నీటిని నీలి బంగారం అంటారు. వాస్తవంగా చెప్పా లంటే అసలు బంగారం కన్నా నీలిబంగారమే అత్యంత విలువైనది. గొంతు తడారిపోతున్న వ్యక్తికి కావాల్సింది గుక్కెడు నీళ్లే తప్ప బండెడు బంగారం కాదు. దురదృష్టం ఏమిటంటే ప్రధానంగా దేశంలో మంచినీరు గగనమైపోతున్నది. గత దశాబ్దకాలం గా వానలు సమృద్ధిగా కురుస్తున్నా కొన్ని చోట్ల కుంభ వృష్టి వానలకు, వరదలకు పొంగిపొరులుతున్నా వేసవి వచ్చేసరికి నీటి కష్టాలు ఇబ్బడిముబ్బడిగా ఏర్పడుతున్నా యి. మార్చి మొదట్లోనే తెలుగు రాష్ట్రాల్లో నీటి కష్టాలు ఆరంభమయ్యాయి. భూగర్భజల (Groundwater)మట్టాలు దిగజారిపోతు న్నాయి. యేటేటా భూగర్భజలాల వినియోగం పెరిగిపో తుందనేందుకు ఊహించని రీతిలో కొత్తగా తవ్వుతున్న బోరుబావులను ఉదహరించవచ్చు. భూగర్భజలాల వాడ కం ఎనభైశాతానికి పైగా వ్యవసాయానికి, పదిహేను శాతం పరిశ్రమలకు, తాగునీటి అవసరాలు తీర్చుకోవడానికి విని యోగించుకుంటున్నారు. వినియోగం నానాటికీ పెరిగిపో తున్నా ఆ మేరకు భూగర్భజలాల పెంపునకు గట్టి ప్రయ త్నాలు జరగడం లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా భూగర్భజలాల (Groundwater) వినియోగం అంతకంతకు పెరి గిపోతున్నది. మరొకపక్క గోదావరి, కృష్ణా, గంగా, కావేరి యమునా లాంటి జీవ నదుల నుండి కోట్లాది ఎకరాలకు సరిపడే నీరు నిరుపయోగంగా సముద్రంపాలవుతున్నది. ప్రపంచంలో ఎక్కడలేని విధంగా యేటా దాదాపు మూడు వందల ఘనపు కిలోమీటర్లు మేర భూగర్భజలాలు దేశం లో వినియోగించుకుంటున్నట్లు అంచనా. భారతదేశంలో ఆరువేల ఐదువందల డెబ్భైరెండు భూగర్భజలాలు బ్లాక్లు ఉండగా వాటిలో మూడోవంతు బ్లాకుల్లో అవసరానికి మించి భూగర్భజలాలు దోడేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మిగిలిన బ్లాకుల పరిధిలోకి చేరుకొని భూగర్భ జలాలు మరింతగా అడుగంటిపోతాయి.
Read Also : Iran War: హోర్ముజ్ జలసంధిలో 22 భారత నౌకలు
దేశంలో బోరు బావుల సంఖ్య గత అరవైయేళ్లలో దాదాపు నూటయాభై రెట్లకుపైగా పెరిగింది. ఇంకా పెరుగుతూనే ఉన్నది. యేటా వేలాది బోరుబావులు కొత్తగా తవ్వుతున్నారు. ఇందువల్ల సన్నకారు, చిన్నకారు రైతులు లాభపడిన మాట వాస్త వమే. కానీ నీటిసంరక్షణ పద్ధతులు పాటించకుండానానా టికీ బోరుబావులు అధికంగా ఆధారపడే పరిస్థితి అనేక అనర్థాలకు దారితీస్తున్నదని భూగర్భనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూగర్భజలాలను వృథా చేయడం కూడా పెద్దఎత్తునే జరుగుతున్నది. ఇదే పరిస్థితికొనసాగితే మరో రెండు దశాబ్దాల్లో దేశవనరుల్లో అరవైశాతానికిపైగా హరించుకుపోతాయని ప్రపంచబ్యాంకే గతంలో హెచ్చరిం చింది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, తదితర రాష్ట్రాల్లో యేటా నలభైలక్షల కోట్ల లీటర్ల మేర భూగర్భజలాలు తోడేస్తుండడంతో సముద్ర మట్టాల్లో దాదాపు ఐదు శాతం పెరుగుదల నమోదైందని గతంలో జరిపిన ఒక అధ్యయనంలో వెలుగుచూసింది. ఇంకొకపక్క దేశంలో అధికశాతం జిల్లాల్లో భూగర్భ జలా లు తాగుయోగ్యమైనవి కావని కేంద్రమే గతంలో అంగీక రించింది. పార్లమెంట్లో నే గతంలో ఒక ప్రశ్నకు సమా ధానం చెబుతూ అందించిన వివరాల ప్రకారం రెండువం దల యాభైనాలుగు జిల్లాల్లో భూగర్భజలాల్లో ఇనుము, 224 జిల్లాల్లో ఫ్లోరైడ్, 162 జిల్లాల్లో క్షరాత 34 జిల్లా ల్లో పాషాణం స్థాయి అధికంగా ఉన్నదని వెలుగు చూ సింది. రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో మరింత తీవ్రంగా ఉంది. ప్రధానంగా పాషాణం లాంటి లోహాలను తొలగించడం కష్టంగా మారుతుందని అధికార వర్గాలే అంగీకరిస్తున్నాయి. ఉచిత విద్యుత్ సరఫరా కూడా బోరు బావుల సంఖ్య పెరగడానికి కారణమవుతున్నది. చట్టాలు, నిబంధనలు ఎన్ని ఉన్నా అంతగా అమలు కాకపోవడం మరో కారణంగా చెప్పవచ్చు. కొన్ని పరిశ్రమలు ప్రధానం గా శీతలపానియాలు, మద్యం తయారీ కంపెనీలు భారీ స్థాయిలో భూగర్భజలాలను వినియోగించుకుంటున్నాయి.
ఇంకొకపక్క దేశవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో వాడకం పెరు గుతున్నది. అదే స్థాయిలో వృధాకూడా అదుపు లేకుండా పోతున్నది. పాలకుల్లో చిత్తశుద్ధి, ప్రజల్లో అవగాహన లోపం కారణంగా భూగర్భజలాల సమస్య రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తుందనే విమర్శలను కొట్టివేయలేం. మంచి నీటి కొరతను ముందుగానే గ్రహించి దాన్నిసొమ్ము చేసుకునేందుకు మొదలు పెట్టిన నీటి వ్యాపారం ఇప్పుడు నగరాలు, పట్టణాలు దాటి శివారు పల్లెలకు కూడా చేరు కున్నది. దేశంలో కోట్లాది రూపాయల నీటి వ్యాపారం జరుగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం గతంలో మిషన్ కాకతీయ కార్యక్రమంద్వారా చెరువులు, కుంటల్లో పూడికలు తీయించి మరమ్మత్తులు చేయించడంతో ఆయా ప్రాంతా ల్లో భూగర్భజలాలు కొంతమేరకు పెరిగాయని చెప్పొచ్చు. కానీ వాడుతున్న భూగర్భజలాల మట్టాలను భర్తీ చేయ లేకపోతున్నాం. అందుకే వేసవిలో తెలుగు రాష్ట్రాల్లో కూడా భూగర్భజలాల మట్టాలు గణనీయంగా పెరిగిపోతు న్నాయి. తాగునీటి సంగతి దేవుడెరుగు. గుక్కెడు మంచి నీళ్ల కోసం వేసవిలో కోట్లాదిమంది ప్రజలు పడరానిపాట్లు పడుతున్నారు. దాహం తీర్చుకునేందుకు అందుబాటులో ఉన్న కలుషిత నీరు తాగి రోగాలబారిన పడుతున్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఎనిమిది దశాబ్దాలు కావస్తున్నా ఇప్ప టికీ ప్రజలందరికీ కనీస అవసరమైన గుక్కెడు స్వచ్ఛ మైన మంచినీరు అందించలేని దురదృష్టపు పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పటికైనా పాలకులు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చర్యలు చేపట్టాలి. అన్నింటికంటే ముఖ్యం గా చట్టాలు చేసి అవి అమలైపోతాయను కుంటే సరిపోదు. ఆ చట్టాలను క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు అవసర మైన సిబ్బందిని నియమించి పటిష్టమైన ప్రణాళికలతో పర్యవేక్షణ చేయాలి.
Read hindi news :hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: