हिन्दी | Epaper

Farmer : మాటల్లో కాదు.. చేతల్లో చూపాలి!

Sudha
Farmer : మాటల్లో కాదు.. చేతల్లో చూపాలి!

రైతులను వెంటాడుతున్న సమస్య పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేకపోవడం. పంట పండించడానికి వేల రూపాయలు ఖర్చు పెట్టినా, మార్కెట్లో ఖర్చులకు సరిపడే ధర కూడా దక్కడం లేదు. ప్రభుత్వం మద్దతుధర ప్రకటించినా, చాలాచోట్ల ఆధరకు కొనుగోలు జరగడం లేదు. దళారులు, మధ్యవర్తుల చేతుల్లో రైతు (Farmer)మోసపోతున్నాడు. ఇక సాగు ఖర్చులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. విత్త నాలు, ఎరువులు, పురుగుమందుల ధరలు పెరిగాయి. కానీ పంటధరలు మాత్రం అదేస్థాయిలో ఉన్నాయి. పెట్టుబడి పెరిగి లాభం తగ్గడంతో వ్యవసాయం రైతుకు భారంగామారి మరింత ఇబ్బందుల్లోకి నెట్టి అప్పులపాలు చేస్తుంది. బ్యాంకుల నుంచి రుణాలు సమయానికి దొరకక, ప్రైవేట్ వడ్డీవ్యాపారుల వద్దకు వెళ్లాల్సి వస్తోంది. అధికవడ్డీలతో అప్పులు తీరని పరిస్థితి ఏర్పడుతోంది. పంటనష్టమైతే ఆ అప్పుల భారమే రైతుకుటుంబాన్ని మరింత కుంగదీస్తోందని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే వాతావరణమార్పులు కూడా రైతు(Farmer)కు పెద్దసవాల్గా మారాయి. అకాల వర్షాలు, వరదలు, కరువులు పంటలను నాశనం చేస్తున్నాయి. పంట బీమా ఉన్నా, నష్టపరిహారం ఆలస్యం కావడం లేదా పూర్తిగా అందకపోవడం వల్ల రైతుకు ఆశ్రయం లేకుండాపోతోంది. చాలా ప్రాంతాల్లో గ్రామాల నుంచి ప్రజలు వలస వెళ్లడంతో వ్యవసాయ కూలీల కొరత ఏర్పడింది. కూలీలు దొరకకపోవ డం, కూలీ ఖర్చులు పెరగడం వల్ల రైతుకు మరింత భార మవుతోంది. యాంత్రీకరణ ఉన్నా, చిన్న రైతులకు అది అందుబాటులో లేదు. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా రైతు ఆవేదన మాత్రం అలాగే ఉంది. వ్యవసాయరంగంలో మౌలిక మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్న మాటలు చెబుతున్నప్పటికి అవి అమల్లోకి రావడంలేదు. దేశ భవిష్య త్తు యువత చేతుల్లో ఉందంటారు. కానీ అదే యువతనేడు విద్య, ఉద్యోగ రంగాల్లో తీవ్రమైన సమస్యలను ఎదుర్కొం టోంది. చదువుకున్నా ఉపాధి దొరకని పరిస్థితి, ప్రైవేట్ రంగంలో ఉద్యోగం దొరికినా భద్రతలేని స్థితి యువతను ఒకింత ఆందోళనకు గురిచేస్తోంది. విద్యావ్యవస్థలో అసమా నతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కొరత, ఉపాధ్యాయుల లేమి, నాణ్యత తగ్గడం యువతను ప్రైవేట్ విద్యవైపు నెట్టేస్తోంది. కానీ ప్రైవేట్ విద్య ఖర్చులు సామాన్య కుటుంబాలకు అందని స్థాయిలో ఉన్నాయి. ఫలితంగా విద్యేయువతకు భారంగా మారుతోంది. డిగ్రీలు, పీజీలు, పీహెచీలు పూర్తి చేసిన తర్వా త ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యం కావడంవల్ల యువత ఏళ్ల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఈ నిరీక్షణ కాలంలో వయసు పరిమితులు, మానసిక ఒత్తిడి, ఆర్థిక భారాలు పెరుగుతున్నాయి.

Read Also : Indians in Karachi: కరాచీ ఎయిర్‌పోర్టులో బిక్కుబిక్కుమంటున్న 8 మంది భారతీయులు

Farmer
Farmer

ప్రైవేట్ రంగంలో ఉద్యోగం దొరికినా తక్కువ జీతాలు, భద్రతలేని పని పరిస్థితులు యువతను నిరుత్సాహ పరుస్తున్నాయి. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు పెరిగిపోవడంతో ఉద్యోగ స్థిరత్వం తగ్గుతోంది. పనిగంటలు ఎక్కువగా ఉండటం, వేతనం తక్కువగా ఉండ టం వల్ల జీవన భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇవన్నీ కలిసి యువతలో మానసిక ఒత్తిడి పెరగడానికి కారణమవు తున్నాయి. నిరుద్యోగం, పోటీ, కుటుంబఒత్తిళ్లు యువతను ఆత్మవిశ్వాసం కోల్పోయేలా చేస్తున్నాయి. కొందరిలో డిప్రెషన్, నిరాశ పెరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఈ పరిస్థితి మారాలంటే విద్య, ఉద్యోగ విధానాల్లో సమగ్ర మార్పులు అవసరం.నాణ్యమైన ప్రభుత్వవిద్య, సమయానికి ఉద్యోగ నియామకాలు, పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన నైపుణ్య శిక్షణ, యువతకు భద్రత కలిగించే ఉద్యోగ విధానా లు అమలవ్వాలి. మాటలకే పరిమితమవకుండా కార్యాచరణ జరిగితేనే యువత ఆశలు నిలబడతాయి. ఆరోగ్యం, విద్య వంటి మౌలికరంగాలు సైతంక్రమంగా వ్యాపారాలుగా మార డంతో ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలలు బలహీనపడు తుండగా, ప్రైవేట్ సంస్థలు లాభాలపై దృష్టి పెట్టుతున్నాయి. ఉదాహరణకు ఒక పట్టణ కేంద్రాన్ని తీసుకుంటే పదుల సంఖ్యలో కార్పొరేట్ పాఠశాలలు, దవాఖానాలు దర్శన మిస్తాయి. కానీ ఉన్న ప్రభుత్వ సంస్థలలో అరకొర వసతు లుండటం అందరికి సుపరిచితమే. పేద, మధ్య తరగతి కుటుంబాలు చిన్న అనారోగ్యానికి కూడా భారీ ఖర్చులు భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది సంక్షేమ పాలనకు విరుద్ధమని గ్రహించాల్సిన అవసరం ఉన్నది. ప్రజాస్వామి క దేశంలో ఇంకా రాజకీయాల్లో అధికార కేంద్రీకరణ పెరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజాస్వామ్య వ్యవ స్థలో ప్రజలే కేంద్రంగా ఉండాలి. కానీ వాస్తవంలో నిర్ణయా లు తీసుకునేఅధికారం కొద్దిమందికే పరిమితం అవుతున్నా యన్న భావన పెరుగుతోంది. రాష్ట్రంగానీ, దేశం గానీముందు కు వెళ్లాలంటే అభివృద్ధి ఫలాలు అందరికీ చేరాలి. ప్రభుత్వ విధానాలు ప్రజల అవసరాలపై ఆధారపడి ఉండాలి. అలాగే పాలకులు జవాబుదారీతనంతో వ్యవహరించాలి.
-డా. పోలం సైదులు

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870