📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

H1B Visa: హెచ్-1బీ వీసాలకు భారీగా పెరుగుతున్న డిమాండ్

Author Icon By Vanipushpa
Updated: February 10, 2026 • 12:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇమ్మిగ్రేషన్ విధానాల్లో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా విదేశీయులు అమెరికాలో పనిచేయడానికి అవసరమైన హెచ్-1బీ వీసా నిబంధనలను ట్రంప్ ప్రభుత్వం కఠినతరం చేసింది. దీంతో వీసా మీద అమెరికా వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. అయితే ప్రస్తుతం హెచ్ 1బీ వీసా(H1B Visa)లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. ట్రంప్ ప్రభుత్వం వలసలపై ఉక్కుపాదం మోపుతూ.. గతేడాది హెచ్-1బీ వీసా ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచింది. దీనికి తోడు వీసా స్టాంపింగ్, రెన్యువల్ ప్రక్రియలో కొత్త నిబంధనలను ప్రవేశపెట్టారు. దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించడం వంటివి కూడా ఇబ్బందికరంగా మారాయి.

Read Also: Global Business: టాప్ 10 గ్లోబల్ రెవెన్యూ కంపెనీలు వెల్లడి

H1B Visa: హెచ్-1బీ వీసాలకు భారీగా పెరుగుతున్న డిమాండ్

కృత్రిమ మేధ రంగం భారీగా అభివృద్ధి

విదేశీయుల నియామకాలను తగ్గించి, అమెరికన్లకే ఉద్యోగాలు దక్కాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయాలు ట్రంప్ ప్రభుత్వం తీసుకుంది. అయితే ప్రస్తుతం కృత్రిమ మేధ రంగం భారీగా అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా పోటీ నెలకొంది. అమెజాన్, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి సంస్థలు గతేడాది ఏఐపై సుమారు 380 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. ఈ భారీ లక్ష్యాలను చేరుకోవడానికి కావాల్సిన నైపుణ్యం ఉన్న నిపుణులు అమెరికాలో తక్కువగా ఉన్నారు. దీంతో లక్ష డాలర్ల వీసా ఫీజు భరించడానికి కూడా వెనుకాడకుండా కంపెనీలు విదేశీయులను తీసుకోవడానికి ముందడుగు వేస్తోంది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఐటీ కంపెనీలు సమర్పించిన లేబర్‌ కండీషన్స్‌ అప్లికేషన్లలో 80 శాతానికి పైగా ఏఐ విభాగంలో నియామకాలకు సంబంధించినవే ఉన్నాయి.

ఇండియన్స్‌కు భారీగా డిమాండ్

అమెరికా యూనివర్సిటీల్లో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న విద్యార్థుల్లో 80 శాతం మంది విదేశీయులే. అమెరికన్ విద్యార్థుల్లో ఏఐ వంటి అత్యాధునిక టెక్నాలజీపై పట్టు లేకపోవడం టెక్ కంపెనీలకు పెద్ద సమస్యగా మారింది. దీంతో విదేశీయులకు ముఖ్యంగా ఇండియన్స్‌కు భారీగా డిమాండ్ పెరుగుతోంది. అమెరికాలోని టెక్ కంపెనీలు సాఫ్ట్‌వేర్ డెవలపర్స్, డేటా సైంటిస్టులు, ఇన్ఫర్మేషన్ రిసెర్చ్ విభాగాల్లో విదేశీ నిపుణులకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాయి. అమెరికాలో ఉన్నత విద్య పూర్తి చేసిన భారతీయులు మొదట ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కింద పని చేస్తారు

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

H1B visa demand Immigration News Indian IT professionals Indian professionals abroad tech workforce migration Telugu News online Telugu News Paper US employment visas US work visas

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.