Tejas: తేజస్ ఫైటర్ జెట్లను భారత్​ పక్కన పెట్టిందా?

Read Time:  1 min
తేజస్ ఫైటర్ జెట్లను భారత్​ పక్కన పెట్టిందా?
తేజస్ ఫైటర్ జెట్లను భారత్​ పక్కన పెట్టిందా?
FONT SIZE
GET APP

స్వదేశీ యుద్ధవిమానం తేజస్‌(Tejas) మళ్లీ ప్రమాద వార్తల్లో నిలిచింది. ఫిబ్రవరి 7వ తేదీన సరిహద్దు ప్రాంతానికి సమీపంలోని వాయుసేన ఎయిర్‌బేస్‌లో ల్యాండింగ్ సమయంలో తేజస్‌ ఫైటర్ జెట్ రన్‌వేను దాటి వెళ్లడంతో విమానం నిర్మాణ భాగాలకు నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఆ ఘటనలో పైలట్ ముందస్తు జాగ్రత్త పడడంతో సురక్షితంగా బయటపడ్డాడు. బ్రేక్ వ్యవస్థలో లోపం కారణంగానే ఆ ప్రమాదం జరిగి ఉండొచ్చని వర్గాలు చెబుతున్నాయి. ఆ ఘటనపై అధికారిక ప్రకటన విడుదల చేయకపోయినా, భారత వాయుసేన ముందు జాగ్రత్త చర్యగా తమ వద్ద ఉన్న దాదాపు 30 సింగిల్‌సీట్ తేజస్ విమానాలను తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ప్రతి విమానాన్ని సాంకేతికంగా పూర్తిగా తనిఖీ చేసి భద్రతా ప్రమాణాలు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Israeli Attack on Lebanon : లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి.. 10 మంది మృతి

 Tejas: Has India shelved the Tejas fighter jets?
Tejas: Has India shelved the Tejas fighter jets?

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసిన ఎల్‌సీఏ తేజస్‌ ఒక సింగిల్ ఇంజిన్, మల్టీ రోల్ ఫైటర్ జెట్. దీన్ని ఏరానాటికల్ డెవలప్​మెంట్​ ఏజన్సీ అభివృద్ధి చేసింది. గగనతల రక్షణ, సముద్ర పర్యవేక్షణ, కచ్చితమైన దాడులు వంటి అనేక మిషన్లకు అనువుగా ఆ విమానాన్ని రూపొందించారు. 2003లో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్​పేయూ దీనికి తేజస్ అనే పేరు పెట్టారు. సంస్కృతంలో తేజస్ అంటే కాంతి, శక్తి అనే అర్థం. తేజస్ విమానాలు 2016 నుంచి వాయుసేనలో సేవలు అందిస్తున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.