📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

AP Name Change Controversy: గరికపాటి వ్యాఖ్యలకు కమలానంద భారతి కౌంటర్

Author Icon By Rajitha
Updated: March 2, 2026 • 1:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు (Garikapati Narasimha Rao) ఆంధ్రప్రదేశ్ పేరును మార్చాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇతర రాష్ట్రాల మాదిరిగానే మన రాష్ట్రం పేరును కూడా ‘తెలుగునాడు’గా మార్చాలని ఆయన కోరారు. తమిళనాడు తరహాలో మన పేరులో కూడా తెలుగుదనం ఉట్టిపడాలని, ఇది ఎన్టీఆర్ ఆశయమని ఆయన పేర్కొన్నారు. కేరళ ప్రజలు తమ రాష్ట్రం పేరు మార్పు కోసం చూపిస్తున్న పట్టుదలను మనం కూడా ఆదర్శంగా తీసుకోవాలని గరికపాటి సూచించారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు తెలుగు మీడియం తప్పనిసరి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Read also: BR Naidu: డీఫ్ ఫేక్ వీడియోలతో నాపై దుష్ప్రచారం: టీటీడీ చైర్మన్

Garikapati’s comments on changing the name of AP

గరికపాటి వ్యాఖ్యలపై కమలానంద భారతి ఆగ్రహం

గరికపాటి చేసిన ఈ ప్రతిపాదనను భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి తీవ్రంగా వ్యతిరేకించారు. ఆంధ్రప్రదేశ్ అనే పేరులో ఏ లోపం ఉందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఆంధ్ర, ప్రదేశ్ అనేవి రెండు కూడా సంస్కృత పదాలేనని, వాటిని మార్చాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రామాయణ కాలం నుంచే ‘ఆంధ్ర’ అనే పేరు వాడుకలో ఉందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రం పేరు మార్చినంత మాత్రాన ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాదని, ఇలాంటి వింత ఆలోచనలు చేయడం సరికాదని కమలానంద భారతి హితవు పలికారు.

తెలంగాణలో ఉంటూ ఏపీకి సలహాలొద్దు

తెలంగాణలో స్థిరపడిన వారు ఆంధ్రప్రదేశ్ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని కమలానంద భారతి ఘాటుగా విమర్శించారు. గరికపాటి తెలంగాణలో ఉంటూ ఏపీ ప్రజలకు సలహాలు ఇవ్వడం ఏంటని ఆయన నిలదీశారు. ఎన్టీఆర్ ఆత్మగౌరవ నినాదంతో పార్టీ పెట్టినా, దానికి ‘తెలుగుదేశం’ అని పేరు పెట్టారే తప్ప రాష్ట్రం పేరు మార్చలేదని గుర్తు చేశారు. మా ప్రాంతం ఎలా ఉండాలో మాకు తెలుసని, అనవసరమైన చర్చలు లేవనెత్తవద్దని సూచించారు. తాము ఆంధ్రప్రదేశ్ ప్రజలుగానే ఉండటానికి ఇష్టపడుతున్నామని పీఠాధిపతి తేల్చి చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

AP Name Change Garikapati Comments Kamalananda Bharati Counter latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.