📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

gold : బంగారం భద్రమా! భారమా?

Author Icon By Sudha
Updated: February 24, 2026 • 4:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ధరలు పెరుగుతున్న కొద్దీ బంగారం అలంకరణ నుంచి పెట్టుబడిగా, గౌరవం నుంచి భారంగా మారుతోంది. మహిళల జీవనశైలి నుంచి పెళ్ళిళ్ళు, నేరాలు, వ్యాపారం దాకా పసిడి ప్రభావం భారతీయ సమాజాన్ని నిశ్శబ్దంగా కానీ లోతుగా మార్చేస్తుంది.) బంగారం,(gold) వెండి ధరలు ఎడతెగకుండా పెరుగుతున్న ఈకాలంలో, అవి కేవలం మార్కెట్ సూచికలుగా మాత్రమే కాకుండా భారతీయ సమాజపు అంతర్లీన మార్పులకు ప్రతీకలుగా మారుతున్నా యి. ఒకప్పుడు శుభకార్యాల మెరుపుగా, కుటుంబ గౌర వానికి ప్రతిష్ఠగా భావించిన బంగారం నేడు భయం, భద్రత, పెట్టుబడి, సామాజిక ఒత్తిడి ఈ అన్నింటినీ కలగలిపిన సంక్లిష్ట అంశంగా మారింది. ధరల పెరుగుదల వేగం ఇదే విధంగా కొనసాగితే, రాబోయే రోజుల్లో భారతీయ జీవన శైలి, కుటుంబ వ్యవస్థ, వ్యాపార రంగం, శాంతిభద్రతలు అన్నింటిపైనా దీని ప్రభావం మరింత లోతుగా పడటం ఖాయం. భారతీయ మహిళల అలంకరణ అలవాట్లలో ఇప్ప టికే స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు వివాహాలు, శుభకార్యాలంటే భారీగా బంగారు ఆభరణాలు ధరించడం గౌరవ సూచికగా భావించేవారు. ఇప్పుడు అదే బంగారం (gold)ధరించడం కంటే భద్రపరచడం ముఖ్యం అన్న ఆలోచన బలపడుతోంది. తేలికపాటి డిజైన్లు, లైట్వెయిట్జ్యూయలరీ, ఇమిటేషన్ ఆభరణాలు నెమ్మదిగా ప్రధాన ప్రవాహంలోకి వస్తున్నాయి. భవిష్యత్తులో ఈ ధోరణి మరింత బలపడితే, బంగారం అలంకరణ వస్తువుగా కాకుండా అవసరమైతే అమ్ముకునే ఆస్తిగా మాత్రమే మిగిలిపోయే పరిస్థితి రావచ్చు. ఇది మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను ఒకవైపు పరిమితం చేసి నట్టే కనిపించినా, మరోవైపు ఆర్థికంగా చైతన్యవంతమైన నిర్ణయాలకు దారితీసే అవకాశం కూడా ఉంది. ధరలు పెరిగే కొద్దీ బంగారం చుట్టూ నేరాల సంఖ్య పెరుగుతున్న వాస్త వాన్ని విస్మరించలేం. చైన్ స్నాచింగ్లు, ఇంటి దొంగతనాలు, జ్యూయలరీ షాపుల దోపిడీలు, ఇప్పటికే పోలీసు శాఖకు తలనొప్పిగా మారాయి.

Read Also : Gold: MCX లో పతనమైన బంగారం, వెండి ధరలు..అనూహ్యంగా పుంజుకున్న డాలర్

gold

రాబోయే కాలంలో ఈ నేరాలు మరింత వ్యవస్థీకృతంగా, సాంకేతికంగా మారే ప్రమాదం ఉంది. నకిలీ హాల్మార్కులు, తక్కువ క్యారెట్ బంగారం మోసాలు, ఆన్లైన్ జ్యూయలరీ లావాదేవీల్లో ఫ్రాడ్స్ వంటి కొత్త తరహా నేరాలు పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా ప్రజల్లో భయం పెరగడమే కాకుండా, బంగారంపై నమ్మకం కూడా క్రమంగా తగ్గే పరిస్థితి రావచ్చు. శాంతిభద్రతల పరి రక్షణకు పోలీసింగ్ విధానాలు కూడా సంప్రదాయ స్థాయి నుంచి సాంకేతిక ఆధారిత విధానాల వైపు మారాల్సిన అవసరం ఏర్పడుతుంది. ధరల పెరుగుదల బంగారాన్ని పెట్టుబడి సాధనంగా మరింత బలపరిచింది. భూమి, షేర్లు, ఇతర ఆస్తులు మార్కెట్ ఒడిదుడుకులకు లోనవు తున్న వేళ, బంగారం సేఫ్ హెవన్గా కనిపిస్తోంది. అయితే భవిష్యత్తులో భౌతిక బంగారం కొనుగోలు కంటే గోల్డ్ బాండ్స్, గోల్డ్ ఈటీఎఫ్లు, డిజిటల్ గోల్డ్ వంటి మార్గాలే ప్రధానంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంట్లో దాచుకునే బంగారం స్థానంలో డీమ్యాట్ ఖాతాల్లో కనిపించే బంగారం కొత్త సాధనంగా మారవచ్చు. ఇది దొంగతనం భయాన్ని తగ్గించినా, బంగారానికి ఉన్న సంప్రదాయ భావో ద్వేగబంధాన్ని కొంతమేర తగ్గించే అవకాశం ఉంది. జ్యూయ లరీ వ్యాపార రంగం ఈ మార్పుల మధ్య తీవ్రమైన సవాళ్ల ను ఎదుర్కొంటోంది. ధరలు పెరగడంతో వినియోగదారులు కొనుగోలు సామర్థ్యం తగ్గుతోంది. స్టాక్ నిర్వహణ ఖర్చులు, భద్రతా ఏర్పాట్లు, బీమా, కార్మికుల మజూరీలు అన్నీ కలిపి వ్యాపారంపై భారంగా మారుతున్నాయి. భవిష్యత్తులోచిన్న, సంప్రదాయ జ్యూయలరీ షాపులు నిలబడటం కష్టమవుతుం డగా, పెద్ద కార్పొరేట్ చైన్లు, బ్రాండెడ్ షోరూములు మార్కె ట్ను ఆక్రమించే అవకాశం ఉంది. దీని ప్రభావం ఉపాధి రంగంపైనా పడవచ్చు. నైపుణ్యం కలిగిన కార్మికులు కూడా కొత్త పరిస్థితులకు తగినట్లుగా తమ వృత్తిని మార్చుకోవాల్సి న పరిస్థితి రావచ్చు.

gold

కుటుంబ జీవనంలో,ముఖ్యంగా పెళ్లిళ్ల సందర్భంలో బంగారం పాత్ర భవిష్యత్తులో కీలక చర్చాంశంగా మారే సూచనలు ఉన్నాయి. ఇప్పటికే పెళ్లి ఖర్చులు ఆకాశాన్నంటుతుండగా, బంగారం ధరల పెరుగు దల ఈ భారాన్ని మరింత పెంచుతోంది. అప్పులు, ఆర్థిక ఒత్తిళ్లు, కుటుంబ విభేదాలు పెరిగే ప్రమాదం ఉన్నప్పటికీ, అదే సమయంలో ఆడంబరం లేని పెళ్లిళ్లకు సామాజిక ఆమోదం పెరిగే అవకాశమూ ఉంది. ఎంత బంగారం ఇచ్చారు? అన్న ప్రశ్న స్థానంలో ఎంత అప్పులేకుండా జీవితం మొదలు పెట్టారు? అన్న ఆలోచన బలపడితే, కట్న వ్యవస్థపై కూడా మెల్లగా ప్రభావం పడవచ్చు. యువతలో బంగారాన్ని చూసే దృష్టికోణం ఇప్పటికే మారుతోంది. భావోద్వేగం కంటే లెక్క లు, సంప్రదాయం కంటే రాబడి ఇవే నిర్ణయాలకు ఆధా రంగా మారుతున్నాయి. ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్, స్టార్టప్ పెట్టుబడుల వైపు యువత మొగ్గు పెరిగితే, భారతీయ పెట్టుబడి సంస్కృతి ఒక కొత్త దశలోకి అడుగు పెట్టినట్టే. దీని వల్ల దీర్ఘకాలంలో ఉత్పాదకరంగాలకు పెట్టుబడులు పెరిగే అవకాశమూ ఉంది. ఆడంబరానికి కాదు అవగాహనకు విలువనిచ్చే దశకు సమాజం చేరాల్సిన సమయం ఇది. బంగారం సంపదగా ఉండాలి గానీ, సామా జిక భారంగా మారకూడదు. పసిడి మెరుపును కాదు, దాని ప్రభావాన్ని అర్థం చేసుకున్నప్పుడే భారతీయ సమాజం ఈ బంగారు సవాల్ను సమతుల్యంగా ఎదుర్కొనగలదు.
-మర్రాపు వసుంధరా దేవి

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News gold as asset gold investment gold price trends investing in gold is gold safe investment latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.