📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Guntur POCSO Case: పొక్సో కేసులో నిందితుడికి 20 యేళ్ల జైలుశిక్ష

Author Icon By Rajitha
Updated: February 25, 2026 • 11:58 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గుంటూరు : మైనర్ బాలికను మోసగించి అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, జరిమానా విధిస్తూ గుంటూరు పోక్సో (pocso) న్యాయస్థానం తీర్పు చెప్పింది. వివరాల్లోకి వెళితే 2021వ సంవత్సరంలో గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం, పోలకంపాడు గ్రామానికి చెందిన బాధితురాలు బిటెక్ మొదటి సంవత్సరం చదువుతుంది. ఈ క్రమంలో ఆమెకు దగ్గర నివాసి, అదే పోలకంపాడు గ్రామానికి చెందిన ఆరోగ్యస్వామి అజయ్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో వేధించడంతో పాటు బలవంతంగా ఆమె మెడలో తాళి కట్టాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

Read also: Delhi School Bomb Threat: ఢిల్లీ స్కూళ్లకు బాంబు బెదిరింపులు

Guntur POCSO Case

జరిగిన విషయాన్ని ఆమె తన కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు గుంటూరు మహిళా పోలీస్టేషన్ లో బాలికపై లైంగిక దాడి, బాల్య వివాహానికి సంబంధించి కేసు నమొదయ్యింది. అప్పటి మహిళ పోలీస్ స్టేషన్ డిఎస్పీ రవికుమార్ కేసు దర్యాప్తు చేసి ఆధారాలను న్యాయస్థానానికి నివేదించారు. ప్రభుత్వ న్యాయవాది టి.దుర్గా ప్రసాద్ ప్రాసి క్యూషన్ తరపున వాదనలు వినిపించారు. కేసు పూర్వపరాలను పరిశీలించిన న్యాయమూర్తి మహమ్మద్ పర్వీన్ సుల్తానా బేగం నిందితుడిని దోషిగా తేల్చి శిక్షలు ఖరారు చేశారు. మహిళలు, చిన్నారుల రక్షణ, భద్రతకు గుంటూరు జిల్లా పోలీస్ శాఖ విశేష కృషి చేస్తుందని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి తమపై జరిగిన, జరుగుతున్న నేరాల గురించి పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

andhra pradesh crime Court Judgement Guntur crime Minor girl case POCSO Act 2012

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.