అమెరికాలో ఉంటున్న భారతీయ ఐటీ నిపుణులకు బిగ్ షాక్ తగిలింది. హెచ్1బీ వీసా కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కోరుతూ ఫ్లోరిడాకు చెందిన రిపబ్లికన్ ప్రతినిధి గ్రెగ్ స్టూబ్.. ప్రతినిధుల సభలో బిల్లను ప్రవేశపెట్టారు. . ‘ఎండింగ్ ఎక్స్‌ప్లాయిటేటివ్ ఇంపోర్టెడ్ లేబర్ ఎగ్జెంప్షన్స్ యాక్ట్’ పేరుతో ఈ బిల్లును తీసుకొచ్చారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాల్లో సవరణలు చేసి H1బీ వీసా (H-1B visa) విధానాన్ని తొలగించడమే ఈ బిల్లు ఉద్దేశం. అమెరికా పౌరుల ప్రయోజనం, సంక్షేమం కన్నా విదేశీ కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వడం అమెరికా ప్రయోజనాలకు విరుద్ధమని గ్రెగ్ స్టూబ్ వాదనలు వినిపిస్తున్నారు.
Read Also: Corruption : భారత్ లో తగ్గిన అవినీతి
లక్షలాది మంది భారతీయులు వెనక్కి రావాల్సిన పరిస్థితి
కార్పొరేట్ సంస్థలు తక్కువ జీతాలకు వీదేశీయ కార్మికులను తెచ్చుకొని అమెరికా యువతకు రావాల్సిన ఉద్యోగాలు రాకుండా చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. అమెరికా ప్రజల కోసం అమెరికన్ డ్రీమ్‌ను కాపాడేందుకు ఈ దోపిడీని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అందుకే ఈ బిల్లును ప్రతిపాదిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకవేళ ఈ బిల్లు చట్టంగా మారినట్లయితే అమెరికాలో సెటిల్ అవ్వాలనుకునే లక్షలాది మంది భారతీయులు వెనక్కి రావాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. మరోవైపు H1బీ వీసా తీసుకుంటున్న వాళ్లలో 80 శాతానికి పైగా భారతీయులు, చైనీయులే ఉన్నారు. ఇటీవల ట్రంప్ ప్రభుత్వం ఈ వీసాకు సంబంధించిన రూల్స్‌ను కఠినతరం చేసిన సంగతి తెలిసిందే. కొత్త వీసాలపై లక్ష డాలర్ల భారీ రుసుమును విధించింది. అలాగే లాటరీ విధానానికి బదులుగా ఎక్కువ వేతనం ఉండే ఉద్యోగులకే వీసా అందించనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: