📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు

South-Korea: మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు 5 ఏళ్ల జైలు శిక్ష

Author Icon By Vanipushpa
Updated: January 16, 2026 • 4:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ (Yoon Suk Yeol) రాజకీయ పతనం పూర్తయింది. గతేడాది దేశంలో అశాంతిని సృష్టించి, విఫలమైన ‘మార్షల్ లా’ (సైనిక పాలన) విధింపునకు ప్రయత్నించిన కేసులో ఆయనకు అక్కడి కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అధికారంలో ఉండగానే అరెస్ట్ అయిన తొలి అధ్యక్షుడిగా చరిత్రకెక్కిన యూన్ సుక్ యోల్‌కు.. ఈ తీర్పు కోలుకోలేని దెబ్బగా మారింది. యూన్ సుక్ యోల్ అరెస్ట్ ప్రక్రియ ఒక హై-డ్రామాను తలపించింది. జనవరిలో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు అధికారులు ప్రయత్నించగా.. తన నివాస సముదాయంలో బారికేడ్లు వేయించుకుని లోపలికి ఎవరినీ రానివ్వకుండా అడ్డుకున్నారు. సెక్యూరిటీ సర్వీస్ అధికారులను కూడా ఇన్వెస్టిగేటర్లను అడ్డుకోవాలని ఆదేశించి విధి నిర్వహణకు ఆటంకం కలిగించారు. చివరకు సుమారు 3,000 మందికి పైగా పోలీసు అధికారులతో భారీ ఆపరేషన్ చేపట్టి.. రెండో ప్రయత్నంలో ఆయనను అధికారులు అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది.

Read Also: Budget 2026: సామాన్యుడి జీవితంలోకి ఏఐ

South-Korea: మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు 5 ఏళ్ల జైలు శిక్ష


యూన్ సుక్ యోల్‌పై ప్రధానంగా మూడు రకాల ఆరోపణలు

కోర్టు విచారణలో యూన్ సుక్ యోల్‌పై ప్రధానంగా మూడు రకాల ఆరోపణలు రుజువయ్యాయి. అందులో ఒకటి వారెంట్ అమలు చేయడానికి వచ్చిన అధికారులను అడ్డుకోవడం. రెండోది 2024 డిసెంబర్‌లో మార్షల్ లా ప్రకటించినప్పుడు అధికారిక పత్రాలను తారుమారు చేయడం. ఇక మూడోది ప్రతిపక్షాలను, ప్రభుత్వ వ్యతిరేక శక్తులను అణచివేసేందుకు ప్రజాస్వామ్యాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రమాదంలోకి నెట్టడం. ప్రస్తుతానికి ఐదేళ్ల శిక్ష ఖరారైనప్పటికీ.. యూన్ సుక్ యోల్ ముందు అసలైన సవాలు ‘ఇన్సురెక్షన్’ (తిరుగుబాటు) కేసు రూపంలో ఉంది. దేశంలో సాయుధ తిరుగుబాటుకు ప్లాన్ చేశారనే ఆరోపణపై ప్రాసిక్యూటర్లు ఆయనకు మరణశిక్ష విధించాలని కోర్టును కోరారు. ఈ కీలకమైన కేసులో తీర్పు ఫిబ్రవరిలో వెలువడనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

breaking world news court verdict news Former president news International Politics political developments South Korea Politics Telugu News online Telugu News Today Yoon Suk Yeol

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.