📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Agriculture : హైటెక్ అడుగులతో వ్యవసాయానికి స్వర్ణ యుగం

Author Icon By Sudha
Updated: March 11, 2026 • 5:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా నిలిచిన వ్యవ సాయ రంగం ప్రస్తుతం అనేక సంక్లిష్ట సవాళ్లను ఎదు ర్కొంటోంది. వాతావరణ మార్పులు, అనిశ్చిత వర్షపాతం, భూసారహ్రాసం, పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు, మార్కెట్ అనిశ్చితి వంటి సమస్యలు రైతు జీవితాన్ని క్లిష్టతరం చేస్తు న్నాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ హైటెక్ సాంకే తిక పరిజ్ఞానాన్ని ఆమోదించే దిశగా అడుగులు వేయడం సమయానుకూలమైన, దూరదృష్టితో కూడిన నిర్ణయంగా భావించాలి. ఆధునిక సాంకేతికతను వ్యవసాయంలో సమర్థ వంతంగా వినియోగించడం ద్వారా రైతు ఆదాయం పెంపు, దిగుబడి వృద్ధి, వనరుల సంరక్షణ వంటి లక్ష్యాలు సాధ్యమవుతాయి. ఇప్పటి ప్రపంచంలో వ్యవసాయం కేవలం సంప్రదాయ పద్ధతులకే పరిమితం కావడం సాధ్యం కాదు. ప్రపంచవ్యాప్తంగా డేటా ఆధారిత వ్యవసాయం,(Agriculture) ఖచ్చితత్వ వ్యవసాయం, డ్రోన్లు, ఉపగ్రహ చిత్రాలు, సెన్సార్లు, కృత్రి మ మేధస్సు వంటి సాంకేతిక పరిజ్ఞానాలు విస్తృతంగా వినియోగంలోకి వచ్చాయి. ఇవి పంటల ఆరోగ్య పరిస్థితిని, నేలలోని పోషక స్థాయిలను, నీటి అవసరాన్ని ముందుగానే అంచనా వేసి రైతులకు సరైన సూచనలు అందించగలవు. ఈ విధంగా పంటలపై వచ్చే ఒత్తిడి, వ్యాధులు, నీటికొరత వంటి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చర్య లు తీసుకునే అవకాశం కలుగుతుంది. ఉపగ్రహసాంకేతికత (Agriculture )డ్రోన్ సర్వేలు ద్వారా పంటల స్థితిగతులను సున్నిత స్థాయి లో గమనించడం ఒక విప్లవాత్మక మార్పుగా నిలవవచ్చు. పంటలో చిన్న మార్పులు వచ్చినా వాటిని గుర్తించి రైతులకు హెచ్చరికలు అందించడం ద్వారా నష్టాలను గణనీయంగా తగ్గించవచ్చు. అంతేకాకుండా నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నియంత్రించడం, ఎరువుల వినియోగాన్ని ఖచ్చితంగా అంచనా వేయడం ద్వారా ఖర్చులు తగ్గుతాయి. ఇది రైతు లాభదాయకతను పెంచడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతుంది. అయితే సాంకేతికత ప్రవేశపెట్టడమే సరిపోదు. దాని అమలు సక్రమంగా జరగాలి. ముఖ్యంగా మన దేశంలో చిన్న సన్నకారు రైతులే ఎక్కువ. వారికి అధునాతన పరికరాలు అందుబాటులోకి రావాలంటే ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలి. సబ్సిడీలు, సమూహ ఆధారిత వినియోగ విధానాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా పరికరాలు పంచుకునే విధా నం వంటి చర్యలు తీసుకోవాలి. లేకపోతే సాంకేతికత పెద్ద రైతులకు మాత్రమే పరిమితమై అసమానతలను పెంచే ప్రమాదం ఉంది. సాంకేతిక పరిజ్ఞానం రైతుకు సహాయకు రాలిగా మారాలంటే శిక్షణ అత్యవసరం.

Read Also : LPG Gas Crisis: రైల్వే కేటరింగ్ సేవలు నిలిపివేత?

Agriculture

గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, వ్యవసాయ విస్తరణాధికారులకు సాంకేతిక శిక్షణ ఇవ్వడం, రైతులకు సులభ మైన భాషలో మార్గదర్శకాలు అందించడం అవసరం. డిజి టల్ వేదికల ద్వారా మొబైల్ యాప్లు, సందేశ సేవలు, కాల్ సెంటర్లు వంటి సౌకర్యాల ద్వారా రైతులకు సమయా నుకూల సమాచారం అందించాలి. మార్కెట్ అనుసంధానం కూడా హైటెక్ వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తుంది. పంటల ధరల సమాచారం, డిమాండ్ అంచనాలు, నిల్వ సదు పాయాల వివరాలు వంటి అంశాలను డిజిటల్ ప్లాట్ ఫారమ్ల ద్వారా రైతులకు అందిస్తే వారు సరైన నిర్ణయా లు తీసుకోవచ్చు. ముందస్తు ఒప్పంద వ్యవసాయం, నేరుగా వినియోగదారులకు విక్రయం వంటి అవకాశాలు విస్తరిస్తా యి. డేటా ఆధారిత వ్యవసాయం రైతుకు పంట ఎంపిక లో, సాగు కాల నిర్ణయంలో, మార్కెట్ఎంపికలో కీలకంగా మారుతుంది. అదే విధంగా డేటాభద్రత గోప్యత అంశాలను విస్మరించరాదు. రైతుల భూమి, పంటల వివరాలు వంటి సమాచారాన్ని రక్షించేందుకు స్పష్టమైన విధానాలుఉండాలి. సాంకేతికత వినియోగం పారదర్శకంగా ఉండి రైతు ప్రయో జనాలను కాపాడాలి. ప్రభుత్వ పర్యవేక్షణతో పాటు నిపుణుల సూచనల ఆధారంగా వ్యవస్థలు రూపొందించాలి. వాతావరణ మార్పుల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో క్లైమేట్ స్మార్ట్ వ్యవసాయం అత్యవసరం. మట్టిఆరోగ్య పటాలు, వర్షపాతం అంచనాలు, నీటి నిర్వహణ సాంకేతికతలు రైతులకు రక్షణ కవచంలా నిలుస్తాయి. దీర్ఘకాలికంగా చూస్తే ఇది ఆహార భద్రతకు బలమైన ఆధారంగా నిలుస్తుంది. మొత్తం మీద వ్యవసాయ శాఖ హైటెక్ దిశగా అడుగులు వేయడం శుభ సూచకం. అయితే ఇది కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, నేలమీద స్పష్టమైన ఫలితాలుగా మారాలి. రైతు ఆదాయం పెరగడం, వ్యయాలు తగ్గడం, పంట నష్టాలు తగ్గడం వంటి స్పష్టమైన ప్రయోజనాలుకనబడితేనే ఈ ప్రయత్నం సార్థకమవుతుంది. ప్రభుత్వం, శాస్త్రవేత్తలు, నిపుణులు, రైతులు కలిసికట్టుగా కృషి చేస్తేనే సాంకేతికత నిజమైన మార్పుకు హదపడుతుంది. హైటెక్ వ్యవసాయం ఒక ఆశాకిరణం. సరైన ప్రణాళిక, సమర్థ అమలు, సమగ్ర భాగస్వామ్యంతో ఇది రైతు జీవితాన్ని స్థిరత్వం వైపు నడిపించగలదు. వ్యవసాయం లాభదాయకం గా, సుస్థిరంగా మారే దిశగా ఈ మార్పు ఒక కీలక మైలురాయిగా నిలవాలని ఆకాంక్షిద్దాం.
-తిప్పర్తి శ్రీనివాస్

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

agri technology agriculture Breaking News high tech agriculture latest news Modern Farming smart farming Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.