📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

flame of war : మింటికెగసిన యుద్ధజ్వాల!

Author Icon By Sudha
Updated: March 3, 2026 • 3:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పశ్చిమాసియాలో యుద్ధం అత్యంత భీకర స్థాయికి చేరుకుంది. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా ఇరాన్పై
జరిపిన భారీ వైమానిక దాడుల్లో ఆ దేశ సుప్రీం లీడర్యతొల్లా అలీ ఖమేనీ మరణించారు. ఆ విషయం తెలిసి అనేక
దేశాల్లో జనం ప్రతీకార దాడులకు తెగబడ్డారు. నిరసన లకు దిగారు. సామ్రాజ్యవాదానికి అమెరికా మరోపేరన్నది చరిత్ర
చెబుతోంది. కానీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీ పగ్గాలు చేపట్టాక అనేక సందర్భాల్లో ఆయన తెంపరితనా న్ని
చూపించారు. తాజాగా ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తోందన్న విషపై ఇజ్రాయిల్ తరఫున ఇరాన్ పై యుద్ధం
ప్రకటించింది. అంటే ఇజ్రాయెల్ అపనమ్మకం ఇరాన్ కొంప ముంచింది. ఇరాన్ బలపడితే చమురు వాణిజ్యానికి
అడ్డంకులు ఏర్పడతాయన్న ఇజ్రాయెల్ ఆందోళన వల్లే అమెరికా తక్షణమే ఇరాన్ పై యుద్ధ జ్వాలను రగిల్చింది. ఇజ్రాయెల్అమెరికాకు నమ్మిన బంటు. అత్యంత ఆప్తమిత్రత్వం ఉంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యహు చెప్పాడంటే ట్రంప్ ‘ఊ’ కొట్టాల్సిందే. ట్రంప్ ఆదేశిస్తే నెతన్యాహు జీ హుజూర్ అనాల్సిందే. అదే స్నేహం ఇప్పుడు ఇరాన్ పైకి పురికొల్పడానికి కారణ మైంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఇరాన్ సుప్రీమ్ లీడర్ ఖమేని 48 మంది సైనికాధికారులతో ఉండగా ముమ్మర దాడులు చేసిమట్టుబెట్టారు. అమెరికా, ఇజ్రాయిల్లు ఇరాన్ వార్నింగ్ ఇవ్వగానే ఇరాన్ నుంచి ప్రతీకార దాడులను సహించబోమని అమెరికా సైన్యం, క్షిపణులు, డ్రోన్లతో తీవ్ర దాడులు మొదలెట్టింది. పైగా ఇరాన్ ప్రజల స్వేచ్ఛ కోసం. తాను ఏమైనా చేస్తానని ట్రంప్ ఇరాన్ ప్రజలకు సందేశమిచ్చారు.

Read Also : Iran Earthquake: ఇరాన్‌లో భూకంపం.. భయం తో పరుగులు తీసిన ప్రజలు

flame of war

ఇరాన్లో ఉగ్రవాదాన్ని వ్యా పింప చేసిన ఖమేని లేని ఈ తరుణంలో తమ భవిష్యత్ ను ఉజ్వలం చేసుకోవాలని ఇజ్రాయెల్ దేశాధ్యక్షుడు నెత న్యాహు ఇరాన్ ప్రజలను కోరారు. ఖమేని హయాంలో దాదాపు 12 వేల మంది ఇరానీయలను ఊచకోతకోశారని అంతర్జాతీయ సంస్థల అంచనా. ఆయన మరణాన్ని జీర్ణిం చుకోలేని హమాస్, హౌతీలు, హెజ్బోల్లాలు పలు దేశాల్లో నిరసన దాడులకు దిగాయి. ఇజ్రాయెల్ తో పాటు అనేక గల్ఫ్ దేశాలపై ఇరాన్ చేసిన ప్రతీకారదాడులతో పేలుళ్లతో ఆయా దేశాల్లోని ముఖ్యమైన ప్రాంతాల్లో మంటలు మిన్నంటాయి. అమెరికా ఆస్తులు కలిగివున్న అన్ని అరబ్ దేశాల్లోనూ ఇరాన్ ఆర్మీ క్షిపణుల్తో దాడిచేస్తోంది. బ్రిటిష్ మిలిటరీ స్థావరాలను కూడా వదిలిపెట్ట లేదు. ఇక్కడ విశే షంగా చెప్పుకోదగినవి ఏమిటంటే ఇరాన్ పైవ్యూహాత్మక దాడులకు అమెరికా ఆంత్రోపిక్ కృత్రిమ మేధను విని యోగించుకోవడం. అమెరికా దాడులు జరిపే తేదీని ఏ ఐ చాట్ ‘గ్రోక్ ముందుగానే పసికట్టిన తేదీనే ఈ దాడులు జరగడం. నిత్యం బాంబుల మోతలతో దద్దరిల్లుతున్న ఆయా దేశాలలో భారతీయులతో సహా ఇతర దేశాల వారు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఈ నేపథ్యం లోనే ఇరాన్లో రాజకీయ అనిశ్చితి తొలగించడం కోసం తాత్కాలిక సుప్రీమ్ లీడర్గా ఆలీ రెజా అరాఫీని నియ మించుకొన్నారు. ఆయన మతాధికార వ్యవస్థలో అత్యంత సీనియర్. కొత్త పాలక వర్గంతో ‘రాజీ’ చర్చలకు తాను సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ ప్రకటించారు. అయితే అందుకు ఇరాన్ నేతల ప్రతిస్పందన అవసరం. ఇరాన్పై ఈ దాడులు శాంతిస్థాపన కోసమేనని, అవసరమైనంత కాలం ఈ బాంబు దాడులు కొనసాగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కాగా తాము తమ సుప్రీమ్ లీడర్ ఖమైనీను చంపినందుకు నిరసనగా ప్రతీకార దాడులు చేపట్టామని ఇరాన్ నేతలు చెబుతున్నారు. ఈ దాడు లకు ప్రతిస్పందనగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై వంద లాది క్షిపణులను ప్రయోగించింది.

flame of war

బహ్రెయిన్, కతార్ వంటి దేశాల్లోని అమెరికా సైనికస్థావరాలను కూడాఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. ఈపరిణామాలపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమైంది. దాడుల ను వెంటనే ఆపి, వివాదాలను శాంతియుతంగా పరిష్క రించుకోవాలని సమితి ప్రధాన కార్యదర్శి దేశాలకు విజ్ఞప్తి చేశారు. రష్యా, చైనాదేశాలు అమెరికా ప్రవాస భారతీయు ల భద్రత కోసం భారత్లోని అన్ని ప్రభుత్వాలు కేంద్రం ఆయా ప్రాంతాల ప్రభుత్వాలను సమాయత్తపరిచింది. కుట్రపూరిత విధానాలను అవలంబిస్తోందని వ్యాఖ్యానిం చాయి. యుద్ధం (flame of war)కారణంగా పశ్చిమాసియా దేశాల్లో గగన తలం పూర్తి స్థాయిలో మూసివేసారు. విమాన సర్వీసులన్నీ నిలిచిపోవడంతో భారతీయులతోసహా వేలాదిమంది ప్రయా ణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు.\ దాదాపు లక్షల మంది ట్యాన్సిట్ వీసామీద వెళ్లిన వారు విమానా శ్రయాల్లో చిక్కుపోయారు. ప్రస్తుతం 8 అరబ్ దేశాల మీద ఇరాన్ ప్రతీకార దాడులను ముమ్మరం చేసింది. అక్కడే కనీసం కోటిమంది ప్రవాసులు ఉన్నారు. వారి పరిస్థితి ఏమిటో సమాచారం లేక వారి కుటుంబాల వారు ఆందోళనలో ఉన్నారు. కొందరైతే బంకర్లలో దాక్కున్నా రన్న సమాచారం ఉంది. యుద్ధమేఘాలు తొలగితే తప్ప వారు బయటపడే పరిస్థితి లేదు. ఈ యుద్ధ వాతావరణం (flame of war) నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్లో ఇస్లామిక్ రిపబ్లిక్ శకంముగిసినం దున తాను అక్కడ అధికార మార్పిడి బాధ్య తలు తీసు కునేందుకు ఇరాన్ మాజీ యువరాజు రెజా పహ్లావీ సిద్ధమోతున్నారు. ఇన్నాళ్ళూ ఇస్లామిక్నిబంధనల మేరకు జరిగిన మతపరమైన పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిజంగా అక్కడ ప్రజాస్వామ్యం పరిఢవిల్లితే మంచిదే!

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

battlefield Breaking News Flame of War latest news military fiction rising conflict Telugu News war drama

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.