమైన హద్దులు విధించేందుకే ఈ చట్టాన్ని రూపొందించారు. చరిత్రలో IEEPAని ఎక్కువగా ఆంక్షలు విధించడానికి, విదేశీ ఆస్తులను ఫ్రీజ్ చేయడానికి, అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలను నియంత్రించడానికి మాత్రమే వాడారు. ఇది సంప్రదాయ సుంకాల సాధనంగా రూపకల్పన కాలేదు. స్తు దర్యాప్తు అవసరం. కానీ IEEPA అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక నియంత్రణ కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Donald Trump economic policies Federal Law IEEPA Act International Emergency Economic Powers Act Latest News in Telugu Telugu News Paper Trade Sanctions US Government Revenue

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.