📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Gulf: గల్ఫ్ విమానాల రాకపోకలతో ఊపిరిపీల్చుకుంటున్న ప్రయాణికులు

Author Icon By Vanipushpa
Updated: March 3, 2026 • 4:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గత మూడురోజులుగా ప్రపంచాన్ని వణికిస్తున్న ఇరాన్-అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తీవ్ర భయాందోళనతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని అయోమయస్థితిలో జీవిస్తున్నారు. ప్రత్యేకంగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతితో తీవ్ర ప్రతీకారజ్వాలలతో రగిలిపోతున్న ఆదేశం గల్ఫ్(Gulf) దేశాల ఎయిర్పోర్టులను ప్రధాన లక్ష్యంగా చేసుకుని, చేసిన మిసేల్స్ దాడితో ఎక్కడి విమానాలు అక్కడే ఆగిపోయాయి. దుబాయ్, అబుదాబ, మస్కట్ విమానాశ్రయాలను ఇరాన్ టార్గెట్ చేసుకుని చేసిన దాడులతో ఆ దేశాలు విమాన సర్వీసులన్నీ రద్దు చేశాయి. ప్రయాణికుల భద్రత, దేశ సంక్షేమంతో ఈ నిర్ణయాలను తీసుకున్నట్లు ఆదేశాధినేతలు మీడియాకు వెల్లడించడం మనకు విధితమే. విమాన రద్దుతో ప్రయాణికులు గల్ఫ్ దేశాల్లో చిక్కుకునిపోయారు. తాజాగా గల్ఫ్ దేశాలు ఈ మధ్యాహ్నం నుంచి విమాన రాకపోకలను పునరుద్ధరించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Read Also: Indian Sailors: ఇరాన్ దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి

Passengers gasp for air traffic from Gulf airlines

ఢిల్లీకి చేరిన తొలి విమానం

దుబాయ్ నుంచి మంగళవారం మధ్యాహ్నం 149మంది ప్రయాణీకులతో తొలివిమానం ఢిల్లీకి చేరుకుంది. అలాగే అబుదాబి, మస్కట్ నుంచి భారత్ కు విమానాల రాకపోకలు కొనసాగుతున్నాయి. జెడ్డా నుంచి భారత్ కు 10విమానాలను ఇండిగో నడుపతున్నట్లు తెలిపింది. అలాగే ఒమనన కు ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానాల సర్వీసులు కొనసాగుతున్నట్లు సం
బంధింత అధికారులు ప్రకటించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

air tickets price drop Gulf flight updates 2026 India-UAE flight news international flight resumption Middle East travel relief Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.