📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Heart Health : గుండె సేఫ్‌గా ఉండాలంటే ఈ పండ్ల‌ను రోజూ తినాలి..

Author Icon By Sudha
Updated: February 25, 2026 • 3:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

శ‌రీరంలో ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో గుండె ఒక‌టి. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవ‌డం చాలా అవ‌స‌రం. కానీ ప్ర‌స్తుత కాలంలో చాలా మంది గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. గుండెపోటు, స్ట్రోక్ ల కార‌ణంగా ప్రాణాల‌ను కోల్పోతున్నారు. క‌నుక గుండె ఆరోగ్యాన్ని (Heart Health) ప‌రిర‌క్షించుకోవ‌డం చాలా అవ‌స‌రం. గుండె ఆరోగ్యాన్ని (Heart Health)కాపాడ‌డంలో ముఖ్యంగా ఆహారం కీల‌క పాత్ర పోషిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబ‌ర్, విట‌మిన్లతో నిండిన ఆహారాన్ని తీసుకోవడం వ‌ల్ల గుండె జ‌బ్బుల ప్ర‌మాదాన్ని గ‌ణ‌నీయంగా త‌గ్గించ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి పోష‌కాలన్ని క‌లిగి ఉన్న ఆహారాల్లో పండ్లు కూడా ఒక‌టి. పండ్ల‌ను తీసుకోవ‌డం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌చ్చు.

Read Also : Public Health: పాలూ, తాగునీరు కల్తీ.. ప్రజారోగ్యంపై పెరుగుతున్న ముప్పు

Heart Health

బెర్రీ జాతికి చెందిన పండ్లు

గుండె ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో బెర్రీ జాతికి చెందిన పండ్లు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, రాస్ప్రెర్రీ వంటి పండ్లు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి ఆంథోసైనిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్ల‌తో నిండి ఉంటాయి. ఇవి ఆక్సీక‌ర‌ణ ఒత్తిడిని త‌గ్గించి గుండె ప్ర‌మాదాల‌ను త‌గ్గించ‌డంలో దోహ‌ద‌ప‌డ‌తాయి. ఈ పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల చెడు కొలెస్ట్రాల్ త‌గ్గ‌డంతో పాటు మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. స్మూతీ, పెరుగు, ఓట్ మీల్ వంటి వాటితో ఈ పండ్ల‌ను క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ఆపిల్ పండ్లు కూడా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో పెక్టిన్ అనే క‌రిగే ఫైబ‌ర్ ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిల‌ను త‌గ్గించ‌డంలో ఈ ఫైబ‌ర్ స‌హాయ‌ప‌డుతుంది. ఆపిల్స్ పాలీఫినాల్స్ ను కూడా క‌లిగి ఉంటాయి. ఇవి ర‌క్త‌పోటును త‌గ్గించే ప్ర‌భావాల‌ను క‌లిగి ఉంటాయి. ఆపిల్ ను తొక్క‌తో స‌హా క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం మ‌రిన్ని ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

అవ‌కాడో

అవ‌కాడోలు మోనోశాచురేటెడ్ కొవ్వుల‌ను క‌లిగి ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో అవ‌స‌రం. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల చెడు కొలెస్ట్రాల్ త‌గ్గ‌డంతో పాటు గుండె జ‌బ్బుల ప్ర‌మాదం కూడా త‌గ్గుతుంది. అవ‌కాడోలను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌పోటు నియంత్ర‌ణ‌లో ఉంటుంది. హోల్ గ్రెయిన్ టోస్ట్ ల‌తో, స‌లాడ్స్, స్మూతీ వంటి వాటితో అవ‌కాడోల‌ను క‌లిపి తీసుకోవ‌చ్చు. నారింజ పండ్లు గుండె ఆరోగ్యానికి ఎంత‌గానో తోడ్ప‌డ‌తాయి. వీటిలో విట‌మిన్ సి, ఫైబ‌ర్, పొటాషియం వంటి పోష‌కాలు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని, ర‌క్త‌నాళాల ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, ధ‌మ‌నుల ధృడ‌త్వాన్ని త‌గ్గించ‌డంలో ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. తాజా నారింజ పండ్ల ర‌సాన్ని తీసుకోవ‌డం లేదా నారింజ పండ్ల‌ను నేరుగా న‌మిలి తిన‌డం వంటివి చేయ‌డం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌రుచుకోవ‌చ్చు.

Heart Health

దానిమ్మతో కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి

ఇక దానిమ్మ పండ్లు కూడా గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో ఎంతో దోహ‌ద‌ప‌డ‌తాయి. దానిమ్మ పండ్ల‌ల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ప్యూనికాలాజిన్లు ఉంటాయి. ఇవి ధ‌మ‌నుల్లో అడ్డంకులు ఏర్ప‌డ‌కుండా కాపాడ‌డంలో, ర‌క్త‌ప్ర‌వాహాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. స‌లాడ్లు లేదా పెరుగు మీద దానిమ్మ గింజ‌ల‌ను చ‌ల్లి తీసుకోవ‌డం ద్వారా, స్వ‌చ్ఛ‌మైన దానిమ్మ పండ్ల ర‌సాన్ని తీసుకోవ‌డం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌రుచుకోవ‌చ్చు. ఈ విధ‌మైన పండ్ల‌ను రోజూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. ర‌క్త‌పోటు అదుపులో ఉంటుంది. త‌ద్వారా గుండె ఆరోగ్యాన్ని గ‌ణ‌నీయంగా పెంచుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News Cardio Health fruits for heart Healthy Fruits heart health latest news Natural Heart Care Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.