Fake educational institutions : విద్యాలయాల్లో ‘బోగస్’ నీలినీడలు

Read Time:  1 min
Fake educational institutions
Fake educational institutions
FONT SIZE
GET APP

అన్నీ ఉన్నాయనుకున్న చోట ఐదో తనం’ లేదన్న విషయాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆలస్యంగానైనా గుర్తించినట్లుంది. దేశంలోని 12 రాష్ట్రాలలో 30 బోగస్ విశ్వవిద్యాలయా లను గుర్తించారు. దేశవ్యాప్తంగా లోపభూయిష్టమైన విద్యావిధానం, బోధనా పద్ధతులపై సంస్కరణలు తీసు కురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. విద్యపై బడ్జెట్లో సరిపడా నిధులు ఉన్నా లేకపోయినా విద్య గురించి ఎన్నో సెమినార్లు, అడ్వయిజరీ కౌన్నిళ్లు ఉండనే ఉన్నాయి. కానీ యుజిసి అనుమతులతో బడా విశ్వవిద్యా లయాల జాబితాలోకి ఎన్నో బోగస్వర్సిటీలు చొచ్చుకు వచ్చేస్తున్నాయి. నిత్యం ఆయా విశ్వవిద్యాలయాలు దాని అనుబంధ కళాశాలలకు తాము ఎలాంటి గుర్తింపు ఇవ్వ లేదని యుజిస స్పష్టం చేస్తోంది. కాగా విశ్వవిద్యాయాల అధికారాలు మాత్రం వాటిపై చర్చలుతీసుకోవడానికి మీన మేషాలు లెక్కిస్తాయని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఆయా విశ్వవిద్యాలయాల నిర్వహణలో ఎన్ని లోపా లున్నా వాటిని ఎవరో ఒకరు ఫిర్యాదులు చేస్తే తప్ప వాటిపై తనిఖీలు, నిఘా ఉంచడాలు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రస్తుత విద్యా విధానం గురించి కన్నాతొలుత ఆలోచించాల్సింది ప్రభుత్వాలే. కానీ వారాపని చేయడా నికి ఏళ్లూపూళ్లు గడిచిపోతాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రా ల్లో ఇలాంటి బోగస్ వర్సిటీలు ఎక్కువగా దొరికిపోతున్నాయి. విశ్వ విద్యాలయాలు, వాటి అనుబంధ కళాశాలలో విద్యార్థులకు కల్పించే సౌకర్యాలు ఒక వంతైతే ఆ తరువాత విద్యాబోధనా
కార్యక్రమాల స్థాయి బోధనాంశాలు, వాటిని బోధించే వారి టీచింగ్సత్తాపై కూడా దృష్టి సారిం చాల్సింది యుజిసియే.

Read Also : Budget tablets 2026: బడ్జెట్ ధరలో లభిస్తున్న బెస్ట్ టాబ్లెట్లు ఇవే!

 Fake educational institutions
Fake educational institutions

దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలు అన్నిటికి యుజిసి ప్రణాళికలను అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ సంస్థ సూచిస్తున్న విధంగా విద్యా నైపుణ్యాలను పెంచుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. కానీ వాటి విషయం గూర్చి ఆలోచించడం మాని యాజ మాన్యాలు తమ ఖర్చులు మిగుల్చుకునే ధోరణిలో పక్కన పెడతారు. అదేమీ వ్యయకర్తనం కాదు. ధనలబ్ధి కోసమే. యుజిసి తాజా ప్రయత్నంలో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకుకొన్ని సలహాలు ఇస్తోంది. ఉన్నత విద్యాసంస్థల్లో కొన్ని బోగస్ విద్యాసంస్థలున్నాయని ( Fake educational institutions) అవి అందించే పట్టా లకు గుర్తింపు, విలువ లేవని చెబుతోంది. ఈకళాశాలల్లో చదివిన ఉద్యోగార్థుల పట్టాలు ఉద్యోగార్హతను ఇవ్వలేవని, ఉన్నత విద్యకు పనికి రావని హెచ్చరిస్తున్నాయి. ప్రజల్లో తమ విద్యావ్యాపార ప్రచారం విస్తృతంగా వెళ్లిపోయాక వాటిపట్ల ఆకర్షితులైన విద్యార్థులను ఆపడం చాలాకష్టం. విస్తృత ప్రచారం ద్వారా జనంలోకి వెళ్లినప్పుడే యుజిసి స్పష్టమైన ప్రకటన ఇవ్వకపోవడంతో కొందరు వాటిలో జానయ్యారు కూడా. ఆంధ్రప్రదేశ్లోని రెండు విశ్వవిద్యాలయాల్లో పలువురు విద్యార్థులు జాయినయ్యారు. గత యేడాది కూడా ఈ రెండు విశ్వవిద్యాలయాలను బోగస్ ప్రకటించినా వారు ఈఏడాది సక్రమమైన గుర్తింపు తెచ్చు కోలేదు. దాంతో యుజిసి ఈసారికూడా వాటిని బోగస్ గా ప్రకటించింది. అప్పటికే చేరిన విద్యార్థులు ఆచిక్కుల్లోంచి బయటపడడానికి నానా యాతన పడ్డారు. బోగస్ సంస్థ లుగా గుర్తించిన ఆయా విశ్వవిద్యాలయాలు జారీ చేసే పట్టాలు చెల్లుబాటు కావు. వాటికి ఎలాంటి చట్టబద్ధత లేదు. ఇతర ఉపాధి, అధికారిక ప్రయోజనాలు ఈ పట్టా లతో పొందడం సాధ్యం కాదు. 12 బోగస్ విశ్వవిద్యాలయాలున్న (Fake educational institutions) ప్రధానకేంద్రంగా ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్లో ఈ బాపతు విశ్వ విద్యాలయాలు నాలుగు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర,పుడు చ్చేరి, పశ్చిమబెంగాల్లో రెండేసి బోగస్ కళాశాలల చొప్పున యుజిసి గుర్తించింది.

 Fake educational institutions
Fake educational institutions

హర్యానా, అరుణాచల్ప్రదేశ్, జార్ఖండ్ రాజస్థాన్లలో ఒక్కొక్కటి చొప్పున ఇలాంటి విశ్వవిద్యాలయాలున్నాయి. ఆ వివరాలన్నిటినీ విద్యార్థులకు అందే విధంగా వెబ్సైట్లో ఉంచింది. తమ బిడ్డల భవిష్యత్ను తల్లిదండ్రులను మధ్య పెట్టే విధంగా గొప్ప గొప్ప పేర్లు, నినాదాలతో వారి విస్తృత ప్రచారం ఉంటుంది. కనుక ఎవరైనా వారిఉచ్చులో పడతారు. పైగా మహాత్మాగాంధీ, నేతాజీ సుభాష్చంద్రబోస్ వంటి జాతి నేతల పేర్లతో బాగా ఆకట్టుకునే విధంగా ఆయా విశ్వవిద్యా లయాల పేర్లుకూడా పెట్టుకున్నారు. బోగస్ విద్యాలయాల్లో సరైన సౌకర్యాలుండవు. విద్యాప్రమాణాలు పరిస్థితి అంతే. నకిలీ సంస్థలపై కేసులు పెట్టాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆదేశించింది. ఎంతో సురక్షితమైన భవిష్యత్తు ఉంటుందని విద్యార్థులు పేరొందిన విద్యాలయాల్లో చేర తారు. వాటి వెనుకనున్న విశ్వవిద్యాలయాలు విద్యాప్రమా ణాలు ఏమేరకు ఉన్నాయి. విద్యా ప్రమాణాలు లేకుండానే విద్యార్థులను ఆకట్టుకునే బోగస్ విశ్వవిద్యాలయాలపై యుజిసి నిరంతర నిఘాఅవసరముంది. ఈమధ్య యుజిసి ప్రమాణాలు ఉల్లంఘించిన విశ్వవిద్యాలయాలపై కఠినంగా వ్యవహరించి మూడుసంస్థలో కొత్తగా పిహెచి విద్యార్థు లను ఐదేళ్లపాటు చేర్చుకోకుండా నిషేధం విధించింది. అలాంటి కఠిననియంత్రణ నిబంధనలున్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిరంతర నిఘావ్యవస్థను ఏర్పాటుచేయా ల్సిన అవసరముంది. విద్య జీవిత మార్గదర్శకంగా కాక కాలక్షేప వ్యవహారంగా ఎప్పుడు మారుతుందో అప్పుడే విద్యార్థుల్లో విద్యాసక్తి తగ్గిపోతుంది. అందుకే విద్యాప్రమా ణాలు మెండుగా కలిగిన విశ్వవిద్యాలయాలనువాటి అను బంధ కళాశాలలను ఉత్తమ విద్యాలయాలుగా తీర్చిదిద్దే దిశగామరిన్ని మార్గదర్శకాలను రూపొందించాల్సిన ఆవ శ్యకతఉంది. ప్రాంతీయ పర్యవేక్షణ కేంద్రాలు చైనత్యవంతంగా వ్యవహరిస్తే బోగస్ విద్యాసంస్థలకు తావుండదు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.