📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Yashoda Hospital Theft: రోగికి మత్తు మందు ఇచ్చి 10 తులాలు దోచుకున్నఫేక్ డాక్టర్

Author Icon By Rajitha
Updated: March 12, 2026 • 5:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సికింద్రాబాద్‌లోని ప్రముఖ యశోద ఆసుపత్రిలో ఒక ఘరానా దొంగతనం జరిగింది. తెల్ల కోటు వేసుకుని డాక్టరులా వచ్చిన ఒక గుర్తుతెలియని మహిళ, రోగులను మరియు సిబ్బందిని బురిడీ కొట్టించింది. పక్కా ప్లాన్‌తో ఆసుపత్రిలోకి ప్రవేశించి, వైద్యం చేస్తున్నట్లు నటించి అందరినీ నమ్మించింది. తీరా అసలు విషయం తెలిసేసరికి అక్కడ జరగకూడని నష్టం జరిగిపోయింది.

Read also: Farooq Abdullah: దేవుడే నన్ను రక్షించాడు: ఫరూక్ అబ్దుల్లా

Yashoda Hospital Theft: Fake doctor robs patient of 10 tolas after drugging him

మత్తు ఇంజెక్షన్ ఇచ్చి భారీ దోపిడీ

ఓల్డ్ బోయిన్‌పల్లికి చెందిన సుధారాణి అనే మహిళ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. ఆమె డిశ్చార్జ్ అయ్యే సమయంలో ఈ నకిలీ డాక్టర్ గదిలోకి ప్రవేశించింది. ఇంజెక్షన్ ఇవ్వాలని చెప్పి బంధువులను బయటకు పంపేసింది. అనంతరం రోగికి మత్తు మందు ఇచ్చి, ఆమె ఒంటిపై ఉన్న సుమారు 10 తులాల బంగారు ఆభరణాలను దోచుకుని అక్కడి నుండి చాకచక్యంగా పరారైంది.

పోలీసుల దర్యాప్తులో సీసీటీవీ దృశ్యాలు

రోగి స్పృహలోకి వచ్చిన తర్వాత నగలు మాయమైనట్లు గుర్తించిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆసుపత్రి యాజమాన్యాన్ని ప్రశ్నించగా ఆమె తమ సిబ్బంది కాదని తేలిపోయింది. నర్సింగ్ స్టేషన్ వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో ఆ మహిళ కదలికలు రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఆమె ఆసుపత్రి పాత ఉద్యోగియా లేక బయటి వ్యక్తినా అనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Fake Doctor Robbery Hyderabad Police latest news Secunderabad News Telugu News Yashoda Hospital Theft

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.