📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HPV vaccination drive: 14 ఏళ్ల లోపు బాలికలను ఫ్రీగా HPV వ్యాక్సిన్

Author Icon By Vanipushpa
Updated: February 28, 2026 • 2:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్‌లో చాలామంది మహిళలు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ (సర్వైకల్ క్యాన్సర్)తో బాధపడుతున్నారు. ఈ మహమ్మారిని నిర్మూలించేందుకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే శనివారం రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ.. హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రారంభించారు. దీంతో దేశవ్యాప్తంగా ఈరోజు నుంచి ఈ వ్యాక్సిన్‌ను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఈ వ్యాక్సిన్ ద్వారా కోట్లాది మంది బాలికలకు సర్వైకల్ క్యాన్సర్‌ నుంచి రక్షణ లభించనుంది.

Read Also: Viveka MurderCase: వివేకా హత్యకేసు వడివడిగా సిబిఐ దర్యాప్తు

Free HPV vaccine for girls under 14 years of age

కేంద్ర ఆరోగ్య శాఖ ఈ టీకాలను ఉచితంగా పంపిణీ

14 ఏళ్లు నిండి 15 ఏళ్ల లోపు ఉన్న బాలికలకు ఈ వ్యాక్సిన్‌ను వేయనున్నారు. పాఠశాలలు, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల ద్వారా కేంద్ర ఆరోగ్య శాఖ ఈ టీకాలను ఉచితంగా పంపిణీ చేయనుంది. సింగిల్ డోస్ కింద గార్డాసిల్–4 వ్యాక్సిన్‌ను ఎడమ చేతికి వేస్తారు. ఆ తర్వాత ఎడమ చేతి చూపుడు వేలికి మార్కర్ ఇంక్ పెడతారు. ఇందుకోసం యూ–విన్ (U-–WIN) పోర్టల్‌‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో కుదరకపోతే నేరుగా సెంటర్‌కు వెళ్లి కూడా టీకా వేసుకోవచ్చు. ఈ వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ మూడు నెలల పాటు సాగనుంది. టీకా తీసుకునే బాలికలు తప్పకుండా టిఫిన్ లేదా భోజనం చేసి రావాలని కేంద్ర వైద్యారోగ్య శాఖ గైడ్‌లైన్స్‌ విడుదల చేసింది. ఖాళీ కడుపుతో వ్యాక్సిన్ వేయించుకోవద్దని సూచించింది. టీకా వేసుకున్న తర్వాత అరగంట పాటు అబ్జర్వేషన్‌లో ఉండాల్సి ఉంటుంది. జ్వరం, తలనొప్పి రావడం కామన్ అని ఆ తర్వాత భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వ్యాక్సిన్ వేయించుకోవడం అనేది తప్పనిసరి కాదు. నచ్చివాళ్లు వేసుకోవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Cervical Cancer Prevention Free HPV vaccine Girls Health Awareness Government Health Scheme HPV Vaccination Campaign India Human Papillomavirus Vaccine Telugu News Paper Telugu News Today Vaccination for Under 14

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.